Home » Entertainment » Intinti Gruhalakshmi 26 October 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 26 Oct Today Episode : గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న సామ్రాట్, తులసి.. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారని తెలిసి నందు షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: October 26, 2022, 9:02 am
Advertisement

Intinti Gruhalakshmi 26 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 అక్టోబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 773 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కారు బ్రేక్ డౌన్ కావడంతో కారు దిగుతారు. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ కనిపిస్తుంది వాళ్లకు. అందులోకి వెళ్తారు. కాలింగ్ బెల్ నొక్కుతారు. ఇంతలో ఇద్దరు కుర్రాళ్లు డోర్ తీస్తారు కానీ.. లోపలికి పంపించరు. దీంతో తాను సామ్రాట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పడంతో వాళ్లు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి అప్పుడు కానీ తులసి, సామ్రాట్ ను ఇంట్లోకి పంపించరు. ఆ తర్వాత మేము అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి అంటే ఫోన్స్ లో నెట్ వర్క్ లేదు.. లాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసుకోండి అంటారు. దీంతో వెంటనే ప్రేమ్ నెంబర్ కు ఫోన్ చేసి మేము సేఫ్ గా ఉన్నాం అని చెబుతుంది తులసి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మీరు తెల్లారాకే అక్కడి నుంచి రండి అంటారు. ఇంతలో తను ఏదో చెప్పబోతుండగా వాళ్లకు వినిపించదు.

Advertisement

intinti gruhalakshmi 26 october 2022 full episode

దీంతో ఏమైంది ఫోన్ వినిపించడం లేదు అంటుంది తులసి. ఫోన్ డెడ్ అయింది అంటాడు సామ్రాట్. మీరు సేఫ్ గా ఉన్నట్టు మీ వాళ్లకు తెలిసింది కదా అంటాడు సామ్రాట్. ఆ తర్వాత మీరు పార్టీ మూడ్ లో ఉన్నారు. మా గురించి మరిచిపోండి. మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఇబ్బంది లేకుండా మేము వేరే చోట కూర్చొంటాం అంటుంది తులసి. కానీ.. వాళ్లు మాత్రం వినరు. మీరు మాతో కలిసి ఎంజాయ్ చేయాల్సిందే అని వాళ్లు అంటారు. బట్టలు కూడా మార్చుకొని రండి అని రూమ్ కు తీసుకెళ్తారు వాళ్లను. మరోవైపు సామ్రాట్ బాబాయికి పరందామయ్య ఫోన్ చేసి సామ్రాట్, తులసి ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని చెబుతాడు.

Advertisement

సామ్రాట్, తులసి గురించి ఇక మనం కూడా టెన్షన్ పడొద్దు అంటాడు పరందామయ్య. కారు కూడా రిపేర్ వచ్చింది అన్నారు కదా. ఈరోజు రాత్రి అక్కడే ఉండి వాళ్లు రేపు ఉదయాన్నే వస్తే నష్టం ఏముంది. మనం వాళ్ల కోసం మెళకువగా ఉండటం ఎందుకు అని అంటాడు పరందామయ్య.

దీంతో అందరూ పడుకోవడానికి వెళ్తారు కానీ నందు, అనసూయ మాత్రం వెళ్లరు. నీకు నిద్ర వస్తుందా అని అడుగుతుంది అనసూయ. ఈ ఇంటి పరువు గడప దాటి రోడ్డు మీద తిరుగుతోంది. తులసిని బాధపెట్టడం ఎందుకు అని అనుకున్నా కానీ.. ఇప్పుడు నేను బాధపడాల్సి వస్తోంది అంటుంది అనసూయ.

Advertisement

Intinti Gruhalakshmi 26 Oct Today Episode : షీలాకు ప్రపోజ్ చేసిన మనోజ్

అసలు తులసి మనసులో ఏముంది.. అని అంటుంది అనసూయ. నందు కూడా వాళ్లిద్దరూ కలిసి ఒక చోట ఉండటం జీర్ణించుకోలేడు. మరోవైపు ఆకలవుతోందిరా అని అనుకుంటారు అందరూ. ఇంతలో సామ్రాట్, తులసి ఇద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు. తులసి పంజాబీ డ్రెస్ వేసుకొని వస్తుంది.

ఆ బ్యాచ్ లోనే మనోజ్, అక్కడే ఉన్న శీలాకు ప్రపోజ్ చేస్తాడు. కొద్ది రోజులు గడిచేసరికి.. పరిచయం స్నేహంగా మారుతుంది. మరికొద్ది రోజులకు స్నేహం ప్రేమగా మారుతుంది.. అంటాడు మనోజ్.

స్నేహం నుంచి ప్రేమ పుట్టదు అని అనుకోవడం మన మనసును మోసం చేసుకోవడమే. ఇక నా కన్ఫ్యూజన్ కు పుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. నీ పట్ల నాకు ఉన్నది ప్రేమ అని కన్ఫమ్ చేసుకున్నా. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా ఉండడం అయ్యే పని కాదని అనుకున్నా అంటాడు మనోజ్.

ఐలవ్యూ షీలా అంటాడు మనోజ్. దీంతో అందరూ చప్పట్లు కొడతారు. సామ్రాట్ మాత్రం తులసి వైపే చూస్తుంటాడు. షీలా కూడా తన లవ్ ను యాక్సెప్ట్ చేస్తుంది. నేను నీకు ఇస్తోంది రోజ్ ఫ్లవర్ మాత్రమే కాదు.. నా గుండెను కూడా. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అంటాడు మనోజ్.

Advertisement

మన గుండెల్లో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా ధైర్యం కావాలి. జీవితాంతం నాతో ఉంటావు కదూ అంటాడు మనోజ్. ఆ తర్వాత తులసి కూడా సంతోషిస్తుంది. అందరూ కలిసి కాసేపు డ్యాన్స్ చేస్తారు.

తులసి, సామ్రాట్ కూడా డ్యాన్స్ చేస్తారు. మరోవైపు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. నిద్ర కూడా రాదు. ఆ తర్వాత ఉదయమే తులసి ఇంటికి రాగానే.. తన ప్రేమాయణం ఎలా జరిగిందో చెప్పమను అని అంటాడు నందు. అనసూయ కూడా నందుకు సపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి