Home » Entertainment » Intinti Gruhalakshmi 27 October 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : సామ్రాట్, తులసి మధ్య అక్రమ సంబంధం అంటగట్టిన నందు.. అనసూయ సపోర్ట్ నందుకే.. సామ్రాట్ ను తులసి పెళ్లి చేసుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: October 27, 2022 7:37 am
Advertisement

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 774 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టైమ్ 3 అవుతున్నా ఇంకా తులసి నుంచి ఎలాంటి సమాచారం రాలేదంటే అక్కడ తులసి, సామ్రాట్ ఇద్దరూ ఏం చేస్తున్నారో అంటూ నందు తెగ టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు సామ్రాట్ కు వర్షంలో తడవడం వల్ల జ్వరం వస్తుంది. దీంతో ఏం చేయాలో సామ్రాట్ కు అర్థం కాదు. డాక్టర్ ను పిలుద్దామంటే ఈ వర్షంలో ఎవరూ రారని.. తనకు తెలిసిన వైద్యం చేస్తుంది తులసి. కషాయం తాగిస్తుంది తులసి. తర్వాత తనను పడుకోబెడుతుంది. మరోవైపు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. మీరు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోండి. నిద్రపోండి అప్పుడే మీకు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది తులసి. అయితే.. నేను మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నా తులసి గారు అని.. నేను నేను అంటూనే ఉంటాడు ఇంతలో డాక్టర్ కోసం ట్రై చేస్తున్నాను కానీ కాల్ కలవడం లేదు అంటూ మనోజ్ వచ్చి చెబుతాడు. ఇంతలో సామ్రాట్ నిద్రపోతాడు. దీంతో ఆయన దగ్గరే కూర్చొని రాత్రంతా సపర్యలు చేస్తూ ఉంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 27 october 2022 full episode

ఇంతకుముందు తులసి ఫోన్ చేసింది ఈ ఫోన్ కే కదా అని ఫోన్ తీసుకొని అందులో ఉన్న నెంబర్ కు ఫోన్ చేస్తాడు నందు. కానీ.. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. మళ్లీ కాల్ చేస్తాడు. దీంతో ఒక వ్యక్తి ఫోన్ ఎత్తుతాడు. ఇంతకు ముందు ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అని అంటాడు నందు. ఎవరు మీరు అంటాడు. తులసి గురించి ఫోన్ చేశా అంటాడు నందు. ఇంతలో ఫోన్ లో డిస్టర్బెన్స్ వస్తుంది. దీంతో అంకుల్ కు హైఫీవర్ అంటాడు ఆ వ్యక్తి. అది కూడా నందుకు వినిపించదు. దీంతో అంకుల్, ఆంటి రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో నందు షాక్ అవుతాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. రాత్రి మొత్తం సామ్రాట్ కు సపర్యలు చేస్తూనే అక్కడే కుర్చీలో కూర్చొని నిద్రపోతుంది తులసి. ఇంతలో తులసి మెలుకువకు వస్తుంది. ఎలా ఉంది బాగానే ఉన్నారు కదా అంటుంది. బాగానే ఉంది అంటాడు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. శ్రమ పెట్టాను అంటాడు సామ్రాట్.

Advertisement

ఒకవేళ నాకే హెల్త్ బాగోలేకపోతే మీరు టెన్షన్ పడరా.. పట్టించుకోరా.. సేవలు చేయరా అంటుంది తులసి. దీంతో అలా ఎలా వదిలేస్తాను తులసి గారు.. మీకు ఎప్పటికీ ఏం జరగనివ్వను.. అంటాడు సామ్రాట్. నేను రాత్రి జ్వరం మత్తులో పిచ్చిగా ఏమన్నా మాట్లాడానా అంటాడు సామ్రాట్.

లేదండి.. ఏం మాట్లాడలేదు అంటుంది. మరోవైపు తులసి కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఒక్క పూట మామ్ ఇంట్లో లేకపోతే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. తనను వెల్ కమ్ చేయడానికి అందరం తెగ ఎదురు చూస్తున్నాం అంటుంది దివ్య. తను రాగానే రెస్ట్ తీసుకోనిద్దాం. డిస్టర్బ్ చేయొద్దు అంటుంది అంకిత.

