Intinti Gruhalakshmi 25 Dec Today Episode : పెళ్లి చేసుకుంటావా? జైలుకు వెళ్తావా? నందుకు రెండే ఆప్షన్లు ఇచ్చిన లాస్య.. దీంతో నందు షాకింగ్ నిర్ణయం

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 25 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 డిసెంబర్ 2021, శనివారం 512 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చేతులకు కడుపు నిండా అన్నం పెట్టడం తెలుసు.. తింగరి వేషాలు వేస్తే కర్ర కాల్చి వాత పెట్టడమూ తెలుసు. నాది చపాతీలు చేసే చెయ్యి.. నీది నెయిల్ పాలిష్ లు పెట్టకునే చెయ్యి. తీయ్.. నా చేయిని విదిలించుకో అని లాస్యతో సవాల్ చేస్తుంది తులసి. ఈ గొడవ ఇక్కడితో వదిలేద్దాం. ఇంకోసారి నీ నోరు లేచింది అంటే.. మా వాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడినా.. ఈ పెళ్లి పందిరే పీకి అవతల పడేస్తాను. అప్పుడు చేసుకుందువు గాని పెళ్లి అంటుంది తులసి. ఇంతలో తులసికి ఫోన్ వస్తుంది. నందు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు మీరు.. అంటుంది. మీరు ఎక్కడున్నా నాకు అవసరం లేదు. వెంటనే మీరు ఇక్కడికి రండి.. అంటుంది. తులసి నీతో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు నందు.

Advertisement

intinti gruhalakshmi 25 december 2021 full episode

ఏది మాట్లాడాలన్నా ఇక్కడే. ముందు ఇక్కడికి రండి. మీ వల్ల నా వాళ్లు బాధపడుతున్నారు.. ముందు ఇక్కడికి వచ్చేయండి అని తులసి మాట్లాడుతుండగానే.. లాస్య ఫోన్ గుంజుకొని నందు ఎక్కడున్నావు అని అడుగుతుంది. దీంతో ఫోన్ కట్ చేస్తాడు నందు. నా నందుకు నిన్ను పెళ్లి చేసుకోవడమే కాదు.. నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు అని అంటుంది అనసూయ. ఆరు నూరైనా.. నూరు ఆరైనా నందు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటుంది లాస్య. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. ఎక్కడికి వెళ్లారు. ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది తులసి. ఇంతలో లాస్య వచ్చి ఏమైపోయావు నందు. ఎక్కడికి వెళ్లావు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను ఏమైపోవాలి.. అని అడుగుతుంది లాస్య. పిచ్చి దానిలా ఈ రిసార్ట్ మొత్తం వెతుకుతున్నాను.. అంటూ ఏడుస్తుంది లాస్య.

Advertisement

అలా నోరు మూసుకొని నిలుచుంటావేంట్రా ఏదో ఒకటి మాట్లాడు అంటుంది అనసూయ. అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతోంది. రా నందు వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అంటుంది లాస్య. కానీ.. నందు రాడు.. దీంతో లాస్య షాక్ అవుతుంది. నందు.. ఈ నాటకాలు చాలు.. పదా అంటుంది.. అయినా నందు రాడు.

తన చేయిని తీసేస్తాడు. లాస్య.. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అంటాడు నందు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ.. లాస్య షాక్ అవుతుంది. నన్ను వదిలేయ్.. ఇప్పుడు ఈ పెళ్లి నావల్ల కాదు అంటాడు నందు. ఏం.. ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడుగుతుంది లాస్య.

ఎందుకంటే.. ప్రస్తుతం నేను సిద్ధంగా లేను అంటాడు నందు. నన్ను ప్రేమిస్తున్నావు కదా. విడాకులు కాగానే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా.. ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నావు. ఏం జరిగిందని పెళ్లికి సిద్ధంగా లేవు. నాకు సమాధానం చెప్పు నందు అంటుంది లాస్య.

నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని అంటుంది లాస్య. అన్నిసార్లు నువ్వు అనుకునేదే జరగదు. ప్రతిసారి నిర్ణయం నీదే అవ్వదు. నేను అవ్వనివ్వను. నువ్వే కనుక నన్ను పెళ్లి చేసుకోలేదు అనుకో.. నేను వదిలిపెట్టను. కోర్టుకు లాగుతా. నీ పరువు తీస్తా.. అని బెదిరిస్తుంది లాస్య.

Intinti Gruhalakshmi 25 Dec Today Episode : లాస్య, నందుపై సీరియస్ అయిన తులసి

నువ్వు ఇప్పటి వరకు లాస్య ప్రేమను, పిచ్చితనాన్ని చూశావు. కోపం వస్తే ఏం చేస్తుందో కూడా చూస్తావు. ప్రేమతో ప్రాణాలు ఎలా ఇస్తుందో.. కోపం వస్తే ప్రాణాలు కూడా తీస్తుంది.. అని అంటుంది లాస్య. ఇంతలో తులసి మధ్యలో దూరి.. నోర్మూయ్ అంటుంది. మీరిద్దరూ చిన్నపిల్లలా… అందరూ చూస్తుండగా ఏంటి ఈ గొడవలు.

మీరు పెళ్లి చేసుకుంటే చేసుకోండి.. లేకపోతే మానేయండి. అంతే కానీ.. ఈ చిల్లర కొట్లాటలు ఏంటి.. మీకు ఇష్టం లేకపోతే ముఖం ముందే చెప్పేయండి. అంతే కానీ.. పారిపోతే వచ్చేదేం ఉండదు.. మా వాళ్లు ఏం తప్పు చేశారు. పొద్దటి నుంచి వాళ్లకు చంపుకు తింటోంది. మీ మధ్యలోకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ.. ప్రతిసారి మీరు నన్ను బలవంతంగా లాగుతున్నారు అంటుంది తులసి.

విడాకులు కూడా ఇచ్చేశాను కదా. నా బతుకు నన్ను బతకనివ్వండి. మీరేం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అంటుంది తులసి. కానీ.. నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఈవిడ వైపు చూడండి. తను నాకు ఏమాత్రం నచ్చలేదు. సభ్యత లేదు.. సంస్కారం లేదు. మర్యాద లేదు. దిగజారిపోయి ప్రవర్తిస్తోంది. కానీ.. మీకు ఈవిడ గారంటే చాలా ఇష్టం కదా. ప్రేమించారు. ఈవిడ కోసం కట్టుకున్న భార్యను కూడా మోసం చేశారు అంటుంది.

కుటుంబంతో బంధాలను కూడా తెంచేసుకున్నారు. ప్రేమ అంటూ పెళ్లయిన ఈయన జీవితంలోకి నువ్వు బలవంతంగా దూరి నా ఇంటి పరువును బజారుకీడ్చావు. ఇప్పుడు నువ్వు సాధించిందేంటి. 9 ఏళ్ల తర్వాత ఆయన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించడమేనా. ఇద్దరూ కలిసి భలేగా యాక్టింగ్ చేశారు.

మిమ్మల్ని మీరే అపహస్యం చేసుకున్నారు. లోకం దృష్టిలో కూడా దిగజారిపోయారు. ఇదంతా ఎందుకు.. ఇలా విడిపోవడానికా. మీఇద్దరికి ఒకరిలో ఒకరికి ఏం నచ్చిందో తెలియదు కానీ.. మీకు మీరు ప్రేమించుకున్నారు అని మాత్రం నాకు తెలుసు అంటుంది తులసి.

నాకు తెలుసు మీకు ఎవ్వరి మీదా కోపం లేదు. మీకు మీ మీదే కోపం. అనవసరంగా ఇరుక్కుపోయారనే కోపం. నా బాధంతా మీ గురించే. మీరు సంతోషంగా లేకపోతే.. వీళ్లెవరూ సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే.. వీళ్లకు మీరంటే అంత ఇష్టం.. అంటుంది తులసి.

మొత్తానికి తులసి.. లాస్య, నందు.. ఇద్దరి మీద అరుస్తుంది. బలవంతంగా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా.. రేపో మాపో నిన్ను వదిలేసి పారిపోడని ఏంటి గ్యారెంటీ అంటుంది తులసి. అందుకే.. ప్రేమించడం నేర్చుకో.. లాక్కోవడం కాదు అంటుంది తులసి.

నీ స్వార్థం వల్ల ఎంతమందిని నాశనం చేశావు. కనీసం.. నువ్వు ప్రేమించిన ఆయనను అయినా నాశనం చేయకుండా వదిలేయ్. మీరు కూడా ప్రేమించినప్పుడు ఉన్నంత ధైర్యాన్ని.. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చూపించండి.. అని నందుపై సీరియస్ అవుతుంది తులసి.

ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం తీసుకోండి. వెంటనే తీసుకోండి అని ఏడుస్తూ వెళ్లిపోతుంది తులసి. దీంతో లాస్య వెళ్లి నీకు ఏ ఆప్షన్లు లేవు ఉన్నవ రెండే నందు అంటుంది లాస్య. ఒకటి నన్ను పెళ్లి చేసుకోవడం.. రెండోది జైలుకు వెళ్లడం అంటుంది లాస్య.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాస్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు నందు. వెంటనే నందుతో లాస్య పెళ్లి జరుగుతుంది. దీంతో తులసి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్లిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Heat Stroke : వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు దాని లక్షణాలు, ఈ నివారణ చర్యలను పాటించండి

Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండ‌లు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కార‌ణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…

19 hours ago

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

2 days ago

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

2 days ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

2 days ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

3 days ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

3 days ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

3 days ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

3 days ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

3 days ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

3 days ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

3 days ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

3 days ago