intinti gruhalakshmi 22 december 2021 full episode
Intinti Gruhalakshmi 22 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 509 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య, నందు పెళ్లి పనులు జోరుగా కొనసాగుతుంటాయి. తన పెళ్లి కోసం కుటుంబ సభ్యులు అందరికీ బట్టలు తీసుకొస్తుంది లాస్య. దీంతో ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు.. అంటూ అనసూయ అంటుంది. ఏంటి లాస్య ఇదంతా అంటే.. పెళ్లి కదా.. బట్టలు తీసుకొచ్చాను నందు అంటుంది లాస్య. భాగ్య కూడా ఏదో అనబోతుంది. కుటుంబ సభ్యులు అందరూ సీరియస్ గా చూస్తారు. ఒక్కరూ మాట్లాడరు. ఉలుకూ పలుకూ ఉండదు. ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు. నలుగు పెట్టుకోవడం అంటే నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను. కానీ.. పెళ్లి అంటే అలా కాదు కదా.. అందరూ ఉండాలి కదా. నా పెళ్లికి అందరూ ఇవే బట్టలు వేసుకొని రావాలి అంటుంది లాస్య.
intinti gruhalakshmi 22 december 2021 full episode
నందు.. పెళ్లి కొడుకు ఫ్యామిలీతో పాటే భారత్ లో రావాలి. అందరినీ దగ్గరుండి తీసుకురావాల్సిన బాధ్యత నీదే అంటుంది లాస్య. ఇక నేను వెళ్తున్నా.. మీరు అందరూ తొందరగా రెడీ అవ్వండి. అత్తయ్య మీరు నా తోడు పెళ్లి కూతురు.. అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్తుంది లాస్య. మరోవైపు తులసి దగ్గరికి వెళ్తాడు నందు. తులసి.. ఒక్క నిమిషం అంటాడు. కానీ.. తులసి మాట్లాడటానికి నిరాకరిస్తుంది. ఎందుకు అలా దూరంగా వెళ్లిపోతున్నావు అంటాడు నందు. నాకు ఇప్పుడు మీదో మాట్లాడటం ఇష్టం లేదు అంటుంది. సరే.. నువ్వు మాట్లాడకు. కానీ.. నేను చెప్పేది విను అంటాడు నందు. మన విడాకుల సమయంలో నేను కూడా ఇలాగే మాట్లాడాను. ఇలాంటి బాధే అనుభవించాను.. అంటుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం లాస్య, భాగ్య చూస్తుంది. చూసి షాక్ అవుతుంది లాస్య. వావ్.. ఎంతైనా బావ గారు లక్కీ ఫెలో. ఓవైపు కాబోయే భార్య.. మరోవైపు మాజీ భార్య.
పెళ్లికి ముందు ఎవరైనా తనకు కాబోయే భార్యకు చాటుగా కలుసుకొని తన అచ్చటా ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ.. బావ గారు మాత్రం తన మాజీ భార్యతో ఆ ముచ్చట్లు తీర్చుకుంటున్నాడు. నాకు తెలిసి.. నీ పెళ్లి జరిగే దాకా నమ్మకం కుదరడం లేదు… అంటుంది భాగ్య.
లాస్యను భాగ్య రెచ్చగొడుతుంది. దీంతో నందు.. అని పిలుస్తుంది. అప్పటికే తులసి వెళ్లిపోతుంది. ఇంకాసేపట్లో మన పెళ్లి గుర్తుందా? ఏ మురిపం అయినా.. ఏ ముచ్చట్లు అయినా నాతోనే. నువ్వు నాతోనే ఉండాలి. అవతల ముహూర్తం దగ్గర పడుతోంది. వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో నందు. బీ యాక్టివ్ అంటుంది లాస్య.
లాస్య బావ గారు చూశావా.. తన దగ్గర తప్పు లేకపోతే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అలా తలదించుకొని వెళ్తున్నాడేంటి అంటుంది. ఏం చేసినా.. ఇవాళ నా పెళ్లి జరగాల్సిందే. ఆ తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరు నా ట్యూన్ కు సెట్ అవ్వాల్సిందే అని అంటుంది లాస్య.
మరోవైపు తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. నన్నెందుకు ఈయన ప్రతి దాంట్లో లాగుతున్నాడు. నా మానాన నేను ఉంటే ఈ గొడవ నాకెందుకు. నేను ఇక్కడ ఉంటే నాకు ఇదే టెన్షన్. నేను ఇక్కడ ఉండను వెళ్లిపోతా అంటూ బయటికి వెళ్లబోతుంది. ఇంతలో కృష్ణ ఫోన్ చేస్తాడు.
తులసి.. మీ ఆపరేషన్ ఇవాళ పోస్ట్ పోన్ అయింది కదా.. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ ఉంటుంది. వెంటనే డాక్టర్ సునీత ఒపినియన్ తీసుకుందాం. వెళ్దాం వస్తారా అని అంటాడు. దీంతో సరే వస్తాను నేను రెడీగానే ఉన్నాను అని చెబుతుంది తులసి.
మరోవైపు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. తన రూమ్ లోకి వెళ్లి కొత్త డ్రెస్ వేసుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చి కోపం వస్తుంది తనకు. ఇంతలో అనసూయ అక్కడికి వస్తుంది. మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎందుకు ఈ పెళ్లి చేసుకోవడం.. అంటుంది.
తులసి మెండితనం చేసిందని విడాకులు తీసుకున్నావు. లాస్య మొండితనం చేసిందని పెళ్లి చేసుకుంటున్నావు.. నీకంటూ ఏ ఆలోచన లేదా అంటుంది. కుటుంబ సభ్యులు అందరూ నందు దగ్గరికి వస్తారు. నీ మనసులో మాట లాస్యకు చెప్పే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకేం కాపురం చేస్తావురా నువ్వు దానితో అంటుంది అనసూయ.
నీ పెళ్లి నీ ఇష్టం.. కానీ.. ఆ తర్వాత అనుభవించేది కూడా నువ్వే.. అంటుంది అనసూయ. మేము మాత్రం మీ పెళ్లికి రావడం లేదు అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ.. దివ్య మాత్రం అక్కడే ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్తావా? పెళ్లికి రావా అంటాడు. దీంతో దివ్య.. నందును పట్టుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత వెళ్లిపోతుంది.
తులసి బయటికి వెళ్లబోయే లోపు అక్కడికి లాస్య వస్తుంది. తులసి.. ఈ చీరలో ఎలా ఉన్నాను అని అడుగుతుంది. నందుతో పెళ్లి అవుతున్నందుకు లాస్య ఆగదు. నీకు కాబోయే భర్త మాజీ భార్య గురించి నీకెందుకు బాధ అంటుంది తులసి. నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటుంది తులసి.
కట్ చేస్తే.. పెళ్లి సమయం దగ్గర పడుతుంది. కానీ.. నందు ఇంకా రాడు. లాస్య రెడీ అయి పెళ్లి మండపం వద్ద నందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్లి అందరినీ అడిగితే మాకు తెలియదు. నందు ఇంట్లో లేడు అని చెబుతుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.