Advertisement

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : తులసిపై నందు, అనసూయను రెచ్చగొట్టిన లాస్య

నానమ్మ.. అమ్మ ఫోన్ చేసింది. దగ్గర్లోనే ఉన్నారట. ఏ నిమిషంలో అయినా రావచ్చు అంటాడు ప్రేమ్. ఇలా ఖాళీ చేతులతో కూర్చున్నారు ఏంటి అత్తయ్య. దిష్టికి రెడీ చేయండి. అలాగే హారతిపళ్లేనికి కూడా రెడీ చేయండి అంటుంది లాస్య. రెండు పూల దండలు కూడా తెప్పిస్తే మంచిదేమో అని నందుతో అంటుంది అస్య.

స్వీట్స్ కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాను. సెలబ్రేట్ చేసుకోవాలి కదా మరి. జంటగా వస్తారు కదా.. గుమ్మం దగ్గర పేర్లు చెప్పించే ప్రయత్నం కూడా చేద్దామా.. ఒక పని కూడా అయిపోతుంది కదా అంటుంది లాస్య. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లి కుర్చీ తీసుకొని గుమ్మం ముందే కూర్చొంటాడు నందు.

ఇంతలో క్యాబ్ దిగి ఇంటికి వస్తుంది తులసి. ప్రయాణం ఎలా జరిగింది ఆంటి అని శృతి అడిగితే. ప్రయాణం కాదు.. ప్రేమాయణం ఎలా జరిగిందని అడుగు అంటాడు నందు. దీంతో మిస్టర్ నందగోపాల్ అంటుంది తులసి. వాడు అన్నదాంట్లో తప్పేముంది అంటుంది అనసూయ.

మామ్ ను ఏమనొద్దు అని అంటుంది దివ్య. మీకు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది తులసి. నిజం ఏంటో అది మాత్రమే నేను చెబుతాను అంటుంది తులసి. దీంతో రాత్రి జరిగిన మొత్తం విషయం చెబుతుంది తులసి. అంతే కాదు.. సామ్రాట్ గారికి హైఫీవర్ కూడా వచ్చింది అంటుంది తులసి.

Advertisement

అవునా అందుకే ఇద్దరూ ఒకే బెడ్ రూమ్ లో ఒకే దగ్గర ఉన్నారా అంటాడు. రాత్రి నేను ఫోన్ చేస్తే అంకుల్ ఆంటి ఒకే బెడ్ రూమ్ లో ఉన్నారని చెప్పాడు అంటాడు నందు. దీంతో అతడితో ఉన్నాను అంటుంది. నేను అతడితో ఒకే రూమ్ లో ఉన్నాను అంటుంది తులసి.

కానీ.. అప్పట్లో మీరిద్దరూ తలుపు మూసుకొని బెడ్ రూమ్ లో ఉన్నట్టు కాదు.. అతడిని ఒంట్లో బాగోలేదు. సేవలు చేస్తూ అతడి మీద ధ్యాస ఉంచాను అంటుంది తులసి. ఒంట్లో బాగోలేదా.. మరి ఈ వీడియో చూస్తే అలా అనిపించడం లేదే అంటూ వాళ్లంతా డ్యాన్స్ చేసిన వీడియోను చూపిస్తుంది లాస్య.

ఆ వీడియో చూశాక.. ఇప్పుడేమంటావు తులసి. అబద్ధం చెప్పడానికి సిగ్గు లేదూ అంటుంది అనసూయ. అది సామ్రాట్ గారికి ఫీవర్ రాకముందు చేసిన డ్యాన్స్ వీడియో అని చెబుతుంది తులసి. కానీ.. ఎవ్వరూ నమ్మరు. అతడు డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయాడు అంటుంది తులసి.

దీంతో నా ముగ్గురు పిల్లల తల్లి దిగజారి పడిన వీడియో లేదా అని ప్రశ్నిస్తాడు నందు. తులసి ఎంత చెప్పినా నమ్మడు నందు. అగ్నిపరీక్షకు సిద్ధం కావాల్సిందే అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి