Intinti Gruhalakshmi 22 June Today Episode : తులసి బ్యాంక్ లోన్ 20 లక్షల డబ్బులు కాజేసిన లాస్య.. ఆ డబ్బుతో కంపెనీ కొన్న నందు.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 22 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 665 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేనే ఆంటి ప్లేస్ లో ఉండి ఉంటే.. ముందు నీ చెంప పగులగొట్టేదాన్ని. ఇంకెప్పుడూ నువ్వు ఆంటిని మామ్ అని పిలవకు. ఆ అర్హత నువ్వు కోల్పోయావు అని అభిని నిలదీస్తుంది అంకిత. ఇందాక ఏమన్నావు.. ఆంటి నన్ను మరో తులసిని తయారు చేస్తుందనా.. నిజంగా అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను. కానీ.. ఒక్కటి.. నువ్వు నందగోపాల్ లా మారితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. తులసి ఆంటిలా నీ కాళ్లు చేతులు పట్టుకొని బతిమిలాడను.. చంపేస్తాను అంటుంది అంకిత. అలా చేయకపోతే నీలాంటి వందల మంది నందగోపాల్ లు పుట్టుకొస్తారు. బెదిరింపులతో కాపురాలు నిలబడవు అని అంటుంది అంకిత.

Advertisement

intinti gruhalakshmi 22 june 2022 full episode

లేకపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు.. నేను కాదు. నన్ను అక్కున చేర్చుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ.. నేను లేకుండా నీ అత్తారింట్లో నీకు వాల్యూ అస్సలు ఉండదు. అప్పుడు నీకు చివరికి మిగిలేది ఈ ఇల్లే అని చెప్పి అందరికీ దండం పెడుతుంది అంకిత. దీంతో అక్కడి నుంచి నందు, లాస్య, గాయత్రి, అభి వెళ్లిపోతారు. దీంతో తులసి అక్కడే కుప్పకూలిపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో ఏమైంది అని అందరూ తన చుట్టూ చేరుతారు. ఊరుకోండి ఆంటి.. ఏడవకండి అంటుంది అంకిత. జీవితంలో నేను అనుభవించిన ఏ కష్టం పెట్టనంత బాధ ఈరోజు నా బిడ్డ వల్ల కలిగింది. నేను గుండెల్లో పెట్టుకొని పెంచిన బిడ్డ నా గుండెల్లో గునపాన్ని దింపాడు. నా బిడ్డల కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తే నాది మొండితనం, మూర్ఖత్వం అన్నాడు. నిజమేనా మామయ్య.. అభి చెప్పినట్టు నేనే తప్పు చేశానా.. నా జీవితాన్ని నేనే నాశనం చేశానా? మీ జీవితాన్ని కూడా నేనే నాశనం చేస్తున్నానా? అని అడుగుతుంది అంకితను.

Advertisement

దీంతో అదేం లేదు ఆంటి అంటుంది అంకిత. మరి ఎందుకమ్మా వాడు అంతలా అసహ్యించుకుంటున్నాడు అంటుంది తులసి. నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా అంటాడు పరందామయ్య. దివ్య కూడా తులసిని ఓదార్చుతుంది. ఈ గొడవ అంతా నా వల్లే ఆంటి.. చెప్పినా వినకుండా ఇంట్లో ఉండిపోయాను. నా వల్ల మీరు బాధపడుతున్నారు. సారీ ఆంటి అంటుంది అంకిత.

Intinti Gruhalakshmi 22 June Today Episode : అభి విషయంలో కోపంతో రగిలిపోయిన ప్రేమ్

కట్ చేస్తే శృతి ఏదో పని చేసుకుంటూ పాటలు వింటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు. చాలా కోపంగా ఉంటాడు. ఏమైంది అని అనుకుంటుంది. చిరాకుతో సెల్ లో పాట ఆపేస్తాడు ప్రేమ్. దీంతో బయట గొడవలు, బయట చిరాకులు ఇంట్లోకి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటుంది శృతి.

దీంతో ఇది బయటి గొడవ కాదు.. ఇంట్లో సమస్య అంటాడు. ఏమైంది అంటుంది. అభి గురించి అంటాడు. అసలు వీడు అత్తవారింటికి వెళ్లి కూర్చోవడమే తప్పు.. అది కాదని.. అంకిత పుట్టిల్లును వదిలేసి అత్తవారింటికి వచ్చిందట. అమ్మే కావాలని అంకితను ఇంటికి పిలిపించుకుందంటూ అందరూ అమ్మను బ్లేమ్ చేస్తున్నారు అంటాడు ప్రేమ్.

