Home » Entertainment » Intinti Gruhalakshmi 24 December 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 24 Dec Today Episode : లాస్యకు భారీ షాక్.. పెళ్లి చేసుకోను అంటూ తెగేసి చెప్పిన నందు.. దీంతో లాస్య షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: December 24, 2021 10:34 am
Advertisement

Intinti Gruhalakshmi 24 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 511 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, డాక్టర్ అద్వైత కృష్ణ ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ దేవుడిని దర్శించుకున్నాక కాసేపు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. పెళ్లి చేసుకునే వాళ్లంటే నాకు జాలి వేస్తుంది తులసి అంటాడు కృష్ణ. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు కృష్ణ. పెళ్లి అనేది ఒక బంధం. రెండు కుటుంబాలను కలిపే ప్రక్రియ అది. పెళ్లి అనేది ఒక కరెంట్ వైర్ లాంటిది. కనెక్షన్ సరిగ్గా ఇస్తే జీవితంలో వెలుగు నింపుతుంది. అదే రాంగ్ కనెక్షన్ ఇస్తే మాత్రం షాక్ కొడుతుంది. నా విషయంలో అదే జరిగింది. దేవుడు నాకు రాంగ్ కనెక్షన్ ఇచ్చాడు. అందుకే నాకు షాక్ కొట్టింది. పెళ్లి మీద నమ్మకం లేనివాళ్లు ఈ బంధం జోలికే పోకూడదు. బంధంలో ఇరుక్కోకూడదు అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 24 december 2021 full episode

నందు లాగ అన్నమాట. నందుకు లాస్యతో పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. లాస్య మాత్రం చాలా ఊహించేసుకుంటోంది. మరోసారి నందు సమస్యల్లో చిక్కుకోబోతున్నాడేమో అనిపిస్తుంది అని అంటాడు డాక్టర్. దీంతో తులసి టెన్షన్ పడుతుంది. మరోవైపు నందు నందు అంటూ పిచ్చిదానిలా కాటేజ్ అంతా వెతుకుతుంది లాస్య. కానీ.. నందు తనకు కనిపించడు. దీంతో ఏం చేయాలో తనకు అర్థం కాదు. దీనికేమైనా పిచ్చి పట్టిందా.. ఎందుకు అలా అరుస్తోంది అని అంటుంది అనసూయ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. తులసికి చేస్తుంది. తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి తులసి అక్క కూడా ఫోన్ కట్ చేసిందా. నో డౌట్.. ఇద్దరూ కలిసే ఉన్నారు. అందుకే ఫోన్ కట్ చేస్తోంది అని అంటుంది భాగ్య. మరోసారి చేస్తుంది. ఇక లాభం లేదనుకొని ఫోన్ ఎత్తుతుంది తులసి. ఏంది.. ఎందుకు ఊరికే ఫోన్ చేసి విసిగిస్తున్నావు అంటుంది తులసి.

Advertisement

నందు ఎక్కడ అంటుంది లాస్య. దీంతో నందు నా హ్యాండ్ బ్యాగ్ లో దాచుకున్నానా.. నన్ను ఎందుకు అడుగుతున్నావు. మీది పెళ్లి.. మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. నన్నెందుకు లాగుతున్నావు అంటుంది తులసి. దీంతో నువ్వు ఉన్నపళంగా ఇప్పుడు ఇక్కడికి రావాలి.. అంటుంది లాస్య.

దీంతో నేను ఎందుకు అక్కడికి రావాలి. నాకేం అవసరం అంటుంది. నువ్వు ఇప్పుడు రాకపోతే.. నీ ఫ్యామిలీ మీద పోలీస్ కేసు పెడతాను. నా పెళ్లి ఆపి నన్ను మెంటల్ టార్చర్ చేశారని కేసు పెడతాను అంటుంది. దీంతో తులసి టెన్షన్ పడుతుంది. వెంటనే రిసార్ట్ కు బయలు దేరుతుంది.

Advertisement

మీరంతా కలిసి గూడు పుఠాణి నడుపుతున్నారా? చెప్తా.. అందరి సంగతి చెబుతా అంటుంది లాస్య. నందు రాకపోవాలి.. మీ సంగతి ఉంటుంది. మీ అందరినీ జైలులో పెడతాను. మీ అందరూ జైలులో ఉంటారు. మీ అందరినీ సర్వనాశనం చేస్తాను అంటుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు.

Intinti Gruhalakshmi 24 Dec Today Episode : తులసి, లాస్య మధ్య తీవ్రమైన పోరాటం

ఆగండి.. ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటుంది లాస్య. ఫోన్ చేసి చూడు లాస్య అంటుంది తులసి. అప్పుడే అక్కడికి వస్తుంది తులసి. చెయ్.. ఫోన్ చేయి.. అంటూ అరుస్తుంది తులసి. నిన్ను భయపెడదామని చెప్పలేదు. పోలీసులకు ఫోన్ చేయ్ అని చెబుతున్నా. చేయ్ ఫోన్.. కబుర్లు చెప్పకు. నువ్వు చేయకపోతే నేను చేస్తా అంటుంది తులసి.

ఇప్పుడే పిలువు.. పోలీసులైతే పోలీసులు.. సైన్యం అంటే సైన్యం.. ఎవరు అయితేనేం.. చేయ్ ఫోన్.. అంటే.. ఫోన్ చేస్తే నీ వాళ్లు అందరూ జైలుకు పోతారు అంటే. చేయ్ పోలీసులకు. నా మాజీ భర్తతో పాటు నువ్వు కూడా వెళ్తావు జైలుకు అంటుంది తులసి. దీంతో లాస్య షాక్ అవుతుంది.

నా మీద ఏం కేసు పెడతావు అంటుంది లాస్య. పెళ్లి అయిందని తెలిసి కూడా నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. నా కుటుంబాన్ని మనసికంగా హింసించావు అని కేసు పెడతా అంటుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది. మొత్తానికి ఇద్దరి మధ్య ఒక రేంజ్ పోరాటమే జరుగుతుంది.

Advertisement

ప్రేమ్ మీద చేయి వేసినందుకు లాస్యకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది తులసి. దీంతో తులసి లాస్య చేయి గట్టిగా పట్టుకొని ఇప్పుడు వేయి చెయ్యి అంటుంది. తులసి పట్టుకున్న చేయినే విడిపించుకోలేకపోతుంది లాస్య. అందరూ లాస్యపై సీరియస్ అవుతారు.

ఇంతలో నందు వస్తాడు. ఎక్కడికి వెళ్లారు అంటూ తులసి ప్రశ్నిస్తుంది. పదా నందు.. ఇప్పటికే లేట్ అయింది. వెళ్లి పెళ్లి చేసుకుందాం అంటుంది లాస్య. కానీ.. నందు రాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి