Intinti Gruhalakshmi 28 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 567 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేస్తుందని గాయత్రి.. లాస్యకు చెప్పడంతో వెంటనే లాస్య.. ఫోన్ లో తులసి మీడియాతో మాట్లాడిన వీడియోను చూస్తుంది. వెంటనే ఈ విషయాన్ని నందుకు చెబుతుంది. దీంతో నందుకు కోపం వస్తుంది. ఇప్పుడే వెళ్లి తనను లాక్కొస్తాను అని అంటాడు నందు. వద్దు.. అది కూడా లైవ్ లోనే కనిపిస్తుంది. ఈ విషయం మీ ఇంట్లో అందరికీ తెలిస్తే అందరూ తన దగ్గరికి చేరుతారు అని అంటుంది లాస్య. మరోవైపు జీకే.. టీవీలో తులసి గురించి చూస్తాడు. వెంటనే కమిషనర్ కు ఫోన్ చేస్తాడు. న్యాయం కోసం తులసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేస్తుందని చెబుతాడు.
దీంతో అవును.. ఆ కేసును నేను చూశాను. తన కొడుకును దాచిపెట్టి పోలీస్ స్టేషన్ ముందు తనే దీక్ష చేస్తుందని మా వాళ్లు చెప్పారు అంటాడు కమిషనర్. దీంతో తులసి గురించి చెబుతాడు జీకే. దీంతో నేను పర్సనల్ గా ఈ కేసును టేకప్ చేస్తాను అని చెబుతాడు కమిషనర్. మరోవైపు గాయత్రి దీక్ష చేస్తున్న తులసి దగ్గరికి వెళ్తుంది. తను పట్టుకున్న బోర్డును పడేస్తుంది. ఎందుకు ఇలా నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు అంటుంది గాయత్రి. ఇద్దరూ కాసేపు అక్కడే గొడవ పెట్టుకుంటారు. నా అల్లుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని నాకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా.. అంటూ గాయత్రి సీరియస్ అవుతుంది.
ఎప్పుడూ నా కూతురుకు సంబంధించిన వార్తను పరాయి వాళ్లు చెబితే తెలుసుకోవాల్సిందేనా అంటుంది గాయత్రి. గాల్లో దీపం పెట్టి ఆశగా చూస్తూ కూర్చోలేం తులసి. ఇది చేతగాని వాళ్లు చేసే పని. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే చాలు.. వణుకుతూ నా ముందు అభిని నిలబెడతారు. రచ్చ చేయకు. టెంట్ పీకేసి ఇంటికి పదా. నువ్వు చూస్తూ ఉండు. నీ కళ్ల ముందే అభిని తీసుకొస్తాను అంటుంది గాయత్రి.
వెంటనే స్టేషన్ లోపలికి వెళ్లి ఎస్ఐపై విరుచుకుపడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి. నేను, మా వారు ఇద్దరం ఈ సిటీలో ఫేమస్ డాక్టర్లం అంటుంది గాయత్రి. అయితే ఏంటి అని ఎస్ఐ సీరియస్ అవుతాడు. మేము అతడి కోసమే వెతుకుతున్నాం అంటాడు ఎస్ఐ.
అభి దొరకగానే కబురు పెడతాం. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు ఎస్ఐ. అభి.. అల్లుడు అంటూ ఇంకోసారి మాట్లాడితే లాకప్ వేస్తా. మళ్లీ బయటికి రాకుండా చేస్తా అంటాడు ఎస్ఐ. దీంతో ఇప్పుడు వెళ్తున్నా. మళ్లీ వదిలిపెట్టేదే లేదు అంటుంది గాయత్రి.
అక్కడి నుంచి తులసి దగ్గరికి వస్తుంది గాయత్రి. ఎస్ఐ మొండోడిలా ఉన్నాడు అంటుంది గాయత్రి. ఈ ఎస్ఐని డీల్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తోంది అంటుంది గాయత్రి. దేనికీ లొంగని వాడు నీ దీక్షకు లొంగుతాడని ఎలా అనుకుంటున్నావు అంటుంది గాయత్రి.
నీకు ఇప్పటి వరకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. నీ దీక్ష చూసి పోలీస్ కమిషనర్ దిగి వస్తాడని అనుకున్నావా అని అంటుంది గాయత్రి. అప్పుడే పోలీస్ కమిషనర్ కారు వచ్చి ఆగుతుంది. దీంతో కమిషనర్ తులసి దగ్గరికి వస్తాడు. సార్.. నేను ఒక సగటు తల్లిని. ఏ వ్యవస్థ మీద పోరాటం చేసే శక్తి, ఆసక్తి నాకు లేదు కమిషనర్ గారు అంటుంది తులసి.
ఏ ఒక్కరి మనసు అయినా కరిగి సాయం చేయకపోతారా అనే చిన్న ఆశ అంటుంది తులసి. జరిగిన విషయం మొత్తం చెబుతుంది తులసి. నా కోరిక అల్లా ఒక్కటే. ఒక్కసారి నా బిడ్డను చూపించండి. తప్పు చేస్తే చట్ట పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకోండి అంటుంది తులసి.
తులసి గారు మీరు నాతో పాటు స్టేషన్ లోకి రండి. ఎస్ఐ ముందే మ్యాటర్ తేల్చేద్దాం అంటాడు కమిషనర్. నా బిడ్డను చూసేవరకు దీక్షను కొనసాగిస్తానని మాట తీసుకున్నాను సార్.. అందుకే స్టేషన్ లోపలికి రాలేను అంటుంది తులసి. దీంతో సరే.. నేను మీ అబ్బాయిని చూపించే ప్రయత్నం చేస్తా అంటాడు కమిషనర్.
మరోవైపు కమిషనర్ గారు వచ్చారని కానిస్టేబుల్.. ఎస్ఐకి చెబుతాడు. దీంతో ఎస్ఐ టెన్షన్ పడతాడు. మీ ఉద్యోగానికే ఎసరు వచ్చేటట్టుంది. వెంటనే తప్పు ఒప్పుకోండి సార్ అంటాడు. కానీ.. కమిషనర్ ను తప్పించుకొని వెనుక డోర్ నుంచి వెళ్లిపోతాడు ఎస్ఐ.
దీంతో.. అభిని ఎస్ఐ ఏం చేస్తాడో అని అనుకొని కానిస్టేబుల్ ఈ విషయం వెంటనే తులసికి చెప్పాలని అనుకుంటాడు. ఆ తర్వాత అభిని ఓ అడవికి తీసుకెళ్లి.. ఎన్ కౌంటర్ చేయబోతాడు ఎస్ఐ. అప్పుడే తులసి అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.