Intinti Gruhalakshmi 22 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 744 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, లాస్య.. లక్కీని తీసుకొని కారులో వస్తారు. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది లాస్య. లక్కీని చూసి ఏంటి ఈరోజు స్కూల్ లేదా అంటాడు సామ్రాట్. హనీ కోసం వచ్చాడు అంటుంది లాస్య. హనీ రికవరీ అయ్యేంత వరకు లక్కీ ఇక్కడే ఉంటాడు అంటుంది లాస్య. మరోవైపు తులసి ఫ్యామిలీ మొత్తం కారులో సామ్రాట్ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్లను చూసి లాస్య షాక్ అవుతుంది. మావాడు ఇందాకటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాడు అని అంటాడు బాబాయి. హనీ హాండ్ నార్మల్ అయ్యేంత వరకు తులసి గారిని ఇక్కడే ఉండమన్నాను అంటాడు సామ్రాట్. మీరు వచ్చాక ఇక నేను హనీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటాడు సామ్రాట్. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాను కానీ.. హనీని వదిలి నేను ఉండలేను అంటాడు సామ్రాట్. నా మాట మన్నించి వచ్చినందుకు థాంక్స్ అంటాడు సామ్రాట్.
ఇంతకీ హనీ ఏది అని అడుగుతారు అందరు. దీంతో గదిలో పడుకుంది అంటాడు సామ్రాట్. మేము వచ్చాక తనను పడుకోనిస్తామా? పదండి.. తనను నిద్రలేపుదాం అంటారు అందరూ. తన దగ్గరికి వెళ్లి హనీ నిద్ర లేపుతారు. నన్ను చూడటానికి వచ్చారా అని అడుగుతుంది హనీ. దీంతో నీకు నొప్పి తగ్గేంత వరకు ఇక్కడే ఉండేందుకు వచ్చాం అని అంటుంది తులసి. అయితే.. నా నొప్పి ఇంత త్వరగా తగ్గకూడదు అని అంటుంది హనీ. ఎందుకు అని అంటుంది తులసి. దీంతో నాకు నొప్పి తగ్గిపోతే మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు కదా. అందుకే అంటుంది హనీ. తర్వాత తనను లేపి తనను రెడీ చేయించి తనకు టిఫిన్ తినిపిస్తుంది తులసి.
తర్వాత తను బయటికెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. నందును చూసి షాక్ అవుతుంది తులసి. అర్జెంట్ గా నావాళ్లను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు నందు. వెళ్లకపోతే అంటుంది తులసి. దీంతో వెళ్లి తీరాలి అంటాడు నందు. విడాకులు ఇచ్చేశాను కదా.. ఇంకా ఏంటి నీ సమస్య అని అడుగుతుంది తులసి.
నా వాళ్ల ముందు నన్ను హేళన చేస్తున్నావు. నా జీవితాన్నే నాశనం చేస్తున్నావు అంటాడు నందు. దీంతో నాకు అపకారం చేసిన వాళ్లకు కూడా నేను ఉపకారం చేయాలనే అనుకుంటున్నాను కానీ.. అపకారం చేయాలనుకోవడం లేదు. దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు అంటుంది తులసి.
ఇంట్లో వాళ్లందరూ చిన్నపిల్లలు కాదు. మానవత్వంతో వచ్చారు. ఈ ఇంట్లో వాళ్లు తన వాళ్లు అనుకొని వచ్చారు అని అంటుంది తులసి. తనవాళ్లంటే అని అడుగుతాడు నందు. మీకేం అర్థం అయింది అని అడుగుతుంది తులసి. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు చేసేవన్నీ చూస్తూనే ఉన్నా అంటాడు నందు.
ఆడది పరాయి మగాడితో మాట్లాడితే తప్పు.. నవ్వితే తప్పు.. మగ స్నేహితుడు ఉంటే తప్పు అంటుంది తులసి. పెళ్లి కాకముందే మన బెడ్ రూమ్ లోకి లాస్యను తీసుకురాలేదా అని అడుగుతుంది తులసి. నువ్వు ఏమైనా చేసుకో.. నీ జీవితం నీ ఇష్టం. కానీ.. నా కుటుంబంలో సామ్రాట్ గారిని మాత్రం తీసుకురావద్దు అని అంటాడు నందు.
అత్తయ్య మామయ్యకు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఏమైనా చెప్పుకోవచ్చు అంటుంది తులసి. మరోవైపు అభి కూడా అంకితతో మాట్లాడుతాడు. హనీని నెత్తిన వేసుకొని మనం తిరగాలా అని అడుగుతాడు. నేను నోరు విప్పితే అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు అని అంటాడు అభి.
నీ మీద లాస్య ఆంటి ఇన్ ఫ్ల్యూయెన్స్ ఉంది. లాస్య ఆంటి లాగానే నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటుంది అంకిత. మరోవైపు ఆఫీసు పని కూడా ఇంట్లో నుంచే చేస్తాడు సామ్రాట్. తర్వాత అందరూ కలిసి హనీతో అడుకుంటూ ఉంటారు. నాన్నా లక్కీ నిన్ను కూడా పిలవమన్నాడు ఆడుకోవడానికి అంటుంది హనీ.
దీంతో ఒక 5 నిమిషాలు.. వర్క్ అవగానే వస్తాను అంటాడు సామ్రాట్. మీ లక్కీ పక్కన ఉంటే హనీ ఒంటరిగా అస్సలు ఫీల్ అవ్వదు అంటాడు సామ్రాట్. ఇంతలో సామ్రాట్ జనరల్ మేనేజర్ కు ఫోన్ వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కనే ఇల్లు ఏదైనా రెంట్ కు తీసుకుందామని నందు ప్రపోజ్ చేశాడు అంటుంది లాస్య.
మరోవైపు సామ్రాట్ జనరల్ మేనేజర్ ఏదో ఫ్రాడ్ చేసేందుకు ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతుంటాడు. దీంతో బయటే ఉన్న తులసి అతడిని చూసి సామ్రాట్ దగ్గరికి తీసుకొస్తుంది. దీంతోఅతడిని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. కంపెనీ జనరల్ మేనేజర్ గా తులసిని అపాయింట్ చేస్తాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Yoga Benefits : ప్రస్తుత కాలంలో నడుము మరియు వెన్ను, మెడ నొప్పి అనేది పెద్ద సమస్యగా మారాయి. అయితే వెన్ను…
Honda Activa CNG : హోండా లో సక్సెస్ ఫుల్ స్కూటర్ అయిన యాక్టివా నుంచి కొన్నాళ్లుగా సి.ఎన్.జి వేరియంట్…
Ajwain Leaves : మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మరియు ఆకులు, పూలు, కాయలు, వేర్లు అనేవి మన శరీరానికి రోగనిరోధక…
Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద తెలంగాణా రాష్ట్రం రైతులకు విడతల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో…
Empty Stomach : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అలాగే ఈ…
Sunset : సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతుంది ఇది ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చీకటిలో…
Mangal Dosha : జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21వ తేదీ నుండి…
Vastu Tips : కొన్ని మొక్కలు వాస్తు ప్రకారంగా ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటిని ఉంచడం వలన వాస్తు దోషాలు…
This website uses cookies.