Intinti Gruhalakshmi 24 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు విడుదలైంది. ఈరోజు 24 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 824 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య ఫన్ కావాలి అంటే సౌండ్ పెంచి అందరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో కోపంతో వచ్చి లాస్య పాటను ఆపేస్తుంది. దీంతో లాస్యతో దివ్య గొడవ పడుతుంది. ఇంతలో నందు వస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు. దీంతో ఎక్కువ సౌండ్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. నేను ఎంత సర్దుకుపోదాం అనుకున్నా కూడా అలాగే జరుగుతోంది. నన్నే ఎగతాళి చేస్తున్నారు అంటుంది లాస్య. సౌండ్ తట్టుకోలేక పక్కన వాళ్లు కూడా వచ్చి నాకు ఫిర్యాదు చేశారు. కానీ.. నేను సర్దిచెప్పి పంపించాను అంటుంది లాస్య. దీంతో దివ్యనే పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలుసుకో అని నందు తనతో అనడంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు. పరందామయ్యను కూడా తిడతాడు నందు.
మరోవైపు కారులో వెళ్తుంటారు తులసి, సామ్రాట్. నేను ఏదైనా నా జీవితంలో ఎదురైన సంఘటనల నుంచి నేర్చుకున్నా అంటుంది తులసి. అందుకే నేను కూడా మీలా ఆలోచిస్తున్నా. ఆలోచించడం నేర్చుకుంటున్నా అంటాడు సామ్రాట్. దీంతో గుడ్ అంటుంది తులసి. మరోవైపు దివ్య బాధపడుతూ కూర్చొంటుంది. దీంతో లాస్య సంగతి నీకు తెలుసు కదా. సీరియస్ గా తీసుకోకు. వదిలేయ్ అంటాడు పరందామయ్య. తనను పిన్ని అని తన ఫ్రెండ్స్ కు పరిచయం చేయడం లేదని అలా చేసింది అంటుంది అంకిత. ఇంతలో అభి, ప్రేమ్ వస్తారు. ఏమైంది అని అడిగితే లాస్య ఆంటి.. దివ్య మీద అరుస్తోంది అని చెబుతుంది అంకిత. దీంతో ప్రేమ్ కు కోపం వస్తుంది. బుద్ధిగా ఉండటం లేదా అని అంటాడు ప్రేమ్.
అందరిపై అరిచింది అంటుంది దివ్య. ఇంట్లో డాడ్ లేడా అంటే.. ఆయన కూడా ఆంటీకే సపోర్ట్ చేశారు అంటుంది దివ్య. దీంతో ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు అంటాడు ప్రేమ్. మీ డాడీకే జాబ్ లేదనే టెన్షన్ లో ఉన్నాడు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో కూడా లేడు. కొంత కాలం ఎదురుచూద్దాం అంటాడు పరందామయ్య.
దీంతో మీరు అలాగే మాట్లాడుతారు. ప్రతిసారి నందు ముందు మనం దోషులుగా నిలబడుతున్నాం అంటుంది అనసూయ. అలా కాదు కానీ.. తాతయ్య చెప్పినట్టు కొంచెం ఓపిక పట్టడం మంచిదేమో అంటాడు అభి. తులసిని మనం దూరం చేసుకున్నాం అంటాడు పరందామయ్య.
నందుకు జాబ్ వస్తే పరిస్థితులు మారుతాయేమో అన్న ఆశగా ఉంది. కాస్త ఓపిక పడదాం. నామాట వినండిరా ప్లీజ్ అంటాడు పరందామయ్య. కట్ చేస్తే తులసి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కాలేజీ ఫంక్షన్ కు దివ్య డ్యాన్స్ ప్రాక్టీస్ ఎంత వరకు వచ్చిందో ఒకసారి అడిగి చూస్తా అని ఫోన్ చేస్తుంది తులసి.
దీంతో ఫోన్ ఎవరు చేస్తున్నారో చూడకుండానే కట్ చేస్తుంది దివ్య. దీంతో మళ్లీ చేస్తుంది దివ్య. కానీ.. మళ్లీ కట్ చేస్తుంది. దీంతో ఏమై ఉంటుంది.. అని అనుకుంటుంది తులసి. మళ్లీ కాల్ చేస్తుంది. దీంతో ఎవరు అని చూస్తే మామ్ అని ఉంటుంది. మామ్ కాల్ చేస్తుంది కానీ.. జరిగిన గొడవ మామ్ కు తెలియకూడదని తాతయ్య చెప్పారు. జాగ్రత్తగా మాట్లాడాలి అని అనుకుంటుంది దివ్య.
హల్ మామ్ అంటే.. ఏం చేస్తున్నావు బిజీగా ఉన్నావా అంటుంది. నా కాల్ కట్ చేస్తున్నావు ఏంటి అంటే సారీ మామ్ నేను చూసుకోలేదు అంటుంది దివ్య. ఏం లేదు అమ్మ. నాకు కన్నతల్లి ఉండి కూడా అనాథగా బతుకుతున్నట్టుగా ఉంది. అందరి మధ్యలో ఉండి కూడా నాకు ఒంటరిగా అనిపిస్తోంది అంటుంది దివ్య.
తప్పమ్మా.. అలా ఏడవకూడదు.. అంటుంది తులసి. నన్నే మీ అందరికీ దేవుడు దూరం చేశాడు. నువ్వు ఇప్పుడు దైర్యంగా ఉంటేనే నేను ఇక్కడ దైర్యంగా ఉండగలుగుతాను. లేకుంటే నిద్ర కూడా పట్టదు అంటుంది తులసి. కట్ చేస్తే పరందామయ్యకు కడుపులో మంటగా ఉంటుంది.
దీంతో కడుపులో కాస్త మంటగా ఉందని అనసూయతో చెబుతాడు. ఇంతలో అంకిత వస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకున్నారా అంటే ఏం మాట్లాడడు పరందామయ్య. ఇబ్బంది పడుతుంటాడు. ఏమైంది తాతయ్య అంటే.. కడుపులో మంట మొదలైంది అని అంటుంది అనసూయ.
పాలు కాచి తీసుకొస్తానంటే వద్దంటున్నారు అంటుంది అనసూయ. వద్దు ఏంటి.. అసలు తాతయ్యను అడగాల్సిన అవసరం ఏంటి.. ఆయన్ను ప్రతి మూడు గంటలకు ఏదో ఒకటి తినమని చెప్పారు కదా. శృతి ఎక్కడ అంటూ వెళ్తుంది అంకిత. కిచెన్ లోకి వెళ్లి ఎవరైనా మన మీద నమ్మకం ఉంచినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి అంటుంది.
తాతయ్య గారికి కడుపులో మంటగా ఉందట అని అంటుంది అంకిత. దీంతో ప్రిడ్జ్ కి తాళం వేసిన సంగతి చెబుతుంది శృతి. దీంతో కోపంతో లాస్య దగ్గరికి వెళ్లి ఫ్రిడ్జ్ కీస్ కావాలి అంటుంది. దీంతో ఎందుకు అని అడుగుతుంది. దీంతో చెబితే కానీ ఇవ్వవా అంటుంది.
ఇంతలో శృతి స్పృహ తప్పి పడిపోతుంది. శృతికి ఏమైందో అని టెన్షన్ పడుతారు అంతా. ఈ విషయం తులసికి కూడా చెబుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.