Home » Entertainment » Intinti Gruhalakshmi 22 January 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 22 Jan Today Episode : అంకిత, శృతికి తులసి షాక్.. పండుగ పనులన్నీ చేయాలని ఆదేశం.. పండుగ పూజ విషయంలో లాస్య, తులసి మధ్య గొడవ దేనికి దారి తీయబోతోంది?

Authored By
Varun G
The Telugu News | Published on: January 22, 2022, 9:00 am
Advertisement

Intinti Gruhalakshmi 22 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జనవరి 2022, శనివారం ఎపిసోడ్ 536 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తల్లిగా నువ్వు ఓడిపోయావంటూ నందు తులసిని అందరి ముందు నిలదీసిన విషయం తెలిసిందే. దీంతో నా పిల్లలు నామీద ఆధారపడకుండా ఉండాలని అనుకుంటుంది. దీంతో వాళ్లు వాళ్ల కాళ్ల మీద నిలబడాలి అనుకుంటుంది. ఇంతలో రేపు రాబోయే పండుగ గురించి శృతి, అంకిత అడుగుతారు. నేను లేకుంటే చేయరా.. పండక్కి ఏం కావాలి అనేది మీరే చూసుకోండి. నేను లేకపోతే ఏం చేస్తారు. సరుకులు మీరే తీసుకొచ్చి అన్ని పనులు మీరే దగ్గరుండి చేయాలి అని శృతి, అంకితకు చెబుతుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

intinti gruhalakshmi 22 january 2022 full episode

పిల్లలు ఇంకా నా మీదనే ప్రతి పనికి ఆధారపడుతున్నారని చాలా బాధపడుతూ ఉంటుంది తులసి. మరోవైపు నందు అన్న మాటలు గుర్తొచ్చి ఇంకా బాధపడుతుంది తులసి. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. తులసి నీతో మాట్లాడుదాం అని వచ్చాను అంటాడు నందు. మీ భార్య పర్మిషన్ తీసుకొని వచ్చారా.. చెప్పి వచ్చారా అంటుంది. నేను మీ గురించి టెన్షన్ పడటం లేదు. నా గురించి.. నా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. నా మీద కోపంగా ఉందా అంటాడు నందు. ఎందుకు అంటుంది తులసి. పిల్లల ముందు నిన్ను అవమానించాను కదా అంటాడు నందు. పాతికేళ్ల పాటు సంసారం చేసిన బంధం మనది. మీకు అనే హక్కు ఉంది.. అంటుంది తులసి. నేను ఆవేశంతో మాట్లాడానేమో కానీ.. నిజమే మాట్లాడాను. ఎందుకంటే పిల్లలు దారితప్పుతారేమోనని అలా అన్నాను అంటాడు నందు.

Advertisement

నువ్వు పిల్లల విషయంలో నా నుంచి నీకు ఎలాంటి సాయం కావాలన్నా అడుగు తులసి. పిల్లలతో నువ్వు బాగా ఉండు. అలా చేయకు తులసి.. అని సర్దిచెబుతాడు నందు. మరోవైపు సంక్రాంతికి కావాల్సిన సరుకుల లిస్టు రాస్తూ ఉంటారు అంకిత, శృతి.

ఏం సరుకులు కావాలి.. అది కావాలి ఇది కావాలి అని లిస్టు రాస్తూ ఉంటారు. బెల్లం, నూనె, రవ్వ, పాయసం కోసం చక్కెర రాయి అని శృతి చెబుతూ ఉంటుంది. ఇంతలో తులసి వచ్చి ఏమైంది లిస్టు రాయడం పూర్తయిందా అని అడుగుతుంది తులసి. లిస్టు రాయడం ఇలా కాదు.. ఇలా రాస్తే ఏదో ఒకటి మరిచిపోతాం. అందుకే.. ఉదయం లేచినప్పటి నుంచి ఏ పనులు చేస్తామో వాటిని రాయాలి అంటుంది తులసి.

