Intinti Gruhalakshmi 23 Monday Episode Highlights : లాస్య పంపించిన రౌడీల చేతుల్లో నుంచి హనీని తులసి కాపాడుకుంటుందా? లేక హనీని ఎత్తుకెళ్తారా?

Intinti Gruhalakshmi 23 Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 23 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1082 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ, పరందామయ్య, అనసూయ ఈ ముగ్గురూ సంతోషంగా ఉండటం చూసి వీళ్లు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటుంది తులసి. ఎలాగైనా లాస్య లాంటి దుష్టశక్తులను ప్రాణాలకు తెగించి అయినా కాపాడుకుంటా అని అనుకుంటుంది తులసి. అప్పుడే ఇంట్లోకి వచ్చిన తులసిని చూసి ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతాడు నందు. దీంతో నేను చిన్నపిల్లను కాదు. నేను ఎక్కడికి వెళ్లానో అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది తులసి. అసలు నువ్వు ఏం చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదు. నువ్వు మా గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు. కానీ.. నీ గురించి మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదా అంటాడు నందు. నా గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటుంది తులసి.

దీంతో తులసి నేను విజయవాడ వెళ్తున్నాను. నేను ఇంతకుముందే చెప్పాను కదా విజయవాడ వెళ్లే పని ఉందని. ఈ మధ్య నువ్వు అన్నీ విషయాలు మరిచిపోతున్నావు.. అని చెబుతాడు. దీంతో అవును మరిచిపోయా అంటుంది తులసి. కొద్ది రోజులుగా నీ మనసు నీలో లేదు. అది చెప్పడానికి ఇదే రుజువు అంటాడు నందు. దీంతో మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అంటుంది తులసి. హనీ జీవితాన్ని ఎలా నిలబెట్టాలా అని నేను ఆలోచిస్తున్నా అంటుంది తులసి. దీంతో నువ్వు ఒక్కదానివే కాదు.. నేను కూడా హనీ బాధ్యత తీసుకుంటా అంటాడు నందు. మరోవైపు జాను వచ్చి విక్రమ్ దగ్గర ఓవర్ చేస్తుంది. తనతో మళ్లీ చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో విక్రమ్ కు కోపం వస్తుంది. నువ్వు నాతో అంత చనువుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అంటాడు విక్రమ్. బావా మరదళ్ల మధ్య ఆమాత్రం సరసాలు ఉండవా? నీ మొహానికి కోపం నప్పలేదు. నేను నీకోసం ఈ టీషర్ట్ కొనుక్కొచ్చా అని చెబుతుంది జాను.

#image_title

Intinti Gruhalakshmi 23 Monday Episode Highlights : జానుపై చిరాకు పడ్డ విక్రమ్

నా రూటే వేరు బావ అంటుంది జాను. దివ్య గురించి నువ్వు ఇంకో మాట మాట్లాడితే బాగుండదు అంటాడు విక్రమ్. నా జాతకంలో రెండో పెళ్లి వాడినే చేసుకుంటానని ఉంది. కన్ఫమ్ చేసుకున్నకే నీ వెంట పడుతున్నాను అంటుంది జాను. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు విక్రమ్. ఇంత స్వార్థం పనికిరాదు అక్క బావ పూర్తిగా నీకే కావాలని అనుకుంటే ఎలా అంటుంది జాను.

మరోవైపు హనీకి ఏవేవో పిచ్చి కలలు వస్తున్నాయని చెబుతుంది తులసికి. దీంతో భయపడుతుంది. తనకు సర్దిచెప్పి పడుకోబెడుతుంది. ఇంతలో లాస్య ఫోన్ చేస్తుంది. నీ మాజీ మొగుడు ఇంట్లో లేడట కదా. అసలు ఇన్ని రోజులు నేను వాళ్లను వీళ్లను దాడి చేయడం స్టార్ట్ చేశా కానీ.. అసలు డైరెక్ట్ గా హనీపైనే దాడి చేస్తే బెటర్ కదా. ఎలా ఉంది ఈ ఐడియా అని అడుగుతుంది.

ఇవాళ రాత్రి ముహూర్తం బాగుందట. హనీ కోసం ఈరోజు రాత్రే రౌడీలను పంపిస్తా. వాళ్లు ఏం చక్కా హనీని ఎత్తుకొచ్చేస్తారు అని లాస్య.. తులసికి షాకిస్తుంది. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఎలాగైనా హనీని లాస్య చేతికి చిక్కకుండా చేసేందుకు హనీ పడుకున్న రూమ్ డోర్స్ అన్నీ పెట్టి తాళం వేస్తుంది. ఇంటి ముందు కుర్చీ వేసుకొని కర్ర పట్టుకొని కూర్చుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే ఫ్రీగా సేవలు ఇస్తూనే ఎన్ని కోట్లు వెనకేసుకుంటున్నారో తెలిస్తే షాకే…!

Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…

15 minutes ago

Kingdom Movie : కింగ్‌డ‌మ్ సినిమా కోసం ఎవ‌రెవ‌రు ఎంత రెమ్యునరేష‌న్ తీసుకున్నారో తెలుసా?

Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…

1 hour ago

Wife Husband : భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం .. తట్టుకోలేక భార్య..!

Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌కు చెందిన బింగి రాజశేఖర్‌ తన భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తితో సంబంధం…

2 hours ago

Anshu Reddy : అన్షు రెడ్డి జీవితంలో ఇన్ని క‌ష్టాలా.. రూ.3 కోసం ఆరు మైళ్లు న‌డిచిందా?

Anshu Reddy : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో Illu Illalu Pillalu Serial Narmada నర్మద పాత్రతో అలరిస్తున్న…

3 hours ago

Monsoon Detox Drinks : వర్షాకాలంలో ఈ డ్రింక్స్ ని తీసుకున్నట్లయితే… మీకు ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి…?

Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం…

4 hours ago

Kingdom Movie : కింగ్‌డ‌మ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత‌.. లాభాల్లోకి రావాలంటే ఎంత రాబ‌ట్టాలి?

Kingdom Movie : టాలీవుడ్‌ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ,  vijay devarakonda ,  bhagya…

5 hours ago

Red Food Benefits : మీరు ఎరుపు రంగులో ఉండే ఆహారాలను… ప్రతిరోజు తీసుకుంటే… బాపురే అనాల్సిందే…?

Red Food Benefits : కూరగాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి…

6 hours ago

Shravana Masam 2025 : శ్రావణమాసంలో స్త్రీలు ఎక్కువగా ఆకుపచ్చ చీరలు, గాజులు ఎందుకు ధరిస్తారు… శాస్త్రీయ కోణం ఏమిటి..?

Shravana Masam 2025 : మహిళలు ఎంతో ఇష్టంగా శ్రావణమాసంలో ఆధ్యాత్మిక తో భావంతో నిండి,పూజలను చేస్తూ ఉంటారు. అయితే…

7 hours ago