
intinti gruhalakshmi 27 december 2021 full episode
Intinti Gruhalakshmi 27 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటేస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 513 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను నిన్ను పెళ్లి చేసుకోను.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో.. నీ ఇష్టం. కానీ నందు తనకు నచ్చిన పనే చేస్తాడు.. ఎవ్వరినీ లెక్కచేయడు. దానికోసం చివరకు ప్రాణాలు వదులుకోవడానికి కూడా ఏమాత్రం భయపడడు. నీకు ఈ పెళ్లికి భయపడి పారిపోయానని అనుకుంటున్నావా కాదు.. ఇక్కడ ఊపిరి ఆడక బయటికి వెళ్లాను.. అంతే. ఇంతలో ఇంత రచ్చ చేస్తావా? మా వాళ్లను బెదిరిస్తావా? అంటూ లాస్యను బెదిరిస్తాడు నందు. నేను నిర్ణయం తీసుకున్నాను.. ఈ పెళ్లి జరుగుతుంది లాస్య. కానీ.. నీ మీద భయంతో కాదు.. నా కుటుంబం మీద ప్రేమతో. పూజారి గారు మంత్రాలు చదవండి.. అని అంటాడునందు. దీంతో లాస్య సంతోషిస్తుంది. తులసికి మాత్రం ఏడుపు వస్తుంది.
intinti gruhalakshmi 27 december 2021 full episode
అందరూ షాక్ అవుతారు. నందు, లాస్య వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఇంతలో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తులసి కూడా బాధతో అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. నందుతో తన పెళ్లి జరిగిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఒంటరిగా వెళ్లి ఒక చోట కూర్చొని బాధపడుతుంది తులసి. ఓవైపు నందు, లాస్య పెళ్లి జరుగుతూ ఉంటుంది. మరోవైపు తులసి బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో తోచదు తనకు. ఇంతలో నందు.. లాస్య మెడలో తాళి కడతాడు. వాళ్ల పెళ్లి అయిపోతుంది. దీంతో లాస్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. లాస్య చాలా సంతోషిస్తుంది. తులసి కంట్లో నుంచి కన్నీళ్లు జలజలా కారుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. పెళ్లి అయిపోయాక ఇంట్లోకి వస్తుంటారు నందు, లాస్య.
అందరూ బయటికి వస్తారు. హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టించి.. కోడలను ఇంట్లోకి ఆహ్వానించమని చెప్పండి అంటుంది భాగ్య. దీంతో నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కావొద్దు అంటూ అనసూయ అంటుంది. దీంతో నాకెందుకు సంబంధం లేదు.. ఇప్పుడు లాస్య నా తోటి కోడలు అంటుంది.
అరేయ్ నందు మనం ఇక్కడికి వచ్చింది మీ పెళ్లి చూడటానికి కాదు.. తులసి ఆరోగ్యం కోసం అంటాడు పరందామయ్య. ఇది నాకు కోడలే కాదు. ఎవ్వరికైనా హారతి ఇస్తాను కానీ.. దీనికి మాత్రం ఇవ్వను అంటుంది అనసూయ. దీంతో తులసి ఎలా ఉంది నా మంగళసూత్రం అంటుంది లాస్య.
బాగుండాల్సింది మంగళసూత్రం కాదు. నీ కాపురం అంటుంది. ఏం నమ్మకం లేదా అంటే. నమ్మకం ఉండాల్సింది నాకు కాదు.. నీకు.. అంటుంది తులసి. సారీ అత్తయ్య.. నందు కనిపించలేదని నేను మీతో అలా అన్నాను. ఎప్పటికైనా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్లం కదా.. అంటుంది తులసి.
నేను చెడ్డదాన్ని కాదు అత్తయ్య. నందును ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను అంటుంది లాస్య. ఇద్దరూ వెళ్లి పరందామయ్య ఆశీర్వాదం తీసుకుంటారు. ఒరేయ్ నందు.. తప్పో ఒప్పో జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడైనా నిజాయితీగా ఉండు. లాస్యతో అయినా కరెక్ట్ గా ఉండు.. అని చెప్పి పరందామయ్య, అనసూయ ఇంట్లోకి వెళ్లిపోతారు.
అందరూ కంగ్రాట్స్ చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతారు. దివ్య మాత్రం తన తండ్రిని పట్టుకొని ఏడ్చి వెళ్లిపోతుంది. బాధపడకు నందు.. సిచ్యుయేషన్ ను నేను కంట్రోల్ చేస్తాను అని లాస్య అంటే.. అవును నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు అంటాడు నందు.
ఇంట్లోకి వెళ్లాక అందరూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అత్తయ్య అంటూ భాగ్య వస్తుంది. వాళ్లను చూస్తే జాలేస్తుంది అంటుంది భాగ్య. ఈరోజు కోపంలో ఉన్నారు కాబట్టి లాస్యను దూరం పెట్టారు. కోపం తగ్గాక లాస్యను దగ్గరికి తీసుకోరా అని అంటుంది భాగ్య. బావగారు కూడా చాలా బాధపడుతున్నారు.. అంటుంది భాగ్య.
ఇంతలో తులసిని పిలుస్తుంది అనసూయ. చూడు భాగ్య.. ఒక్కరిని సమర్థించాలని అనుకున్నప్పుడు మంచో చెడో వాళ్ల వెనుకే నిలబడాలి. అంతే కాని.. వాళ్ల ముందో మాట.. వాళ్ల వెనుకో మాట మాట్లాడకూడదు. నాకు తెలుసు లాస్య వల్ల నీకు ఏదో కలిసి వస్తుందని నువ్వు తనను సమర్ధిస్తున్నావు. తనతో మంచిగా ఉంటున్నావు అని అంటుంది తులసి.
మళ్లీ మా వల్ల ఏదైనా సమస్య వస్తుందేమోనని లాస్య మీద చాడీలు చెబుతున్నావు. అది పద్ధతి కాదు. ఇక్కడున్నవాళ్లం అంతా అలాంటి వాటికి దూరంగా ఉంటాం.. అని చెబుతుంది తులసి. ఇక నువ్వు బయలుదేరు అమ్మా అంటుంది అనసూయ. దీంతో ఇక్కడ వర్కవుట్ కాదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది భాగ్య.
మరోవైపు నందు, లాస్య ఫస్ట్ నైట్ స్టార్ట్ అవుతుంది. కుటుంబ సభ్యులు అంతా పాటల పోటీలు పెట్టుకొని బయట కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. తులసి.. వేణుమాధవా పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట విని నందు ఫస్ట్ నైట్ చేసుకోకుండా బయటికి వస్తాడు. పాట పాడుతూనే తులసి కింద పడిపోతుంది. దీంతో తులసి అంటూ నందు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.