ప్రేమ్ కు డబ్బు ఇస్తానని అంకిత మాట ఇచ్చింది. ఆ విషయంలోనే గొడవ అయిందా అని అనుకుంటుంది శృతి. విషయం ఏంటో.. అంకితకు కాల్ చేద్దామా.. వద్దులే అంకిత మాట్లాడే వరకు వెయిట్ చేస్తా అని అనుకుంటుంది. ఇంతలో ప్రేమ్ మాత్రం నేను రేపే వెళ్లి అభిని దులిపేస్తాను అంటాడు ప్రేమ్.

అలాంటి పిచ్చిపని నువ్వు చేయకు ప్రేమ్ అంటుంది శృతి. ఇప్పుడు నువ్వు వెళ్లి గొడవ పెట్టినా.. తులసి ఆంటినే రెచ్చగొట్టి పంపించింది అని అనుకుంటారు. దీంతో కొడుకును అయి ఉండి అమ్మను పట్టించుకోకుండా చేతులు ముడుచుకొని కూర్చోమంటావా అంటాడు ప్రేమ్. నీలాగా నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను అని శృతితో చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్.

మరోవైపు తులసి రాత్రి పూట పాటలు పాడుతూ బయట కూర్చొంటుంది. తన పాటలు విని అంకిత బయటికి వస్తుంది. సూపర్ గా పాడుతున్నారు అంటుంది అంకిత. ఏదో కాలక్షేపం కోసం పాటలు పాడేదాన్ని. కానీ.. ఇప్పుడు అదే నాకు బతుకు తెరువు అయింది అంటుంది తులసి.

ఇంతలో శృతి.. అంకితకు కాల్ చేస్తుంది. నువ్వు మాకు మనీ ఇచ్చే విషయంలోనే గొడవ జరిగింది కదా.. నేను వెళ్లి అభికి సారీ చెప్పి వస్తాను అని చెబుతుంది శృతి. పెద్ద వాళ్ల మాట వినకుండా అభిని పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి నాకు మామ్ కు ఈ గొడవలు మామూలే… అది నీకూ తెలుసు అంటుంది అంకిత.

ఎందుకో కానీ.. మళ్లీ నన్ను దగ్గర చేసుకుందామనుకుంది. ఆంటి చెప్పింది కదా అని నేనూ దగ్గరవుదామనుకున్నా. మా మామ్ కు నేనంటే విలువ లేదని క్లారిటీగా తెలుసుకున్నాకే నేను వచ్చేశాను అంటుంది అంకిత. నా వల్ల గొడవ పడుతున్నారని నేను ఇక్కడ బాధపడుతున్నాను అంటుంది శృతి.

నా కోడళ్లను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటుంది తులసి. సమస్యను ఇద్దరూ అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు. ఇదే కావాల్సింది. తల్లీకొడుకుల మధ్య సఖ్యత లేదు.. కానీ.. తోడి కోడళ్ల మధ్య సఖ్యత ఉంది. ఇది చాకలమ్మా ఈ కుటుంబం నిలబడటానికి అంటుంది తులసి.

ఎప్పుడూ ఇలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కలిసి ఉండండి అని శృతితో చెబుతుంది తులసి. మరోవైపు కంపెనీ కోసం డబ్బుల విషయంలో లాస్య, నందు మధ్య గొడవ అవుతుంది. ఇంకో రెండు రోజులు ఆగు నందు.. డబ్బులు వస్తాయి అంటుంది లాస్య.

రెండు రోజుల్లో డబ్బులు నీ చేతుల్లో పెడతాను.. అంటుంది. కానీ.. నందుకు మాత్రం లాస్య మీద నమ్మకం కలగదు. మళ్లీ ఏదో ఒక కెఫెలో ఉద్యోగం వెతుక్కోవాలి అని అంటాడు నందు. మరోవైపు తులసి దగ్గరికి వెళ్లిన బ్యాంకు బ్రోకర్ బ్లాంక్ చెక్ మీద తులసి సంతకం పెట్టించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

1 day ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

3 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

3 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

4 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

4 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

4 days ago