Advertisement

దీంతో తనే లిస్టు రాసి అంకితకు ఇచ్చి వెళ్లి సరుకులు తీసుకురా అంటుంది. ఇంతలో అనసూయ వచ్చి.. అయిందా కోడళ్లకు పని చెప్పడం పూర్తయిందా అంటుంది అనసూయ. వాళ్లకు కూడా బాధ్యత తెలియాలి కదా అంటుంది తులసి. మీరు కూడా మీ మందులు ఎప్పుడు వేసుకోవాలో అన్నీ ఇక నుంచి మీరే చూసుకోవాలి అంటుంది.

Intinti Gruhalakshmi 22 Jan Today Episode : లాస్య ఈ పూజ చేయడం లేదని షాకిచ్చిన అనసూయ, తులసి

ఇంతలో లాస్య వచ్చి.. అత్తయ్య నాకు ఏదైనా పని చెప్పండి అంటుంది లాస్య. మరోవైపు తులసి.. నువ్వు ఈ పండుగ సమయంలో కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్లిరా అంటుంది. నా గురించి నువ్వు అంత బాధపడాల్సిన అసవరం లేదు.. అని చెబుతుంది తులసి.

అయినా రేపు పూజ చేయబోతోంది నువ్వు కాదు. మన తర్వాతి తరం కోడళ్లు. ఈ ఇంటికి నువ్వు కోడలుగా రాలేదు. అత్తగా వచ్చావు అని చెబుతుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది. అత్తయ్య నువ్వు నాకు మాటిచ్చావు కదా.. మళ్లీ ఇలా చేశారేంటి. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తారా అని చెప్పి వెంటనే నందు దగ్గరికి వెళ్తుంది లాస్య.

మనింట్లో ధాన్యలక్ష్మి పూజను సంక్రాంతి రోజున చేస్తారు కదా అంటుంది. అవును చేస్తారు అంటాడు. మరి ఆ పూజలో మనిద్దరం కూర్చోవాలి కదా అంటుంది లాస్య. దీంతో సరే అంటాడు. కానీ.. ఈసారి కొత్త తరం కోడళ్లు అంకిత, శృతితో చేయిస్తారట.. అంటుంది. దాంట్లో తప్పేముంది అంటాడు నందు.

Advertisement

దీంతో కరెక్టే కదా లాస్య. నువ్వు ఈ ఇంటికి కోడలుగా రాలేదు. కోడళ్లకు అత్తగా వచ్చావు అంటాడు నందు. నాకు ఎదిగిన కూతురు ఉంది. ఇద్దరు కోడళ్లు ఉన్నారు అంటాడు నందు. నందు కూడా తన మాట వినకపోయేసరికి… ఈ పూజ ఎలాగైనా నేనే చేసేలా చేయాలి అని అనుకుంటుంది లాస్య.

మరోవైపు పనిమనిషి రాములమ్మ ఇంటికి వస్తుంది. తనను చూసి సంతోషం వ్యక్తం చేస్తుంది తులసి. ఇంతలో సామాన్లు తీసుకొని వస్తారు అంకిత, శృతి. హమ్మయ్య రాములమ్మ వచ్చింది కదా.. ఇక మాకు పని తప్పింది అంటారు. రాములమ్మ వచ్చినా సరే.. పండుగ పూట పనులన్నీ మీరే చేయాలి అంటుంది తులసి.

ఇంతలో దివ్య, అభి, ప్రేమ్ వస్తారు. అందరికీ పనులు చెబుతుంది తులసి. ఇన్ని రోజులు మీకు కష్టం తెలియకుండా పెంచాను. కానీ.. ఇప్పుడు ఆ పొరపాటు దిద్దుకుంటున్నాను అంటుంది తులసి. ఉదయం నాలుగు గంటలకే రేపు లేవాలి అంటుంది తులసి.

దీంతో అందరూ వామ్మో.. నాలుగు గంటలకా అని అనుకుంటారు. అందరూ ఉదయమే లేచి భోగి సంబురాలు జరుపుకుంటారు. పిండి వంటలు చేస్తారు. అందరూ ఒక్కో పని చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి