Intinti Gruhalakshmi 22 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 717 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్లయింట్ సామ్రాట్ కు ఫోన్ చేస్తాడు. దీంతో సారీ నేను మీటింగ్ కు రాలేకపోయాను అంటాడు సామ్రాట్. దీంతో నో ప్రాబ్లమ్.. తులసి గారు ప్రజంటేషన్ అద్భుతంగా ఇచ్చారు. మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం.. కంగ్రాచ్యులేషన్స్ అంటాడు క్లయింట్. దీంతో ఏం మాట్లాడాలో సామ్రాట్ కు అర్థం కాదు. క్లయింట్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు అని నందు, లాస్యతో అంటాడు. మనం తులసితో కొంచెం రాష్ గా మాట్లాడాం. పదండి.. తనకు సారీ చెబుదాం అని నందు, లాస్యను తన రూమ్ కు తీసుకెళ్తాడు. తన రూమ్ కు వెళ్లి సారీ తులసి గారు. మీ గురించి తెలిసి కూడా నేను తొందరపడ్డాను. మీ ప్రజెంటేషన్ తో మన కంపెనీకి మంచి ప్రాజెక్ట్ వచ్చేలా చేశారు. కంగ్రాచ్యులేషన్స్ అంటాడు సామ్రాట్.
దీంతో నాకు అనుభవం లేదు. అర్హత లేని బాధ్యత తీసుకున్నాను.. అంటుంది తులసి. సిన్సియర్ గా నేను మీ అందరినీ నిద్రలేపడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. మా ఇంట్లో ఎవరైనా ఏ పని అయినా చేయకపోతే నా బాధ్యతగా నేను చేస్తాను.. మీటింగ్ విషయంలోనూ అలాగే చేశాను అంటుంది తులసి. మీరు చేసింది మంచి పనే తులసి గారు. మన ప్రాజెక్టు ఓకే అయింది అంటాడు సామ్రాట్. దీంతో ప్రాజెక్ట్ ఓకే అయింది కాబట్టి నా డోర్ కొట్టారు. కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి.. ప్రాజెక్ట్ ఓకే కాకపోతే ఏంటి పరిస్థితి అంటుంది తులసి. దీంతో బాస్ అనే వాడు కూడా మనిషే. మేము తప్పులు చేస్తాం. ఇంకోసారి మిమ్మల్ని ఏ విషయంలోనూ వేలెత్తి చూపించం అంటాడు సామ్రాట్. అలాగే.. నందు, లాస్యను తులసికి సారీ చెప్పమంటాడు సామ్రాట్. దీంతో నాకు ఎవ్వరి నుంచి సారీ అవసరం లేదు. కొంచెం ఆచీతూచీ మాట్లాడితే చాలు అంటుంది తులసి. ఆ తర్వాత మీకు ఇక నుంచి ఫ్రీ హాండ్ ఇస్తున్నా. మీరు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు అంటాడు సామ్రాట్. మన ప్రాజెక్ట్ ఓకే అయిన సందర్భంగా నేను మీకు అందరికీ గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నా అంటాడు సామ్రాట్.
కట్ చేస్తే అనసూయ చేసిన కాఫీ పరందామయ్యకు నచ్చుతుంది. కాఫీ నువ్వే చేశావా.. అని అడుగుతాడు పరందామయ్య. ఎందుకు తాతయ్య అంటాడు ప్రేమ్. దీంతో మీ నానమ్మతో ఇదే సమస్య. ఒళ్లు వంగదు కానీ.. వంట మాత్రం అద్భుతంగా చేస్తుంది అంటాడు.
మరోవైపు అభి.. అంకిత ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది అనసూయ. దీంతో రేపు వస్తుంది అంటాడు అభి. నాకూ కోడలు మీద దిగులుగా ఉంది అంటుంది అనసూయ. మీ అమ్మ ఫోన్ చేసిందా అని అడుగుతుంది దివ్యను. దీంతో లేదు నానమ్మ అంటుంది దివ్య.
ఇంతలో పరందామయ్యకు మళ్లీ గుండెలో నొప్పి మొదలవుతుంది. ఇంతలో అందరూ తన దగ్గరికి వెళ్తారు. ఏమైంది అంటారు. దీంతో గుండెనొప్పి అంటుంది అనసూయ. రాత్రి కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాడు అంటుంది. వెంటనే ట్యాబ్లెట్ తీసుకొచ్చి పరందామయ్యకు వేస్తారు.
దీంతో కాస్త కుదుటపడతాడు పరందామయ్య. మరోవైపు సామ్రాట్.. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తన రూమ్ లో ఉన్న స్ట్రెచర్ చూస్తాడు. ఇది లోపల ఎందుకు ఉంది. ఇది ఎవరు తీసుకొచ్చారు అని అనుకుంటాడు సామ్రాట్. మరోవైపు నందు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.
