Intinti Gruhalakshmi 27 Aug Today Episode : భూమి పూజ ఆపేందుకు అభి, లాస్య ప్లాన్.. సామ్రాట్, తులసి మధ్య సంబంధాన్ని అంటగట్టిన లాస్య.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 27 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 ఆగస్టు 2022, శనివారం ఎపిసోడ్ 722 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నయ్యకు అమ్మ మీద కోపం ఉందని అనుకున్నా కానీ.. ఇంతలా అమ్మ మీద పగ పెంచుకున్నాడని అనుకోలేదు అంటాడు ప్రేమ్. మళ్లీ నాన్న సపోర్ట్ వాడికి అంటాడు ప్రేమ్. దీంతో ఈ ఇంట్లో మగాళ్లు అందరూ అంతే కదా. మీరు తప్పు చేయడం అది ఆడవాళ్ల మీదికి నెట్టేయడం అని అంటుంది శృతి. మేము మంచోళ్లం కాబట్టి నెట్టుకొస్తున్నాం. లేకపోతేనా అంటుంది శృతి. దీంతో లేకపోతే ఏంటి అని అడుగుతాడు ప్రేమ్. నువ్వు నన్ను మామూలుగా ఇబ్బంది పెట్టావా? ఏడేడు జన్మలకు సంబంధించిన ఇబ్బంది పెట్టేశావు అంటుంది శృతి. దీంతో అంత ఇబ్బంది పడి ఉండటం ఎందుకో అంటాడు ప్రేమ్. దీంతో అనేశావా.. సరే నా బ్యాగు ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టు. నేను వెళ్లిపోతా అని అంటుంది శృతి. దీంతో వద్దు శృతి అంటాడు. నీ మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ అని చెబుతాడు ప్రేమ్. దీంతో వెంటనే మంచం మీద నిద్రపోతుంది శృతి.

Advertisement

intinti gruhalakshmi 27 august 2022 full episode

మరోవైపు సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పడుకున్న హనీని చూస్తాడు. బాబాయి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. తన దగ్గరికి వెళ్లగానే గుడ్ మార్నింగ్ నాన్న అంటుంది హనీ. అప్పుడే లేచావా అంటాడు సామ్రాట్. నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకున్నప్పుడే నేను నిద్రలేచా అంటుంది హనీ. నాటకాలు చేస్తున్నావా.. ఆగు అంటూ తనతో కాసేపు ఆడుకుంటాడు సామ్రాట్. ఈరోజు పూజ ఉంది అని అంటాడు సామ్రాట్. దీంతో తెలుసు.. తులసి ఆంటి చెప్పింది. ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా చెప్పింది అని అంటుంది హనీ. మరి ఇప్పుడు నువ్వు లేచి ఫ్రెష్ అవుతావా లేక తులసి ఆంటి వచ్చి నీకు రెడీ చేస్తుందా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో నీకు జలసీ నాన్న అంటుంది హనీ. ఆ తర్వాత పదా అని తనను రెడీ చేస్తాడు సామ్రాట్. ఆ తర్వాత తను ఏ డ్రెస్ వేసుకోవాలో సామ్రాట్ కు అర్థం కాదు దీంతో. ఈ డ్రెస్ వేసుకో అని చెబుతుంది హనీ.

Advertisement

మరోవైపు సామ్రాట్, హనీ ఇద్దరూ కలిసి కిందికి వస్తారు. ఎంతసేపురా.. మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు బాబాయి. దీంతో ఆకలేస్తే టిఫిన్ చేయొచ్చు కదా. ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో అంటూ హనీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. దీంతో బాబాయి షాక్ అవుతాడు. ఇదంతా తులసి ఆంటి ట్రెయినింగ్ అంటాడు సామ్రాట్.

మరోవైపు తులసి చెట్టుకు పూజ చేస్తుంది తులసి. నేను కోరిన వరాన్ని ప్రసాదించావు. ఈరోజే మ్యూజిక్ స్కూల్ భూమి పూజ. అడుగడుగునా ఆటంకాలు.. అయినా వదల్లేదు. నువ్వు నా వెనుక ఉన్నావని నేను నమ్మాను అని తులసి కోటకు దండం పెట్టుకుంటుంది తులసి.

Intinti Gruhalakshmi 27 Aug Today Episode : అభికి ఫోన్ చేసిన లాస్య

ఇంతలో లాస్య.. అభికి ఫోన్ చేసి తులసి ఏం చేస్తోంది అని అడుగుతుంది లాస్య. దీంతో తులసి కోటకు మొక్కుకుంటోంది అంటాడు అభి. పూజ ఆపలేవా అని అడుగుతుంది లాస్య. దీంతో నేనేం చేయగలను అంటాడు. భూమి పూజ జరిగిందంటే మీ ఇంటికి యజమాని కూడా సామ్రాట్ అవుతాడు అంటుంది లాస్య.

ఏం చేయమంటారు మరి అని అంటాడు అభి. నేను చెప్పేది పొల్లు పోకుండా విను అని ఒక ప్లాన్ చెబుతుంది లాస్య. ఈ పని చేశావనుకో భూమి పూజ కాదు.. మ్యూజిక్ స్కూల్ అడుగు అనేది వెనక్కి పోతుంది అని అంటుంది లాస్య. దీంతో మామ్ హర్ట్ అవుతుందేమో అని అంటాడు అభి.

