Intinti Gruhalakshmi 28 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 541 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ ను ఆదర్శంగా తీసుకుంటే ఏమొస్తుంది. వాడేదో కాలక్షేపం చేస్తున్నాడు.. అంటూ అభి ప్రేమ్ తో గొడవపడతాడు. నాకు డబ్బే అవసరం అంటాడు అభి. ఎవరు ఎప్పుడు పిలుస్తారా.. అని చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు చేతకాదు.. అంటాడు అభి. వాడు ఎదగలేడు. ఇక శృతి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. మమ్మీ పక్కనే తానా అంటే తందానా అనడం తప్పితే ఇంకేం లేదు అంటాడు అభి. ఒరేయ్.. శృతిని ఎందుకు కామెంట్ చేస్తున్నావు ఇప్పుడు తనేం తప్పు చేసింది అంటాడు. ఏం.. అంకిత తప్పు చేసినప్పుడు తనను అందరి ముందు అడగలేదా అంటాడు. వాడు చేతగాని వాడు అంటాడు అభి.
ఇంతలో తులసి కలగజేసుకుంటుంది. ప్రేమ్ నువ్వు ఆగు. అభి ఎందుకు ఇలా నోరు జారుతున్నావు.. అని అడుగుతుంది. అయినా కూడా అభి వినడు. తులసిపై కూడా సీరియస్ అవుతాడు. నాకు మీలాంటి జీవితం వద్దు. నాకు పనికిరాని సలహాలు ఇవ్వకు అంటాడు అభి. దీంతో అందరూ షాక్ అవుతారు. అంకిత వద్దు అంటున్నా కూడా వినడు అభి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.. లోపలికి వెళ్దాం పదా అని తీసుకెళ్తుంది అంకిత. ఏమైంది వీడికి అని అంటుంది అనసూయ. ఇంతలో గాయత్రి కలుగజేసుకొని నా అల్లుడిని ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేయలేదు. ఇక నైనా నా అల్లుడు, బిడ్డ బాగుపడేలా చేయండి. మీకు చేతగాదంటే చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది గాయత్రి.
ఈ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకోవాల్సింది పోయి.. నువ్వే ఇలా చేస్తే ఎలా అంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తున్నావు. నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా అని చెప్పి అభికి క్లాస్ పీకి వెళ్లిపోతుంది అంకిత.
మరోవైపు తులసి.. అభి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నా జీవితానికి జరిగిన నష్టం నా వరకే అనుకున్నా. నా బాధను దిగమింగుతూ పిల్లలను చూసుకుంటూ సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా కానీ.. అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఇంకొకటి. వాళ్లలో క్రమశిక్షణ లోపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అనుకుంటుంది తులసి.
ఇంతలో నందు, లాస్య కారు వస్తుంది. నందు ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. లాస్య కూడా లోపల తాగి ఉంటుంది. నీకు నచ్చదని తెలుసు. కోపం వస్తుందని తెలుసు అయినా సరే ఉండలేకపోయాను.. ఆగలేకపోయాను. నా మనసు చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది. అందుకే పండుగ చేసుకున్నాను తులసి అంటాడు నందు.
నన్ను ఇప్పుడు ఏం అనొద్దు ప్లీజ్ అంటే.. అనే అవకాశం ఉన్నప్పుడే ఏం అనలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అంటాను అంటుంది తులసి. లాస్య ఎక్కడ అని అడుగుతుంది తులసి. వచ్చింది కదా అంటుంది. ఏది అంటే.. కారులో నిద్రపోతూ ఉంటుంది లాస్య.
తనను చూసి లాస్య.. కారు దిగు అంటుంది తులసి. నందు వెళ్లిపోయాడు అంటుంది. కారు దింపి లాస్యను తీసుకెళ్లబోతుంటే ఆపి.. ఇది ఎవరి ఇల్లు అని అడుగుతుంది లాస్య. మన ఇల్లే అంటుంది తులసి. అప్పుడెప్పుడో నీ ఇల్లు అన్నావు కదా అంటుంది లాస్య.
నేను నీ మొగుడిని లాక్కున్నాను. నిజంగానే లాక్కున్నాను. బాధగా అనిపించిందా లేదా? అది బాధ అని తెలిసి కూడా నాకు, నందుకు మధ్యలో దూరి నన్ను బాధపెడుతున్నావు. ఎందుకు అలా చిన్నపిల్లలా చేసి బాధపెట్టడం తప్పు కదా అంటుంది లాస్య.
అభి అలా మాట్లాడేసరికి.. ప్రేమ్, శృతి ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. మనసు ఎప్పుడూ ఇష్టపెట్టేవాటినే గుర్తుపెట్టుకోవాలి. కష్టపెట్టేవాటిని కాదు. అవి మరిచిపో అంటాడు ప్రేమ్. అవి నేను ఎప్పుడో మరిచిపోయాను.. అంటుంది శృతి.
అందుకే నువ్వు లైఫ్ లో ఏదో ఒకటి సాధించు ప్రేమ్ అంటుంది శృతి. నువ్వు మాటల మనిషివి కాదు.. చేతల మనిషివి అని అనుకుంటారు అంటుంది శృతి. దీంతో నేను ఇలా ఉండటం నీకు నచ్చలేదా అని అంటాడు ప్రేమ్. నిన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను అంటుంది శృతి.
ఉదయం లేవగానే హ్యాంగోవర్ తో తల పగిలిపోతోంది అంటాడు నందు. రాత్రి అనవసరంగా ఎక్కువ తాగామేమో అని లాస్యతో అంటాడు నందు. ఇంతలో తులసి వస్తుంది. నాకు మాత్రం మీమీద గౌరవం తగ్గింది అని అంటుంది తులసి. మీరు మీ విలువ పోగొట్టుకుంటున్నారు అంటుంది తులసి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.