intinti gruhalakshmi 22 april 2022 full episode
Intinti Gruhalakshmi 22 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 613 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కష్టాలు రాకుండా కాపాడు దేవుడా అంటూ మనం ఎప్పుడూ ఆయన్ను కోరుకోకూడదు. మనం పాప ఫలం అనుభవించాల్సిందే కానీ.. కష్టాన్ని తట్టుకొని నిలబడే శక్తిని ఇవ్వు అని గట్టిగా కోరుకోవాలి అని ప్రేమ్ కు చెబుతుంది శృతి. రాముడు ఎందుకు ఆదర్శవంతుడు అయ్యాడో చెబుతుంది శృతి. ఆ తర్వాత కాసేపు ప్రేమ్ ను ఆటపట్టిస్తుంది. దీంతో నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ తన వెంట పడతాడు. తనను గట్టిగా పట్టుకుంటాడు. నన్ను వదిలేయ్.. ఈరోజు పండుగ… అంటుంది. దీంతో నీ మీద ప్రేమతోనే నీతో వచ్చాను అంటుంది శృతి.
intinti gruhalakshmi 22 april 2022 full episode
కట్ చేస్తే.. తులసి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఘనంగా జరుగుతుంది. అంకిత అందరికీ హారతి ఇస్తుంది. ఇంతలో మామ్ రాముడిని ఎందుకు గొప్పవాడు అంటారు అని అడుగుతాడు అభి. దీంతో తల్లిదండ్రుల మాటను జవదాటని వ్యక్తి రాముడు. కారణం అడక్కుండా.. ఏమాత్రం ఆలోచించకుండా సతీసమేతంగా వనమాసానికి వెళ్లాడు అని చెబుతుంది తులసి. రాముడి వనమాసం అనేది ఆయన జీవితంలోనే బ్యాడ్ చాప్టర్ కదా.. నువ్వు ఇప్పుడు అది అన్నయ్యకు ఎందుకు చెబుతున్నావు అని ప్రశ్నిస్తుంది దివ్య. దీంతో అభినే తదేకంగా చూస్తుంటుంది తులసి. పూజ అయిపోయింది.. ప్రసాదం తిందాం అంటుంది దివ్య.
దీంతో అందరికీ ప్రసాదాన్ని పంచుతుంది అంకిత. పూజ అయిపోయాక.. ఇంటి బయట ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది తులసి. ఇంతలో గాయత్రి తన ఇంటికి వస్తుంది. గాయత్రిని చూసి ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. అంకితకు చిరాకు వస్తుంది.
ఇంటి బయటే తనతో ఏదో మాట్లాడుతుంది తులసి. అసలు వీళ్లు ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటారు అందరూ. ఆంటి ఇలా డైరెక్ట్ గా వచ్చేసింది ఏంటి అని అనుకుంటాడు అభి. ఆ తర్వాత ఇంట్లోకి తనను తీసుకొని వస్తుంది తులసి. అమ్మ.. అంకిత, మీ అమ్మ వచ్చింది పలకరించవేంటి అంటుంది తులసి.
దీంతో నేను పలకరించకపోయినా మా మామ్ కు ఏం తేడా ఉండదు ఆంటి. తను ఏం పట్టించుకోదు అంటుంది అంకిత. దీంతో అదేంటి తులసి.. నా కూతురును, అల్లుడును నాతో పంపిస్తానని చెప్పి ఈ డిస్కషన్ అంతా ఏంటి అని అంటుంది గాయత్రి.
దీంతో అందరూ షాక్ అవుతారు. ఏమైంది.. అందరూ నా వైపు బిత్తరపోయి చూస్తున్నారు అంటుంది గాయత్రి. అదేంటి తులసి.. విషయం వాళ్లకు చెప్పలేదా. సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నావా అని అంటుంది. పాపం.. అనవసరంగా వాళ్లను టెన్షన్ పెడుతున్నావు తులసి.