రాత్రి తాగి నేను బాగా హడావుడి చేసినట్టు అనిపిస్తోంది అని అనుకుంటాడు నందు. ఏం చేశానో మాత్రం గుర్తుకు రావడం లేదు అని అనుకుంటాడు నందు. బయటికి వస్తాడు. అప్పుడే సామ్రాట్ కూడా బయటికి వస్తాడు. ఇద్దరూ కలుసుకుంటారు. రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుకురావడం లేదా అని అడుగుతాడు సామ్రాట్.
దీంతో నాకు గుర్తుకురావడం లేదు కానీ.. రాత్రి మనిద్దరం ఇక్కడే కూర్చొని ఏదో మాట్లాడుకున్నాం అని అంటాడు నందు. ఏం మాట్లాడుకున్నామో మాత్రం నాకు అస్సలు గుర్తుకు రావడం లేదు అని అంటాడు నందు. దీంతో నువ్వు ఏదో విషయంలో నాకు మాటిచ్చినట్టుగా గుర్తు అంటాడు సామ్రాట్.
దీంతో నేనేం మాటిచ్చాను అని అంటాడు నందు. ఇంతలో లాస్య వస్తుంది. రాత్రి మేము తాగి ఏం మాట్లాడుకున్నామో నీకు గుర్తుందా అని అడుగుతాడు నందు. దీంతో ఏదో పిచ్చి వాగుడు. దాని గురించి ఎందుకు మీకు టెన్షన్ అంటుంది లాస్య. మరోవైపు ప్రేమ్.. తులసికి ఫోన్ చేస్తాడు.
ఎక్కడున్నావు అమ్మా అంటాడు. హోటల్ లో రూమ్ లో ఉన్నా అంటుంది తులసి. తాతయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెబుతాడు. దీంతో అయ్యో అంటుంది తులసి. దీంతో నువ్వు కంగారు పడకు. తాతయ్యకు ఇప్పుడు బాగానే ఉంది అంటాడు ప్రేమ్.
నేను వెంటనే బయలుదేరి వస్తాను అని చెబుతుంది తులసి. ఇంతలో సామ్రాట్ దగ్గరికి వచ్చి మా మామయ్య గారికి ఒంట్లో బాగోలేదంట. గుండెల్లో నొప్పి ఉందంట. నేను వెంటనే బయలుదేరాలి అని అంటుంది. దీంతో నందు, లాస్య షాక్ అవుతారు. మేము కూడా వస్తాం అంటాడు నందు.
దీంతో వచ్చిన పని అయిపోయింది కదా. అందరం బయలుదేరుదాం అంటాడు సామ్రాట్. మరోవైపు విమానంలో వెంటనే హైదరాబాద్ చేరుకుంటారు అందరూ. తులసి పరిగెత్తుకుంటూ వస్తుంది. తనతో పాటు నందు, లాస్య కూడా వస్తారు. మామయ్య అంటూ పరందామయ్య దగ్గరికి వెళ్తుంది.
తులసి అంటూ పరందామయ్య లేచి కూర్చొంటాడు. ఎలా ఉంది మామయ్య అని అడుగుతుంది. దగ్గరుండి చూసుకోకుండా అనవసరంగా టూర్ కు వెళ్లి తప్పు చేశాను. అత్తయ్య డాక్టర్ ఏమన్నాడు అని అడుగుతుంది తులసి. దీంతో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదన్నారు. గ్యాస్ ట్రబుల్ అంట.. హార్ట్ స్ట్రోక్ కాదన్నారు అంటాడు ప్రేమ్. దీంతో తులసి సంతోషిస్తుంది.
మీరు రాత్రి రావాల్సింది కదా. ఇప్పుడే వచ్చేశారు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో మీటింగ్ పని పూర్తయింది అంటుంది తులసి. ఇంతలో నా కొడుకు అయితే వచ్చాడు కానీ.. ఇప్పటి వరకు పలకరించలేదు అంటాడు పరందామయ్య. తులసితో మాట్లాడిన తర్వాతే మా వంక చూస్తారు కదా అంటుంది లాస్య.
అంకిత ఎక్కడ అని అభిని అడుగుతుంది తులసి. దీంతో మెడికల్ క్యాంపుకు వెళ్లింది అని చెబుతాడు అభి. మరి వంట ఎవరు చేస్తున్నారు అని అడుగుతుంది తులసి. దీంతో ఇంకెవరు అనసూయ చేస్తుంది. అందుకే కదా.. నాకు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అంటాడు పరందామయ్య.
వచ్చింది కదా మీ కోడలు. ఇక మీకు నచ్చినట్టు చేసి పెడుతుంది లేండి అంటుంది అనసూయ. దీంతో లాస్యకు కోపం వస్తుంది. ఇంతలో శృతి అక్కడికి వస్తుంది. శృతిని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.