Intinti Gruhalakshmi 22 March Today Episode : ప్రేమ్ ఆటో నడుపుతున్నాడని తెలుసి తులసి షాక్.. దివ్యకు ప్రేమ్ వార్నింగ్.. ఇంతలో ట్విస్ట్

Intinti Gruhalakshmi 22 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 586 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ బర్త్ డే విషయం తెలుసుకొని బాబురావు, ఆయన భార్య ఇద్దరూ వచ్చి కాసేపు హడావుడి చేస్తారు. ఆ తర్వాత రాములమ్మ బర్త్ డే కేక్ తీసుకొస్తుంది. అందరూ కలిసి బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. మీ అమ్మ నీ దగ్గర లేకపోయినా నీకు మేమున్నాం. దేనికీ మొహమాటపడకు అంటుంది బాబురావు భార్య. నీ పుట్టిన రోజు సందర్భంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అంటుంది. నడుపుకోవడానికి అద్దెకు ఆటో అడిగావట కదా రాములమ్మ చెప్పింది మాట్లాడి పెట్టాను అంటుంది. ఇదిగో కీస్ అని బాబురావు దాని కీస్ ఇవ్వబోతాడు.

intinti gruhalakshmi 22 march 2022 full episode

ఈ విషయం తెలిసి శృతి షాక్ అవుతుంది. ఆటో అడగటం ఏంటి ఆంటి అంటుంది. ఇల్లు గడవడం కష్టంగా ఉందని ప్రేమ్ బాబు ఆటో నడుపుతా అన్నా. అదే కాంతం అక్కకు చెప్పాను అంటుంది రాములమ్మ. కానీ.. శృతికి చాలా కోపం వస్తుంది. దీంతో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది శృతి. కట్ చేస్తే గుడి నుంచి తులసి ఇంటికి తిరిగి వస్తుంది. ఒక్క నిమిషం ఆంటి.. అని అంకిత ఆపుతుంది. ఈరోజు ప్రేమ్ బర్త్ డే కదా ఆంటి అని అంటుంది. దీంతో నువ్వు దీని గురించే మాట్లాడాలి అంటే నాతో మాట్లాడొద్దు అని వెళ్లిపోతుంది.

మరోవైపు శృతి బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. తప్పు చేశాను శృతి అంటాడు ప్రేమ్. బాధ పెట్టడం కాదు. నా గుండెకు గాయం చేశావు అంటుంది శృతి. నా మీద నమ్మకం ఉంది అనుకున్నాను కానీ.. నన్ను అనుమానపడతావని అనుకోలేదు అంటుంది శృతి.

నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అంటుంది శృతి. నీతో కలిసి జీవితం పంచుకోవడానికే నేను నీతో కలిసి వచ్చాను. ఎందుకు నన్ను పరాయిదానిలా చూస్తున్నావు. ఎందుకు నాతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నావు. నా తప్పు ఏమైనా ఉంటే చెప్పు సరిదిద్దుకుంటాను. అంతే కానీ.. నన్ను దూరం చేయకు అంటుంది శృతి.

శృతి నన్ను అర్థం చేసుకో. బర్త్ డే మూడ్ లో ఎందుకు ఈ విషయం చెప్పడం. తీరిగ్గా రాత్రి మాట్లాడుదామనుకున్నా. ఈలోపే ఈ విషయం తెలిసింది. అంతకుమించి ఇంకేం చేయాలనుకోలేదు అంటాడు. దీంతో నిజంగానా అంటుంది శృతి. దీంతో అవును అంటాడు.

Intinti Gruhalakshmi 22 March Today Episode : తులసి పడుతున్న కష్టాలు చూసి చలించిపోయిన పరందామయ్య

అయినా కూడా నీకు శిక్ష పడాల్సిందే అంటుంది శృతి. లోపలకి రా అంటుంది. కట్ చేస్తే తులసి… ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పరందామయ్య వస్తాడు. ప్రేమ్ నా ప్రాణం.. ఎలాగైనా రక్షించుకుంటా.. అని పరందామయ్యతో చెబుతుంది.

ఒకవైపు ఇంటి మీద ఉన్న అప్పు.. మరోవైపు ప్రేమ్ సమస్య.. ఇంట్లో వాళ్లతో తలనొప్పి.. ఏంటమ్మా ఇది అంటాడు పరందామయ్య. నువ్వు ఓపికగానే ఉన్నావు కానీ.. ఇంట్లో వాళ్లకే ఓపిక లేదు అంటాడు పరందామయ్య. ప్రేమ్ ను ద్వేషిస్తున్నావు అనుకుంటన్నారు కానీ.. నువ్వు వాడి కోసం గుడికి వెళ్లావు అని వాళ్లకు తెలియదు అంటాడు పరందామయ్య.

నేను చేసే పనులు కాదు.. ఫలితాలు కనబడాలి అనుకుంటాను మామయ్య అంటుంది తులసి. కట్ చేస్తే దివ్య.. ప్రేమ్ ఇంటికి వెళ్తుంది. ప్రేమ్ ను చూసి చాలా సంతోషిస్తుంది దివ్య. ప్రేమ్ ఉంటున్న ఇంటిని చూసి షాక్ అవుతుంది దివ్య. లా ఉంటున్నారు ఇక్కడ అంటుంది.

ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం అయినా అమ్మదే ఫైనల్. అందుకే.. అమ్మకు తెలియకుండా నువ్వు ఎందుకు వచ్చావు. అమ్మ ఒప్పుకుంటేనే ఇక్కడికి రా అంటున్నా అంటాడు ప్రేమ్. అమ్మ ఏం చేసినా మన మంచికే చేస్తుంది. అమ్మకు అపార్థం చేసుకోవద్దు అంటాడు ప్రేమ్.

దీంతో కోపంతో దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ప్రేమ్ ఆటోకు పూజ చేసి నడపడానికి బయటికి వెళ్తాడు. తులసి.. ప్రేమ్ ఆటో ఎక్కుతుంది. కానీ.. డ్రైవ్ చేసేది ప్రేమ్ అనే విషయం తులసికి తెలియదు. ముఖానికి కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటాడు.

తులసి ఆటో దిగి డబ్బులు ఇస్తుండగా.. డబ్బులు కింద పడేసినట్టుగా చేసి తన కాళ్లను నమస్కరిస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ మాస్క్ తీసి ఆటో నడుపుతూ వెళ్తుండటం తులసి చూసి షాక్ అవుతుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

48 minutes ago

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

10 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

11 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

13 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

15 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

17 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

19 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

20 hours ago