
intinti gruhalakshmi 28 december 2022 full episode
Intinti Gruhalakshmi 28 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 827 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారంటే దానికి నువ్వే కారణం కానీ.. ఇప్పుడు ఇక్కడ నువ్వు మళ్లీ గొడవ చేయకు అంటాడు నందు. ఇంతలో ప్రేమ్ రెచ్చిపోయి లాస్య, నందు మీద మాట్లాడుతాడు. దీంతో నన్ను ఇంత మాటంటావా అని ప్రేమ్ పై సీరియస్ అవుతాడు నందు. తనను కొట్టబోతాడు. దీంతో తులసి అడ్డుకుంటుంది. ముందు ఆయనకు సారీ చెప్పు ప్రేమ్ అంటుంది. దీంతో ముందు లాస్యను నీకు సారీ చెప్పమను అంటాడు ప్రేమ్. మళ్లీ ప్రేమ్ ను కొట్టబోతాడు నందు. దీంతో సామ్రాట్ అడ్డుకుంటాడు. మీరు మీ పెద్దరికం నిలబెట్టుకుంటే మంచిది అంటాడు సామ్రాట్.
intinti gruhalakshmi 28 december 2022 full episode
నేను ఇక్కడికి వచ్చింది ఈ గొడవ చూడటానికి కాదు. దయచేసి మనం వెళ్దాం పదండి అంటూ బయటికి వెళ్తుంది తులసి. చూశారా.. వాడు ఎలా మాట్లాడుతున్నాడో అని అంటాడు నందు. దీంతో వాడి బాధలో అర్థం ఉంది అంటాడు పరందామయ్య. చివరకు ఇదంతా నీవల్లే.. శుభవార్తను అందరితో పంచుకోవచ్చు కదా అంటాడు నందు. దీంతో నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. నాకు అర్థం కావడం లేదు అంటుంది శృతి. దీంతో ఎవ్వరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు శృతి అంటాడు ప్రేమ్. ముందు మీ ఆలోచనలను మార్చుకొని శృతితో మాట్లాడండి అని చెప్పి శృతిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ప్రేమ్.
మరోవైపు ప్రేమ్ చేయి పట్టుకుంటుంది. దీంతో సారీ శృతి అంటాడు. ఒక స్త్రీకి మొదటి సారి తల్లి అవుతున్నాను అని తెలిసిన క్షణాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఆ వార్త అందరికీ చెప్పి పండుగ చేసుకోవాలని అనుకుంటుంది.
కానీ.. భర్తగా నా భార్యకు ఆ మధురమైన క్షణాలు లేకుండా చేశాను. పొంగిపోవాల్సిన సమయంలో కుంగిపోయేలా చేస్తున్నాను. ఆనంద భాష్పాలు రావాల్సిన నీ కంట కన్నీళ్లు వచ్చేలా చేస్తున్నాను. నీ భర్త నీ ముందు ఒక నిస్సహాయుడిగా, చేతకాని వాడిగా నిలబడ్డాడు అంటాడు ప్రేమ్.
నా దురదృష్టానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు ప్రేమ్ అంటే.. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లనే నీకు ఈ దురదృష్టం కావచ్చు అంటాడు ప్రేమ్. దీంతో నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లనే నేను ఒక మంచి ఫ్యామిలీలో అడుగుపెట్టాను అంటుంది శృతి.
లాస్య పంతం, లాస్య పట్టుదల మన ఆనందంలో నీళ్లు పోసింది అంటాడు ప్రేమ్. దీంతో నువ్వేం టెన్షన్ పడకు. సంతోషం మనల్ని వెతుక్కుంటూ రానప్పుడు.. మనమే సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్దాం అంటుంది శృతి.
మనకు దక్కాల్సిన సంతోషాన్ని ఎవరు లాక్కోవాలని చూసినా దేవుడు మనకే ఇస్తాడు అంటుంది శృతి. ఎందుకు వెనక్కి తగ్గారు అని ఇంటికెళ్లాక తులసిని సామ్రాట్ అడుగుతాడు. మీ పిల్లలు మీకు దగ్గరవడం మీకు ఇష్టం లేదా అంటాడు.
దీంతో ఉంది కానీ.. వాళ్ల నాన్నకు దూరం అవడం నాకు ఇష్టం లేదు అంటుంది తులసి. నా పిల్లలు కేవలం నాతోనే ఉండాలి అని కోరుకొని ఉండి ఉంటే.. ఎప్పుడో అది సాధించుకునేదాన్ని అంటుంది తులసి.
నేను యుద్ధమే చేస్తున్నాను కానీ.. ఆ యుద్ధం నాకోసం. నేను ఎదగడం కోసం అంతే తప్ప.. నా పిల్లల మనసులు గాయం చేయడం కోసం కాదు అంటుంది తులసి. కేవలం లాస్య చేసే మాయ వల్లే నందగోపాల్ ప్రభావితం అవుతున్నాడు అంటాడు సామ్రాట్.
ఏదీ అనుకున్నట్టు జరగడం లేదు. తప్పు ఎక్కడుందో తెలియడం లేదు అంటుంది తులసి. మీరు అలా డల్ గా ఉంటే బాగోలేదు. ఏదో ఒకటి మాట్లాడండి. ఇప్పటికే జీవితంలో చాలా త్యాగాలు చేశారు. పద్ధతి మార్చుకోండి అంటాడు.
కాసేపు ఆఫీసుకు వెళ్దామా అంటాడు. లేకపోతే మనసు బాగోలేనప్పుడు నేనే కాఫీ చేసుకొని తాగుతాను అంటాడు. కావాలంటే మీకు చేసి పట్టుకొస్తాను అంటాడు సామ్రాట్. అయినా తులసి ఏం మాట్లాడదు.
దీంతో కిచెన్ లోకి వెళ్తాడు సామ్రాట్. కాఫీ చేయబోతూ వేడి గిన్నె కాల్చుకుంటాడు. దీంతో ఆ.. అని అరుస్తాడు. దీంతో అక్కడికి వెళ్లిన తులసి.. ఏమైంది అని చేయి చూస్తుంది. చేయి కాలుతుంది.
దీంతో మీకు వంట రానప్పుడు ఎందుకు ఇలా చేయడం అంటుంది. దీంతో మీరు మాట్లాడాలనే కావాలనే చేయి కాల్చుకున్నా అంటాడు సామ్రాట్. మరోవైపు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ప్రేమ్ మాటలకు చాలా చిరాకు పడతాడు.
మరోవైపు టెర్రెస్ మీద ఉన్న నందు దగ్గరికి వచ్చిన లాస్య.. ఏమైంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది లాస్య. దీంతో నేను ఎందుకు ఇలా చేశానా అని అనుకుంటున్నా అంటాడు. దీంతో దేని గురించి అంటుంది లాస్య.
ప్రేమ్ చెప్పింది నిజమే. హ్యాపీగా సంబురాలు చేసుకోవాల్సిన మనం ఇలా గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అంటాడు నందు. దీంతో మళ్లీ నందును ట్రాక్ తప్పించి ఆ తులసే అంతా తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడుతుంది లాస్య.
మరోవైపు తులసి ఇంటికి వెళ్లి శృతి ప్రెగ్నెన్సీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇంతలో కాలు జారి కింద పడుతుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.