Home » Entertainment » Intinti Gruhalakshmi 27 January 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 27 Jan Today Episode : గాయత్రికి సపోర్ట్ చేసిన అభి.. తులసి షాక్.. పూజ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన లాస్య.. నందు సర్ ప్రైజ్ నచ్చని లాస్య ఏం చేసింది?

Authored By
Varun G
The Telugu News | Published on: January 27, 2022, 9:00 am
Advertisement

Intinti Gruhalakshmi 27 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ 540 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొత్తానికి పూజ చేయడానికి పీటల మీద కూర్చుంటుంది లాస్య. గాయత్రిని పిలిపించి.. తనే పూజలో కూర్చునేలా చేయిస్తుంది గాయత్రి. చివరకు లాస్య పూజలో అయితే కూర్చుంటుంది కానీ.. తనకు పూజ ఎలా చేయాలో తెలియకపోవడంతో బిక్క మొహం వేసుకొని అటూ ఇటూ చూస్తుంటుంది. పూజ మొదలు పెట్టు లాస్య అంటుంది గాయత్రి. సరే.. సరే.. అన్నీ చూస్తున్నా అంటుంది. పూజకు కూర్చుంది కానీ.. తనకు పూజ చేయడమే తెలియదు అంటుంది అనసూయ. మరి.. మీరు ముందుండి లాస్యతో పూజ చేయించొచ్చు కదా అంటుంది గాయత్రి. ముందు గణపతి పూజతో ప్రారంభించు అంటుంది తులసి. నువ్వు మధ్యలో రాకు తులసి అంటుంది లాస్య.

Advertisement

intinti gruhalakshmi 27 January 2022 full episode

ఇంతలో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అమ్మ వారి ముందు గొడవలు వద్దు.. అత్తయ్య.. లాస్యకు పూజ చేసే విధానం నేర్పించండి అంటుంది తులసి. దీంతో లాస్య పక్కన కూర్చొని పూజ చేయిస్తుంటుంది అనసూయ. పూజ మధ్యలో ఉండగా నందు.. లాస్యకు ఫోన్ చేస్తాడు. లాస్య అర్జెంట్ గా బయలుదేరి కేఫ్ దగ్గరికిరా అంటాడు నందు. ఏమైంది.. ఎందుకు ఇంత హడావుడి అంటుంది లాస్య. ముందు నువ్వు ఒక్కదానివేరా.. ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో అంత అర్జెంట్ గా ఎందుకు పిలుస్తున్నాడు. ఏమైంది.. ఏమైనా ప్రాబ్లమా.. అని అనుకొని వెంటనే పూజలో నుంచి లేచి అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

దీంతో అనసూయ.. గాయత్రిని వేసుకుంటుంది. ఇదేనా ఇంటి కోడలు పూజ చేసే విధానం. దీనికోసమేనా నువ్వు వకల్తా పుచ్చుకుంది అని అంటుంది అనసూయ. ఆ తర్వాత అనసూయ, శృతితో పూజను చేయిస్తుంది అనసూయ. పరిగెత్తుకుంటూ లాస్య.. కేఫ్ కు వస్తుంది. తీరా చూస్తే నందు కేఫ్ లో కనిపించడు.

Intinti Gruhalakshmi 27 Jan Today Episode : లాస్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన నందు.. నందుపై సీరియస్ అయిన లాస్య

తీరా బయటికి వచ్చి చూస్తే కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి సర్ ప్రైజ్ అంటాడు నందు. దీంతో లాస్యకు తీవ్రంగా కోపం వస్తుంది. అర్జెంట్ గా రమ్మంటే ఏమైందో అని నేను అనుకుంటున్నా. కొత్త కోడలుగా ధాన్యలక్ష్మి పూజ చేస్తుండగా నువ్వు ఫోన్ చేశావు. పూజ మధ్యలో వదిలేసి వచ్చాను.. నా మూడ్ అంతా నాశనం చేశావు.. అంటుంది లాస్య.

Advertisement

తను నందుతో గొడవ పడటం.. కేఫ్ స్టాఫ్ చూస్తుంది. దీంతో తనను కారు ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్తాడు నందు. మరోవైపు అంకిత, శృతి, తులసి కలిసి పూజ చేస్తుంటారు. అనసూయ.. అంకిత, శృతితో పూజ చేయిస్తుంది. లాస్యను కారులో ఒక చోటుకు తీసుకొస్తాడు.

ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నందు అంటే.. నిన్ను వదిలేద్దామని అంటాడు నందు. సరే మంచిది అయితే.. వెళ్లిపో ఇక్కడి నుంచి. ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటా అంటుంది లాస్య. నా స్టాఫ్ ముందు అక్కడ నాతో గొడవ పడితే.. రేపు నా స్టాఫ్ ముందు నేను ఎలా తల ఎత్తుకొని తిరగగలను. వాళ్లు నాకు వాల్యూ ఇస్తారా అంటాడు నందు.

అదో జాబ్.. అంటూ తీసిపారేస్తుంది లాస్య. నీకన్నా నాకే అక్కడ ఎక్కువగా అవమానం అనిపించింది అంటుంది లాస్య. కోపంలో లాస్యను కొట్టబోతాడు. కానీ ఆగిపోయి.. నిన్ను పిలవడం నాదే తప్పు లాస్య.. అని చెప్పి నందు వెళ్లి కారులో కూర్చుంటాడు.

నేనే తప్పు చేశానేమో.. మారిపోతున్న నందును నేనే రెచ్చగొట్టానేమో అని అనుకుంటుంది లాస్య. దీంతో మళ్లీ ఇద్దరూ కలిసిపోతారు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి వెళ్తారు. పూజ అయిపోయాక అందరూ పిండి వంటలు తింటారు. ప్రసాదం తింటారు. అందరూ ప్రశాంతంగా కూర్చున్న సమయంలో గాయత్రి చిచ్చు పెడుతుంది.

Advertisement

నాకూతురును ఈ ఇంట్లో పనిమనిషిని చేశారు. నా అల్లుడు ఇంకా అసిస్టెంట్ డాక్టర్ గానే ఉన్నాడు.. అంటుంది గాయత్రి. దీంతో పండుగ పూట ఏంటి అమ్మ ఇవన్నీ అంటుంది అంకిత. నిన్ను మేము ఎలా పెంచుకున్నాం.. కానీ.. ఇప్పుడు చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది అంటుంది గాయత్రి.

నేను కూడా మిమ్మల్నే సపోర్ట్ చేస్తాను ఆంటి.. అంటాడు గాయత్రి. అంకిత చెప్పిన బంధాలు బతకడానికి సరిపోవు. బతకడానికి డబ్బే కావాలి అంటాడు అభి. పరందామయ్య ఏదో చెప్పినా కూడా వినడు అభి. ఆంటి మీరు దిగులుపడకండి.. త్వరలోనే మీ అల్లుడు ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎగురుతాడు.. అంటాడు అభి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి