
intinti gruhalakshmi 23 july 2022 full episode
Intinti Gruhalakshmi 23 July Today Episode : తులసి ఇంటి వాళ్లకే బ్యాంక్ మేనేజర్ లోన్ ఇస్తామంటూ వస్తారు.. ఈ వ్యవహారం ఏదో గడబిడిగా ఉందని తులసి అర్థం చేసుకుంటుంది.. నాకు లోన్ ఇవ్వవద్దని.. రూల్స్ కి వ్యతిరేకంగా తీసుకునే లోన్ నాకు అవసరం లేదని చెబుతుంది.. ఈ విషయం వెనుక ఉంది సామ్రాట్ అని తెలుసుకొని.. వెంటనే సామ్రాట్ కి కాల్ చేసి తులసి వార్నింగ్ ఇస్తుంది .. నేను ఒంటరి ఆడదానిని.. నాకు ఒంటరి పోరాటమే ఇష్టమని.. నాకు ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం లేదని.. సామ్రాట్ కి అర్థమయ్యేలా చెబుతుంది.. మీకు అర్థమైందా.!? మళ్లీ ఇంకొకసారి డీటెయిల్ గా చెప్పనా.!? అని అంటుంది.. వద్దు అర్థమైంది.! అని సామ్రాట్ కాల్ కట్ చేస్తాడు..! సామ్రాట్ వాళ్ళ బాబాయ్ హనీ ని తీసుకుని తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హనీ మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చింది అని చెబుతాడు.
తులసి నిర్మొహమాటంగా వద్దు అని చెబుతుంది .హనీ ప్లీజ్ ఆంటీ నన్ను మీ శిష్యురాలుగా చేర్చుకోండి అని క్యూట్ గా బతిమిలాడుతుంది. హనీ మాటలు విని తులసికి ఒప్పుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ సామ్రాట్ కి ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందని మనసులో అనుకుంటుంది . సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తో ఈ విషయం సామ్రాట్ గారికి తెలుసా అని అడుగుతుంది. తెలుసా ఆయనే ఇక్కడికి పంపించారు అని కూడా అనడంతో తులసి సరే అని హనీకి సంగీతం నేర్పించడానికి ఒప్పుకుంటుంది.. నీకు ఎటువంటి ముప్పు ఉండదని అందుకు నేను బాధ్యత వహిస్తాను అని తులసికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ భరోసా ఇస్తాడు..ప్రేమ్ మ్ శృతి కోసం రోడ్ల వెంబటపడి తిరుగుతూ ఉంటాడు.. శృతి ఎక్కడ ఉందో ప్రేమకి తెలియడం లేదు.. తను వెళ్ళినా కమల తేవాలి ఇంట్లో కూడా శృతి లేదనుకొని ప్రేమ పొరపాటు పడతాడు.. కానీ అక్కడే ఉందన్న విషయం ప్రేమ్ కి తెలియదు.. మరోవైపు శృతి ప్రేమ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.. మరోవైపు తులసి శృతిని తీసుకొని రేపు ఇంటికి రమ్మని చెబుతుంది.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రేమ్ ఉంటాడు.
intinti gruhalakshmi 23 july 2022 full episode
తులసి అభి కి ఫోన్ చేసి కృష్ణాష్టమి సందర్భంగా ఇంటికి రమ్మని చెబుతుంది .. నేను రాను నువ్వు నీ కోడలు సుఖంగా ఉన్నారుగా నాకెందుకు అని అభి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఇక్కడ అంకిత నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది.. అని తులసి చెబుతుంది.. అలాంటప్పుడు నా దగ్గరకు రావచ్చుగా అని అంటాడు.. అంకిత ఎందుకు రాను అంటుందో నీకు తెలుసు కదా అని తులసి చెబుతుంది.. రేపు నువ్వు ఇంటికి రా అంకితను ఒప్పించి ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోండి .. ఆ నిర్ణయం ఏదైనా సరే నేను మీ ఇద్దరి మధ్యలోకి అడ్డు రాను అని మాట ఇస్తుంది.. గాయత్రి కూడా అభిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెబుతుంది.. ఒక మంచి సమయం చూసుకొని అంకితం కన్విన్స్ చేసి మళ్లీ ఇక్కడికి తీసుకు రమ్మని చెబుతుంది..
ఇదంతా జరుగుతుందా ఆంటీ అని అభి అంటాడు.. ప్రయత్నించు తప్పకుండా జరుగుతుంది అని గాయత్రి చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో లాస్య నందు నిర్వహించిన న్యూ బిజినెస్ ఐడియాలతో.. ఇంటర్వ్యూలకు కుప్పలుతప్పలుగా వస్తారు.. ఇక అదే చోటకి తులసి కూడా తన సంగీతం స్కూల్ ఫైల్ తీసుకుని వస్తుంది.. లాస్య తులసి ఎదురుగా వచ్చి తన ఫైల్ తీసుకొని ఇక్కడ నీ ఫైల్ బాస్ దగ్గరకు వెళ్లాలంటే నందుని దాటి వెళ్ళాలి.. నందు ఓకే చేస్తేనే నీ ఫైల్ బాస్ వరకు వెళ్తుంది అని తులసి ఫైల్ ను లాస్య తీసుకుంటుంది.. నందు తులసి ఫైల్ ను యాక్సెప్ట్ చేస్తాడా.!? లేదా అనేది చూడాలి.. మిగతా విశేషాలు తర్వాత భాగంలో చూద్దాం..
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.