intinti gruhalakshmi 24 october 2022 full episode
Intinti Gruhalakshmi 24 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 771 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్ కోసం తులసి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పటికే లాస్య, నందు తన ఇంటికి వస్తారు. సామ్రాట్ ఇంకా రాలేదు ఏంటి అని పరందామయ్య అడుగుతాడు. ఆ తర్వాత చీర బాగుంది. కొత్తదా అని అడుగుతుంది లాస్య. దీంతో అవును కొత్తదే. మా ఆయన అప్పుడెప్పుడో కొనిచ్చారు. దాన్ని కట్టుకోవడానికి ఇప్పుడు సమయం దొరికింది అంటుంది తులసి. ఇంతలో సామ్రాట్ వస్తాడు. ఇక వెళ్లండి మేడమ్. అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అంటుంది లాస్య. అవును ఆయన లోపలికి రాలేదేంటి నందు అంటుంది తులసి. దీంతో పబ్లిసిటీ కోసం. మేము తెగించి తిరుగుతాం అని కాలనీ వాళ్లకు చెప్పడం కోసం అంటాడు. ఈరోజు ఊరు దాటి తిరుగుతున్నారు. రేపు దేశం దాటి తిరుగుతారు అంటాడు నందు. ఆ తర్వాత ఇన్ని మాటలు పడి వెళ్లాలా అంటుంది అనసూయ. మా తులసి ఏం చేసినా రైటే చేస్తుంది అంటాడు పరందామయ్య.
intinti gruhalakshmi 24 october 2022 full episode
ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వస్తుంది తులసి. అక్కడ కారు పక్కన తులసి కోసం సామ్రాట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సిగ్గులేకుండా ఎంత బరి తెగించి పోయాడు. డ్రైవర్ లా కారు డోర్ తీసి పట్టుకుంటున్నాడు అని అనుకుంటుంది అనసూయ. ఆ తర్వాత ఇద్దరూ వరంగల్ కు కారులో బయలు దేరుతారు. కారులో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు తులసి, సామ్రాట్. నాకు కావాల్సింది ప్రశాంతత అంటుంది తులసి. నేనంటే ఎవ్వరికీ ఎంత కోపం ఉన్నా సరే.. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రాకపోతే అందరూ కంగారు పడతారు. ఒకరిని చూడకుండా ఒకరం ఉండలేం. అదొక అందమైన ప్రపంచం అంటుంది తులసి. దీంతో మీరు చెబుతుంటే నాకు కూడా అలాంటి ప్రపంచం ఉంటే బాగుండు అనిపిస్తోంది అంటాడు సామ్రాట్.
ఆశపడగానే సరిపోదు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటాడు సామ్రాట్. దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. ఎవరికి దక్కాల్సిన ఆనందం వాళ్లకు ఇస్తాడు. దొరికిన దానితో తృప్తి పడాలి అంటుంది తులసి.
అవును.. నా గురువు దగ్గర అదే నేర్చుకొన్నా అంటాడు సామ్రాట్. గురువా ఎవరు ఆ గురువు అంటుంది తులసి. దీంతో ఇంకెవరు మీరే అంటాడు సామ్రాట్. కట్ చేస్తే అనసూయ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది లాస్య. మామూలుగా చెబితే ఎందుకు తులసి వింటుంది. ఒకప్పుడు నా మీద ఎంతలా అరిచేవారో మరిచిపోయారా? ఏకమైపోయింది ఆ ఆవేశం అంటుంది లాస్య.
అనసూయను రెచ్చగొడుతుంది లాస్య. అత్తయ్య ఒకటి గుర్తు పెట్టుకోండి. తులసి మిమ్మల్ని చూడకపోతే ప్రపంచం ఏమీ తలకిందులు కాదు. మీ కొడుకు ఇంట్లో మీరు ఉండొచ్చు. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. కానీ.. తులసికి భయపడి పారిపోయావు అని ఈ కాలనీ వాళ్లు అనుకుంటారు అంటుంది లాస్య.
మధ్యలో తులసికి ఒక గుడి కనిపించడంతో ఆ గుడి లోపలికి వెళ్తారు సామ్రాట్, తులసి. దేవుడిని దర్శించుకొని మనసు ప్రశాంతంగా ఉంది అంటుంది తులసి. రండి.. కాసేపు అక్కడ కూర్చుందాం అని తనను తీసుకెళ్తాడు సామ్రాట్.
మరోవైపు నందు, దివ్య ఇద్దరూ కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. నందు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వస్తుంది అనసూయ. ఇంతలో అంకిత వచ్చి భోజనం టైమ్ అయింది. అన్నం పెట్టనా అంటుంది అంకిత.
దీంతో పిండం పెట్టవే అంటుంది అనసూయ. ఏంటి అమ్మమ్మ అలా అంటున్నారు అంటుంది అంకిత. మీ ఆంటీ చేసిన పనికి నాకు కడుపు నిండిపోయింది అంటుంది అనసూయ. ఇంతలో దివ్య ఉండి.. ఏం కూర వండావు వదిన అని అడుగుతుంది దివ్య.
దీంతో గుత్తి వంకాయ కూర అంటుంది అంకిత. దీంతో తనకు కూడా నోరు ఊరుతుంది. మరోవైపు గుడిలో కూర్చొని సరదగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు సామ్రాట్, తులసి. అక్కడ ఉన్న భక్తులు వాళ్లను చూసి.. ఆయన ఎంత బాగున్నాడు కదా అని అనుకుంటారు.
నాకు ఇలాంటి వాడు కావాలి అని అక్కడున్న యువతులు అనుకుంటారు. ఆ తర్వాత రాత్రి అవుతుంది. తులసి, సామ్రాట్ ఇద్దరూ వానలో తడిచి ఒక గెస్ట్ హౌస్ లో తలదాచుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.