Home » Entertainment » Intinti Gruhalakshmi 23 August 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 23 Aug Today Episode : తులసిని బ్లేమ్ చేసిన లాస్య, నందు.. తులసి, సామ్రాట్ ప్రేమించుకుంటున్నారని టామ్ టామ్ చేశారు

Authored By
Varun G
The Telugu News | Updated on: August 23, 2022, 9:43 am
Advertisement

Intinti Gruhalakshmi 23 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 718 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్యకు బాగాలేదని తెలుసుకొని శృతి తులసి ఇంటికి వస్తుంది. శృతిని చూసి అందరూ సంతోషిస్తారు. ఎలా ఉంది తాతయ్య.. ప్రమాదం ఏం లేదు కదా అంటుంది శృతి. లేదమ్మా సంతోషంగా ఉంది. కనీసం ఇలా అయినా నాకు కనిపించావు అంటాడు పరందామయ్య. ఎంత కాలం అయిందమ్మా నిన్ను చూసి.. కనీసం ఫోన్ లో కూడా నన్ను పలకరించలేదు అంటుంది తులసి. నా మొహం చూడటానికి కూడా ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకొని వచ్చిందో అని అనుకుంటాడు. మరోవైపు లాస్య, నందు ఇద్దరూ బయట గార్డెన్ లో నిలబడతారు. వాళ్లు అనసూయను బయటికి రమ్మని పిలుస్తారు. దీంతో ఏంట్రా బయటికి రమ్మని పిలిచావు అని అడుగుతుంది అనసూయ.

Advertisement

intinti gruhalakshmi 23 august 2022 full episode

మీ పక్కన ఉన్న తులసి చేసే తప్పులు మీకు అస్సలు కనిపించవు అంటుంది లాస్య. దీంతో మళ్లీ తులసి మీద పడ్డారా అని అంటుంది అనసూయ. ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి అని చూపిస్తుంది లాస్య. వీటిలో ఉన్నది తులసి కాదని చెప్పండి. మీ కాళ్లు మొక్కి తులసికి సారీ చెప్పి వెళ్లిపోతా అంటుంది లాస్య. సామ్రాట్ తో తులసి కలిసి ఉన్న ఫోటోలు అవి. వాటిని చూసి అనసూయ షాక్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి అత్తయ్య. ఆ ఫోటోలో ఉంది తులసి కాదు కదూ అంటుంది లాస్య. చూశావు కదా.. వద్దు అంటే తులసిని సామ్రాట్ తో పంపించారు. ఇప్పుడు చూశావు కదా ఏం జరిగిందో. తులసి మీ దేవత అని ఇప్పటికీ అనుకుంటే ఎవ్వరూ ఏం చేసేది లేదు. నీ వెనుకాల ఏం జరుగుతోందో ఇప్పటికైనా తెలుసుకో అమ్మ అంటాడు నందు. దీంతో అనసూయకు ఏం చేయాలో అర్థం కాదు.

Advertisement

మీరు మాత్రమే నిష్పక్షపాతంగా ఆలోచిస్తారు. ఏది మంచో.. ఏది చెడో మీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటారు. అందుకే మీకు ఈ ఫోటోలు చూపించాం. ఇప్పటికీ నువ్వు తులసి వైపు నిలబడతావంటే నీ ఇష్టం అంటాడు నందు. మేము వెళ్లిపోగానే ఆ ఫోటోలు చించేయ్. ఎవ్వరికీ చూపించకు అంటాడు నందు.

ఇది మన ఇంటి గుట్టు కాబట్టి బయట పెట్టకుండా ఇక నుంచి నోరు మూసుకొని ఊరుకుంటా. రేపు రోడ్డు మీదికి వస్తే మాత్రం నేనేం చేయలేను అని చెప్పి నందు, లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు హనీ బయట ఆడుకుంటూ ఉంటుంది. పైపుతో పనివాళ్ల మీద నీళ్లు కొడుతూ ఉంటుంది హనీ.

Advertisement

Intinti Gruhalakshmi 23 Aug Today Episode : హనీతో ఆడుకున్న సామ్రాట్

ఇంతలో బాబాయి వచ్చి హనీ ఏంటమ్మా ఇది. మీ నాన్నకు తెలిస్తే ఊరుకోడు అది తెలుసా అంటాడు బాబాయి. దీంతో నాన్న ఈవెనింగ్ వరకు రాడు. అప్పటి వరకు ఎంజాయ్ అంటుంది హనీ. అప్పుడే అక్కడికి సామ్రాట్ వస్తాడు. చూసుకోకుండా హనీ.. తన మీద నీళ్లు కొడుతుంది. తనను చూసి షాక్ అవుతాడు సామ్రాట్.

కోపంతో తనవైపు చూస్తాడు. ఇంతలో బాబాయి వచ్చి చిన్నపిల్ల.. ఏదో సరదాగా ఆడుకుంటోంది. ఏమనకురా. భయపడుతుంది అంటాడు బాబాయి. సారీ నాన్న ఇంకెప్పుడూ ఇలా చేయను అంటుంది హనీ. దీంతో కానీ నేను చేస్తాను అంటాడు సామ్రాట్.

పెద్ద పోటుదానిలా అందరి ముందు నీళ్లు చల్లుతావా.. ఇప్పుడు చెప్తా నీ పని అని.. పైపు తీసుకొని తన మీద నీళ్లు కొడతాడు సామ్రాట్. ఇరేయ్ చిన్నపిల్లరా.. తడిస్తే జలుబు చేస్తుంది. వదిలేయ్ అంటాడు బాబాయి. కానీ.. సామ్రాట్ అస్సలు వినడు. తనతో సరదాగా ఆడుకుంటాడు.

ఆ తర్వాత తనను ఎత్తుకుంటాడు. మరోవైపు ప్రేమ్, శృతి ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకుంటారు కానీ.. ఏం మాట్లాడుకోరు. ఇంతలో మామయ్య.. ఇదిగోండి పాలు అని పరందామయ్యకు తులసి తెచ్చిస్తుంది. ప్రేమ్ జీవితాన్ని ఆ బహుమతి మార్చేసింది అని తులసి.. శృతితో చెబుతుంది.

Advertisement

ప్రేమ్ జీవితాన్ని కాదు.. ప్రేమ్ నే మార్చేసింది అని అనుకుంటుంది శృతి. అసలు నీకు వాడిని చూడాలనిపించలేదా అని శృతిని అడుగుతుంది తులసి. మనందరికీ దూరంగా ఉండాలంటే తనకు ఇబ్బందిగా ఉందేమో అంటాడు పరందామయ్య. మా తెగదెంపుల విషయం చెప్పడానికి ప్రేమ్ ఇబ్బంది పడుతున్నాడు అని అనుకుంటుంది శృతి.

మరోవైపు తులసి ఇంటికి వస్తాడు సామ్రాట్. మీతో పర్సనల్ గా మాట్లాడాలి అంటాడు సామ్రాట్. సామ్రాట్ ప్రేమలో తులసి పడిందంటూ పేపర్లలో వార్తలు రాశారు. ఆ వార్తలను చూసి తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి