Home » Entertainment » Intinti Gruhalakshmi 27 July 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 27 July Today Episode : హనీ కాంపిటీషన్లో ఒడిపోతుందా.!? టెన్షన్ లో సామ్రాట్, తులసి..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 27, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 27 July Today Episode : భజరే నందగోపాల హరే పాటకు తులసి డాన్స్ నేర్పిస్తుంది.. అంతలో లాస్య చెప్పిన మాటలు విని నందు వెళ్తాను అని అంటాడు.. మా హనీ డాన్స్ చూడకుండా వెళ్లిపోతారు అని అంటాడు సామ్రాట్.. లాస్య లేదు లేదు సార్ ఇక్కడ ఇంత డ్రామా జరుగుతుంటే మేము ఎలా వెళ్తాను అంటుంది.. తులసి డాన్స్ చేస్తుండగా వెళ్లి సామ్రాట్ కు తగులుతుంది.. అలా సామ్రాట్ తులసిని పట్టుకుంటాడు.. నందు ను చూస్తూ లాస్య ఇదంతా అనుకోకుండా జరిగింది అని అనుకుంటున్నారా అని అంటుంది.. పాపకు మీరు ఈరోజు చాలా హెల్ప్ చేశారు.. అందుకే రేపు మీరు కూడా రండి అని సామ్రాట్ రిక్వెస్ట్ చేస్తాడు..! తులసి రాను అని చెబుతుంది చూడు హనీ ఈరోజు మీకోసం తులసి ఆంటీ వచ్చింది కదా.. రేపు చాలా ఇంపార్టెంట్ పని ఉండి ఉంటుంది..

Advertisement

అందుకే రాను అంటుంది. ఈరోజు వచ్చినందుకు చాలా గిట్టుబాటు అయినట్టుంది అని ఇన్ డైరెక్ట్ గా లాస్య పంచులు వేస్తుంది. తను ఎక్కడ ఉన్నా తన మనసంతా ఇక్కడే ఉంటుంది అని డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది. తులసి అర్థమయ్యే అర్థం కానట్టు ఉండిపోతుంది అంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ హనీకి వాళ్ళ అమ్మ లేదు కదా అనుకోకుండా మీకు దగ్గర అయింది.. చూసావా ఇంట్లో వాళ్ళందరూ ఏకమై తులసిని ఇంటికి దగ్గర చేయాలి అని అనుకుంటారు అని లాస్య నందు పక్కన చేరి గుసగుసలాడుతూ ఉంటుంది.. ఈ ఇంటికి ఎంత దూరం అవ్వాలని నేను ఆలోచిస్తుంటే దగ్గర చేస్తున్నాడు ఆ దేవుడు అని మనసులో అనుకుంటుంది తులసి.. కేవలం కోసం మాత్రమే ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది తులసి.. సరే అని అంటుంది తులసి. పక్కనున్న నీ భార్య కంటే వదిలేసిన నీ మాజీ భార్య మీద నీకు ప్రేమ ఎక్కువగా ఉంది అని లాస్య నందుని ఇంకా తన మాటలతో రెచ్చగొడుతుంది..

Intinti Gruhalakshmi 27 July 2022 Full Episode

Advertisement

యశోద స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలకు ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి.. అందరూ వాళ్ళ స్టూడెంట్స్ ను తీసుకుని వస్తారు.. ఇక అదే ఫంక్షన్ కి లాస్య, నందు లక్కీ ను తీసుకుని వస్తుండగా.. తులసిని చూసి షాక్ అవుతారు.. పెద్ద ముత్తైదువ పేరంటానికి రెడీ అయ్యి వచ్చింది చూడు అని అంటుంది లాస్య.. తులసి హానిని రెడీ చేస్తుంది.. అందరూ బాగుంది అని అంటారు.. హానికి తప్పకుండా ఫస్ట్ వస్తుంది అని సామ్రాట్ అంటాడు.. తను ఓడిపోతే బాధ పడుతుంది సామ్రాట్, వాళ్ల బాబాయి అంటారు.. అందుకే తననీ కాంపిటీషన్ కు దూరంగా ఉంచుతాం అని అంటాడు.. కచ్చితంగా గెలుస్తుంది అని తులసి అంటుంది..లక్కీ వెనుకగా వచ్చి తులసిని బెదిరిస్తాడు.. ఈ అల్లూరి సీతారామరాజు ను తప్పించుకుని ఎక్కడికి పారిపోతారు అని అంటాడు.. మీరు పోరాడాల్సినది నాతో కాదు నల్ల దొరలతో అని అంటుంది..

అంతలో ఆ చిన్నొడుని చూసి నువ్వు ఎవరు అని అడుగుతుంది.. తెలిసి నన్నే గుర్తుపట్టలేదా తులసి ఆంటీ అని గడ్డం తెస్తాడు లక్కీ నువ్వా అని అంటుంది తులసి..తులసి లక్కీ తో మాట్లాడటం చూసి సామ్రాట్ ఈ అబ్బాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు.. అంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఈ అబ్బాయి ఎవరు అమ్మా అని అడుగుతుండగా.. లాస్య వచ్చి రేయ్ లక్కీ ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ గడ్డం పికాద్దు అని అంటుంది.. అంతలో హనీ వాళ్ళ టీచర్ ఏదో ఇంటర్వ్యూ ఉంది అని అర్జెంటుగా వెళుతున్నాను టైం కి వచ్చేస్తాను అని చెబుతుంది.. హనీ వాళ్ళ టీచర్ అక్కడ లేకపోతే హనీ కంగారుపడి పర్ఫామెన్స్ సరిగ్గా ఇవ్వలేదు అని అంటాడు సామ్రాట్.. అప్పటివరకు తనని మేనేజ్ చేసే బాధ్యత తులసి తీసుకుంటుంది.. కానీ వాళ్ళు పాటిస్పేట్ చేసే టైం వచ్చినా కూడా వాళ్ళ టీచర్ టైం కి రాదు ఇక ఏం చేస్తారు అనేది సస్పెన్స్ క్రియేట్ చేశారు..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి