Intinti Gruhalakshmi 26 Dec Today Episode : శృతి ప్రెగ్నెంట్.. ఈ విషయం తెలిసి లాస్య ప్లాన్.. శృతి గర్భం పోయేలా లాస్య ఏం ప్లాన్ చేస్తుంది?

Intinti Gruhalakshmi 26 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 825 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు ఫ్రిడ్జ్ కీస్ కావాలి అని లాస్యను వెళ్లి అడుగుతుంది అంకిత. దీంతో ఎందుకు అని అడుగుతుంది. దీంతో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతుంది అంకిత. దీంతో ఈ ఇంటికి నేను యజమానిని. ఈ ఇంట్లో ఏం చేయాలన్నా ప్రతి దానికి నా పర్మిషన్ కావాలి. ఇంకా డిటెయిల్ గా వివరాలు కావాలంటే నీ తోటి కోడలును అడిగి తెలుసుకో అంటుంది లాస్య. దీంతో అక్కడికి వచ్చిన పరందామయ్య.. గొడవలు వద్దు ఊరుకో అమ్మ అంటాడు. దీంతో అంకితను కావాలని రెచ్చగొట్టి.. నా మీద గొడవ పెట్టడానికి పంపించి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారా అంటుంది లాస్య. దీంతో ఆయనకు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటుంది అనసూయ.

intinti gruhalakshmi 26 december 2022 full episode

ముందు ఫ్రిడ్జ్ కీస్ ఇవ్వు అంటే.. ఇవ్వను అని అంటుంది లాస్య. మీకు ఇష్టం వచ్చినట్టు.. కాఫీలు, టీలు, స్నాక్స్ అంటూ తింటూ పోతే.. ఈ ఇంటి మీద కంట్రోల్ ఎలా ఉంటుంది. ఈ ఇంటి బాధ్యత నాది. ఇక నుంచి అందరూ అలవాటు చేసుకోండి. నోరు పెట్టుకొని అరవడం కాదు. అర్థం చేసుకోండి అంటుంది. తాతయ్య పేషెంట్. అది మీకు అర్థం అవుతుందా అంటుంది దివ్య. దీంతో అర్థం అవుతుందా పిన్ని అను అంటుంది లాస్య. మామయ్య గారి కోసం అని డజన్ అరటిపళ్లు తెచ్చాను. అది ఎవరికీ కనిపించదా అంటే.. ఆయన అరటి పళ్లు తినకూడదు అని అంటుంది అంకిత.

ఇది నా ఇల్లు. ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి అంటుంది లాస్య. దీంతో నువ్వేమీ కష్టపడి సంపాదించిన ఇల్లు కాదు. మోసపడి కొట్టేసిన ఇల్లు అంటుంది శృతి. దీంతో ఇంకోసారి ఆ మాట అన్నావంటే అస్సలు బాగుండదు అంటుంది లాస్య.

దీంతో ఒక్కసారి కాదు.. వంద సార్లు అంటాను. నువ్వు మోసం చేసి కాజేసిన ఇల్లు అంటుంది శృతి. దీంతో నోర్మూయ్ అంటుంది లాస్య. నన్ను అనే ముందు.. నీ సంగతి చూస్కో. ప్రేమ్ కు గాలం వేసి ఈ ఇంటి కోడలువు అయ్యావు అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 26 Dec Today Episode : కళ్లు తిరిగి పడిపోయిన శృతి

దీంతో అనాథాను నేను కాదు. నువ్వు అంటుంది శృతి. షటప్ అంటే యూ షటప్ అంటూ కళ్లు తిరిగి కింద పడిపోతుంది శృతి. మరోవైపు దేవుడికి తులసి పూజ చేస్తుండగా.. హారతి పళ్లెం తన చేతుల్లో నుంచి జారి కింద పడిపోతుంది.

దీంతో ఏంటి ఈ అశుభం. మా వాళ్లకు ఏదైనా జరగబోతుందా? అని టెన్షన్ పడుతుంది తులసి. శృతిని తీసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు. నువ్వు కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందే. తప్పదు అని అంటుంది అంకిత.

దీంతో అసలు నాకు ఏమైంది చెప్పు అంకిత అంటుంది శృతి. దీంతో చెవిలో నువ్వు గర్భవతివి అని చెబుతుంది అంకిత. దీంతో శృతి తెగ సంతోషిస్తుంది. కంగారు పడాల్సింది ఏం లేదు. శృతి తల్లి కాబోతుంది అని అంటుంది అంకిత.

తాతమ్మ ఇప్పుడు వినపడిందా అంటే.. వినపడిందిలే తాత అంటుంది అనసూయ. ఎంత శుభవార్త చెప్పావమ్మా అంటుంది అనసూయ. దీంతో తల్లయ్యేది నేను కాదు. శృతి అంటుంది అంకిత. అమ్మ శృతి నా బంగారు తల్లి అంటుంది.

వెంటనే తులసికి ఫోన్ చేస్తుంది శృతి. చెప్పమ్మ శృతి అంటుంది. దీంతో వెంటనే మీరు నోట్లో కాస్త చెక్కర వేసుకోండి. దీంతో నేను శుభవార్త చెబుతాను అంటుంది శృతి. దీంతో నోట్లో చెక్కర వేసుకొని ఇప్పుడు చెప్పు అంటుంది.

దీంతో మీరు త్వరలో నానమ్మ అవబోతున్నారు అంటుంది శృతి. దీంతో థాంక్యూ శృతి అంటుంది. పక్కన ప్రేమ్ ఉన్నాడా అంటే.. లేడు ప్రేమ్ కు మీరే చెప్పండి. హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటుంది శృతి.

ఇంతలో తులసి.. డైరెక్ట్ గా ఇంటికే వస్తుంది. లాస్య కలుస్తుంది. నువ్వు నానమ్మవు అవబోతున్నావు కదా అంటుంది. ఇల్లంతా సందడిగా ఉందా? లోపల అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? అని అడుగుతుంది లాస్యను.

అందరినీ వదిలిపెట్టి ఈ టైమ్ లో నువ్వు ఎక్కడికి బయలుదేరావు.. అవసరం లేదులే. నేను స్వీట్స్ తీసుకొచ్చా అంటుంది తులసి. ఇంతలో అందరూ వస్తారు. ఈ ఇంట్లో ఎవ్వరూ ప్రెగ్నెంట్ కాదు కదా అంటుంది లాస్య.

నువ్వు నెల తప్పిన విషయం లాస్యకు తెలియదా? అని అడుగుతుంది శృతిని. దీంతో చెప్పలేదు అని అంటుంది శృతి. ఈ ఇంట్లో ఏ కార్యం జరిగినా నువ్వు ఇన్వాల్వ్ అవొద్దు అని ఇంట్లో నుంచి తులసిని లాస్య బయటికి వెళ్లగొడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…

27 minutes ago

Copper Water Bottles : కాప‌ర్ వాట‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు ఈ నియ‌మాలు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతే…!

Copper Water Bottles : కాప‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…

57 minutes ago

Coolie Movie : ‘కూలీ’లో సైమన్ క్యారెక్టర్ ఆల్ మోస్ట్ హీరో లాంటిది : నాగార్జున

Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…

1 hour ago

Oriental Jobs : ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 26 ఖాళీలు

Oriental Jobs  : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…

2 hours ago

Coffee : మీకో హెచ్చరిక.. ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా..?

Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…

3 hours ago

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

Gurram Paapi Reddy  : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…

9 hours ago

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

12 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

13 hours ago