ఒక్కసారి నువ్వు డిసైడ్ చేసుకున్నాక చెప్పొచ్చు కదా. పోనీ.. నన్ను చెప్పమంటావా. విషయం ఏంటంటే.. నాకూతురు, అల్లుడును పర్మినెంట్ గా నాతో పంపడానికి తులసి ఒప్పుకుంది. తీసుకెళ్లడానికి నన్ను రమ్మంది అంటుంది గాయత్రి.
దీంతో ఏంటి తులసి గాయత్రి చెప్పేది నిజమేనా అని అడుగుతుంది అనసూయ. నాతో కలిసి ఒక్కమాట కూడా చెప్పలేదు ఏంటి మామ్ అంటాడు అభి. నీ కొడుకును కోడలును గాయత్రితో పంపడం ఏంటమ్మా.. అసలు అర్థం ఉందా అంటాడు పరందామయ్య.
చెప్పాపెట్టకుండా నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావన్న కోపంతోనే డాడీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు మామ్. నువ్వు మారలేదు మామ్ అంటుంది దివ్య. దీంతో నేను మారాను. నా స్వార్థం పక్కన పెట్టాను కాబట్టే అభి, అంకితలను గాయత్రితో పంపించేందుకు సిద్ధమయ్యాను అంటుంది తులసి.
నా కళ్లలోకి చూసి నిజం చెప్పు. మీ అత్తగారి ఆఫర్ మీద మనసు పడి ఈ ఇంటిని వదిలి వెళ్లాలని అనుకున్నావా లేదా అని సూటిగా అభిని ప్రశ్నిస్తుంది తులసి. అంటే అది.. అలాంటి ఆలోచన అయితే మనసులోకి వచ్చింది కానీ అంటాడు. దీంతో నన్ను వదిలి వెళ్లి వెళ్లడానికి ఆలోచించావు అంతే కదా అంటుంది.
నీ జీవితం బాగుంటుంది అంటే.. వెళ్లడంలో తప్పేముంది అంటుంది తులసి. మీ అత్తగారు కొన్న ఫ్లాట్ కీస్ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. నీ మనసు ఒప్పుకోబట్టే కదా. తప్పు కాదు అని అనుకుంటేనే కదా. మరి ఇఫ్పుడెందుకు మొహమాటపడుతున్నావు అంటుంది తులసి.
అంకిత నువ్వు మాట్లాడవేంటి.. నీ మనసులో ఏముందో మామ్ కు చెప్పు అంటాడు అభి. దీంతో మా మామ్ తో వెళ్లడం నాకు ఇష్టమే అంటుంది అంకిత. దీంతో అందరూ షాక్ అవుతారు. అంకిత.. తెలిసే మాట్లాడుతున్నావా అని ప్రశ్నిస్తాడు అభి.
నా మనసులో మాట చెప్పమన్నావు.. చెప్పాను. అంతకంటే డిస్కషన్ ఏముండదు అభి. నిర్ణయం జరిగిపోయింది అంటుంది అంకిత. నువ్వు ఒక్కదానివి అనుకుంటే సరిపోతుందా అంకిత అంటాడు పరందామయ్య. దీంతో ఇది నా జీవితానికి సంబంధించిన నిర్ణయం అని అంటుంది అంకిత.
నా గురించి ఆలోచించి ఎవరూ నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిది అంటుంది తులసి. ఆ తర్వాత మా మామ్ బలవంతంగా పంపించేస్తుంది అంటాడు అభి. ఒక్కసారిగా అంకిత ఎలా మనసు మార్చుకుందో అర్థం కావడం లేదు అని అంటాడు పరందామయ్య.
అంకిత మనసు మార్చేందుకు ప్రయత్నిస్తాడు పరందామయ్య. కానీ.. ఇక ఆపండి మామయ్య అంటుంది తులసి. నువ్వు అనలేని మాటలన్నీ నీ మామతో అనిపిస్తున్నావా అంటుంది గాయత్రి. ఆ తర్వాత తులసి నిర్ణయాన్ని గౌరవించి.. ఇంట్లో నుంచి అభి, అంకిత వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.