Intinti Gruhalakshmi 23 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 823 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పర్సు మరిచిపోయా అని నందు చెప్పినా కూడా రెస్టారెంట్ ఓనర్ వినడు. డబ్బులు కట్టి బయటికి వెళ్లు అంటాడు. దీంతో ఇంటికి వెళ్లి తీసుకొస్తా అన్నా కూడా వినడు రెస్టారెంట్ ఓనర్. ఆ ఫోన్ అక్కడ పెట్టి వెళ్లి డబ్బులు కట్టి తీసుకెళ్లు అంటాడు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. నందును అక్కడ చూసి షాక్ అవుతారు. అతడి డబ్బు మేము పే చేస్తాం అంటుంది తులసి. దీంతో వద్దండి మీరు ఎందుకు వాళ్ల డబ్బులు పే చేయడం అంటాడు రెస్టారెంట్ ఓనర్. దీంతో అందరినీ అలా తప్పుగా ఊహించుకోవద్దు అని నందు డబ్బులు కూడా పే చేస్తుంది తులసి.
మరోవైపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి దివ్య తన ఫ్రెండ్స్ ను తీసుకొస్తుంది. ఇంతలో లాస్య వచ్చి మీ ఫ్రెండ్సా అంటుంది. దీంతో ఈమె ఎవరు.. అని అడుగుతారు తన ఫ్రెండ్స్. దీంతో మా ఆంటీ అంటుంది. దీంతో ఆంటీ అంటే అని అడుగుతారు తన ఫ్రెండ్స్. దీంతో మా డాడ్ సెకండ్ వైఫ్ అని అంటుంది దివ్య. సెకండ్ వైఫ్ అంటే ఏమంటారు అని తన ఫ్రెండ్స్ నే అడుగుతుంది లాస్య. దీంతో పిన్ని అవుతుంది అంటుంది. మరి మీ అమ్మ నీకు ఇవన్నీ నేర్పించలేదా అంటుంది. దీంతో తను మా పిన్ని.. ఓకేనా అన చెప్పి తన ఫ్రెండ్స్ ను తీసుకొని లోపలికి వెళ్తుంది దివ్య. మరోవైపు రెస్టారెంట్ లో కాఫీ తాగిన తర్వాత ఇద్దరూ కలిసి బయట నడుచుకుంటూ వెళ్తుంటారు.
ఇంతలో ఒక చాలెంజ్ విసురుతుంది తులసి. నేను ఇప్పుడు మధ్యతరగతి వ్యక్తిగా మారిపోయానండి అంటాడు. మీరు మారిపోయాను అంటే కాదు.. ఖచ్చితంగా మీరు మధ్యతరగతి వ్యక్తిగా మారిపోయారో లేదో మీకు ఒక పరీక్ష పెడతాను అంటుంది తులసి.
దీంతో ఏంటా పరీక్ష అని అడుగుతాడు. దీంతో నీ దగ్గర, నా దగ్గర సమానమైన డబ్బులను తీసుకొని వాటిని ఎలా ఖర్చు చేస్తున్నామో చూద్దాం. ఎవరు ఎలా ఖర్చు పెడతారో చూద్దాం అంటుంది.
దీంతో సరే అని చెప్పి తన దగ్గర ఉన్న 500 నోట్లు రెండు ఇస్తాడు తులసికి. ఏంటి.. అంత డబ్బా వద్దు అని చెప్పి తన దగ్గర ఉన్న రెండు 10 రూపాయల నోట్లను ఇచ్చి ఈ 10 రూపాయలతో ఎవరు ఎన్ని ఎక్కువ వస్తువులు కొంటే వాళ్లే గెలిచినట్టు అంటుంది తులసి.
దీంతో ఇద్దరూ వెళ్తారు. ముందు తులసి ఒక కూరగాయల షాపునకు వెళ్లి 10 రూపాయలకు సరిపడా అన్ని ఒక్కొక్క కూరగాయ కొంటుంది తులసి. ఆ తర్వాత సామ్రాట్ షాపునకు వెళ్లి 10 రూపాయల బియ్యం తీసుకొస్తాడు.
నేనే గెలిచాను అంటాడు సామ్రాట్. ఎవరు ఎన్ని రకాల వస్తువులు తెచ్చారు అన్నది కానీ.. ఒకే వస్తువును తేవడం కాదు అని అంటుంది. దీంతో సరే అండి నేను ఒప్పేసుకుంటున్నాను అంటాడు సామ్రాట్.
మరోవైపు సామ్రాట్ ను తీసుకొని తులసి ఓ అనాథాశ్రమానికి వెళ్తుంది. మీరు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటారా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో అప్పుడప్పుడు వస్తుంటాను అంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకరకంగా అనాథనే అంటుంది తులసి.
గుడిలో వేసి తాళం వేసినంత మాత్రాన దేవుడు అనాథ అవుతాడా? ఒంటరి వాడు అవుతాడా అంటాడు సామ్రాట్. మరోవైపు పిల్లలు వస్తారు. ఏంటి రాను రాను పిల్లలు తగ్గిపోతున్నారు అని అడుగుతుంది తులసి.
దీంతో పిల్లలు తగ్గిపోయారేమో అని అంటాడు సామ్రాట్. దీంతో కాదు సార్ దాతలు తగ్గిపోయారు అంటుంది అనాథాశ్రమం నిర్వాహకురాలు. దీంతో మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ప్రతి నెలా నేను డబ్బులు పంపిస్తాను అంటాడు సామ్రాట్.
ఆ తర్వాత తను తీసుకొచ్చిన పార్సిల్ ను అందరు పిల్లలకు ఇస్తుంది తులసి. సామ్రాట్, తులసి కూడా వాళ్లతో కలిసి తింటారు. చూశారా.. వాళ్ల ముఖాల్లో సంతోషం అంటుంది తులసి. అదే చూస్తున్నా అంటాడు.
ఇక్కడ వాళ్లకు దాదాపు ఒకేరోజు ఒకే రకమైన తిండి పెడుతుంటారు. మనలాంటి వాళ్లు ఎవరైనా వచ్చి ఇస్తే వాళ్లకు పండగలా ఉంటుంది అంటుంది తులసి. మీరు అన్నట్టు సాయం చిన్నదే కానీ.. సంతోషం కొండంత అంటుంది తులసి.
ఇక నుంచి ప్రతిసారి నేనూ మీతో వస్తాను అంటాడు. ఆ తర్వాత నేను మీకు ఒక విషయం చెప్పనా.. ఈరోజు నేను మీకు ఇచ్చే పార్టీ ఇదే అంటుంది తులసి. దీంతో జీవితంలో గుర్తుండిపోయే పార్టీ ఇచ్చారు అంటాడు సామ్రాట్.
మరోవైపు దివ్య తన ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. అంకిత, శృతి కూడా తనతో కలిసి డ్యాన్సులు వేస్తుంటారు. సౌండ్ కు లాస్యకు చాలా కోపం వస్తుంది. వీళ్లు సామీ సామీ అంటూ డ్యాన్స్ వేస్తుంటే ఇంతలో అక్కడికి పరందామయ్య, అనసూయ వస్తారు.
ఇంకా డ్యాన్స్ సరిపోవడం లేదు అంటాడు పరందామయ్య. డ్యాన్స్ చేయండి అంటాడు. లేదంటే నేను చేసి చూపిస్తా అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.