డాడ్, మామ్ గురించి సామ్రాట్ గారికి తెలియకూడదనే కదా అంటాడు అభి. ఆ సీక్రెట్ బయటపడకుండానే పూజ ఆపొచ్చు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు అంటుంది లాస్య. దీంతో సరే ఆంటి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి పోన్ పెట్టేస్తాడు అభి. నీ కొడుకుతోనే నీ మ్యూజిక్ స్కూల్ ఆగిపోతోంది అని అనుకుంటుంది లాస్య.

ఇంతలో నందు వచ్చి ఏంటి లాస్య తెగ సంతోషంగా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో ఇదొక రకమైన ఎక్సర్ సైజ్. రా నువ్వు కూడా చేద్దువు అంటుంది. దీంతో అదంతా సరే కానీ.. మ్యూజిక్ స్కూల్ బిల్డింగ్ ప్లాన్ ఎక్కడుంది అని అడుగుతాడు నందు. దీంతో ర్యాక్ లో ఉంది అని చెబుతుంది లాస్య.

మరోవైపు శృతి చక్కగా స్నానం చేసి రెడీ అవుతూ ఉంటుంది. చీర కట్టుకొని ఉన్న శృతిని చూసి ప్రేమ్ షాక్ అవుతాడు. తనను అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ప్రేమ్ లో మరో ప్రేమ్ బయటికి వస్తాడు. వెళ్లొద్దురా అంటే ఆగడు. నేను ఆగలేనురా అంటాడు మరో ప్రేమ్.

మరి ఏం చేస్తావు అంటాడు. దీంతో వెనుక నుంచి వెళ్లి లటుక్కున పట్టుకొని కిస్ పెడతా అంటాడు మరో ప్రేమ్. వెంటనే మరో ప్రేమ్ శృతి దగ్గరికి వెళ్తాడు. తనను వాటేసుకొంటాడు. దీంతో ఒరేయ్ వదలరా అంటాడు. దీంతో మరో ప్రేమ్ మాయం అవుతాడు. వెనక్కి తిరిగి చూస్తుంది శృతి.

ఏమైంది అని అంటుంది. దీంతో ఏం లేదు.. అని అంటాడు ప్రేమ్. ఉదయాన్నే లేచి రెడీ అవ్వాల్సింది పోయి.. అరుస్తున్నావా అని చెప్పి అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది శృతి. మరోవైపు భూమి పూజ కోసం సామ్రాట్, హనీ ఇద్దరూ వస్తారు. తులసి కోసం వెతుకుతాడు.

కానీ.. తులసి ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటాడు సామ్రాట్. ఇంతలో తులసి, ప్రేమ్, శృతి, దివ్య, పరందామయ్య, అనసూయ ఒక కారులో వెళ్తారు. తులసిని చూసి తులసి ఆంటి అని హనీ తన దగ్గరికి వెళ్తుంది. హనీ.. నీ డ్రెస్ చాలా బాగుంది అంటుంది. తనను ఎత్తుకుంటుంది.

నాన్నకి పింగ్ బ్లూ అంటే చాలా ఇష్టం. నేను పింక్ వేసుకున్నాను. మీరు బ్లూ వేసుకున్నారు. నాన్న ఫుల్ హ్యాపీ. రాత్రి మీరు ఫోన్ చేసినప్పుడు అందుకే బ్లూ వేసుకోమని మీకు చెప్పాను అంటుంది హనీ. ఇంతలో నందు, లాస్య వస్తారు. రావాల్సిన వాళ్లు రాకపోయేసరికి ఎదురు చూస్తున్న మనసు ముందు టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత భయపడుతుంది అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతుంది లాస్య.

ఈరోజు ఫంక్షన్ కు మీరు గెస్ట్ కాదు మేడమ్.. హోస్ట్. మీరు ఆలస్యంగా వస్తే సామ్రాట్ గారు టెన్షన్ పడతారు అంటుంది లాస్య. భూమి పూజ ఏర్పాట్లు అదిరిపోయాయి సార్ అంటుంది. తులసి మేడమ్ మీరు పార్టనర్ గా చేస్తున్న ఈ పూజ ఈ లేవల్ లో ఏర్పాట్లు ఉంటే.. ఇక మీ పెళ్లికి ఏ రేంజ్ లో ఏర్పాట్లు ఉంటాయో అంటుంది లాస్య.

అదేంటి అందరూ అంత షాక్ గా చూస్తున్నారు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? సామ్రాట్ గారికి మీరు మంచి సంబంధం చూస్తున్నారు కదా. ఏదైనా సంబంధం చూస్తే పెళ్లి చేస్తారు కదా అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

School Holidays : విద్యార్థులకు మ‌ళ్లీ సెల‌వులు..!

School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…

1 hour ago

Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజార‌డానికి కార‌ణం ఇదే

Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…

2 hours ago

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…

3 hours ago

Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…

4 hours ago

Palnadu: వైసీపీ హయాంలో రక్తం పారితే..కూటమి పాలనలో నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…

5 hours ago

Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…

6 hours ago

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…

7 hours ago

Pushpa-3 : పుష్ప–3 నిజమేనా?.. హైప్ మాత్రమేనా?: సుకుమార్ టీమ్ క్లారిటీ !

Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…

8 hours ago