intinti gruhalakshmi 28 march 2022 full episode
Intinti Gruhalakshmi 28 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 591 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి అన్ని మాటలు అనడంతో ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో తులసి వచ్చి ఆంటి ఎందుకు అలా నిన్ను అంటుంది అని బాధపడుతుంది శృతి. కట్టుబట్టలతో కొడుకును బయటికి పంపిస్తే ఎలా బతుకుతారు అంటుంది. దీంతో అమ్మ నా మంచి కోసమే కదా చెప్పింది అంటాడు ప్రేమ్. కానీ.. శృతి వినదు. మాటలు అనగానే సరిపోదు ప్రేమ్. నోరు జారి అన్నమాటలు.. మనసుకు చేసిన గాయం.. జీవితాంతం గుర్తుంటాయి అంటాడు ప్రేమ్.
intinti gruhalakshmi 28 march 2022 full episode
ఓర్పుతో భరించాలి శృతి. ఓర్పుతో ఉన్నవాళ్లు ఎప్పుడు ఓడిపోరు అంటాడు ప్రేమ్. ధీంతో నాకు అదంతా తెలియదు.. ఈ రోజు నుంచి నువ్వు ఆటో నడపకు అంటుంది. ఇంటి బాధ్యతలు నేను తీసుకుంటాను అంటుంది శృతి. దీంతో నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు అంటాడు. దీంతో ఎందుకు అంటుంది. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి. నిన్ను మాటలు అన్నవాళ్లు నిన్ను చూసి సిగ్గు పడాలి. నీ గురించి అందరూ గర్వంగా చెప్పుకోవాలి. దాని కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు మాత్రం మ్యూజిక్ మీదనే దృష్టి పెట్టు. ఇంకో మాట లేదు అంతే అంటుంది శృతి.
దీంతో సరే అంటాడు ప్రేమ్. కట్ చేస్తే తులసి దగ్గరికి నందు వెళ్లి నాకు ఒక హెల్ప్ చేయాలి అంటాడు. నేను మీకు ఏం హెల్ప్ చేయగలను అంటుంది. అమ్మ వాళ్లు నాతో రావడానికి ఒప్పుకోవడం లేదు అంటాడు. వాళ్లు మొండితనం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు నందు.
దీంతో ఈ ప్రశ్న నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి అంటుంది తులసి. వాళ్లు నాతో వచ్చేలా ఒప్పించు అంటాడు నందు. అత్తయ్య, మామయ్య నిర్ణయాన్ని మీరు గౌరవించండి అంటుంది తులసి. అంటే మా అమ్మనాన్నను నేను వదిలేసి వెళ్లాలా అంటాడు నందు.
అమ్మ వాళ్లు లేకుండా మేము గడప దాటలేము. మాతో వచ్చేలా నువ్వు అమ్మానాన్నలను ఒప్పిస్తున్నావు అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు నందు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. మరోవైపు ప్రేమ్ ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన శృతి.. ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. నీ గురించే అంటాడు ప్రేమ్. ఇంకొకసారి ఆలోచించుకో. సంపాదించడం కోసం నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు ప్రేమ్. దీంతో అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి అంటుంది శృతి.
అందరితో తెగదెంపులు చేసుకొని ఇద్దరం ఒంటరిగా బతుకుదామా అంటుంది శృతి. నేను ఏ పని చేయకుండా.. నువ్వు మాత్రమే పని చేస్తావంటేనే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు ప్రేమ్. ఇంతలో దివ్య.. ప్రేమ్ కు ఫోన్ చేస్తుంది.
సారీ అన్నయ్య నావల్ల నువ్వు చాలా మాటలు పడ్డావు అంటుంది. మామ్ అక్కడికి వస్తుందని నేను అనుకోలేదు. సిచ్యుయేషన్ అలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది దివ్య. నా గురించి ఆలోచించకు.. నీ చదువు మీద దృష్టి పెట్టు అని చెబుతాడు.
తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అంటుంది. డాడీ, లాస్య ఆంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి రెడీ అయ్యారు. వాళ్లతో పాటే.. నానమ్మ, తాతయ్యను తీసుకెళ్తారట అని చెబుతుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు ప్రేమ్.
ఆ తర్వాత నువ్వు ఏం చెబితే నేను అదే చేస్తా అంటాడు ప్రేమ్. వాడితో రామని చెప్పేశాం కదా.. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటాడు పరందామయ్య. ఇంతలో తులసి.. బ్యాగ్ పట్టుకొని వస్తుంది. ఏంటమ్మా ఈ టైమ్ లో బ్యాగ్ తో ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతాడు పరందామయ్య.
దీంతో ఈ ఇంటి నుంచి వెళ్తున్నాను అని చెబుతుంది తులసి. అమ్మా తులసి నువ్వు వెళ్లడం ఏంటమ్మా అని అడుగుతాడు పరందామయ్య. అంటే నువ్వు మమ్మల్ని నందుతో వెళ్లమంటున్నావా అంటాడు పరందామయ్య. మీకు ఇష్టం లేదు కదా అందుకే నేను వెళ్లిపోదాం అనుకుంటున్నాను అంటుంది తులసి.
వద్దు తులసి.. నువ్వు వెళ్లొద్దు. మేమే వాడితో వెళ్లిపోతాం అంటారు పరందామయ్య, అనసూయ. నందుతో మమ్మల్ని వెళ్లిపోమంటున్నావు కదా.. నువ్వు ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. నందుతో చెప్పు మేము ఉదయం వాళ్లతో వస్తామని అని చెప్పి వెళ్లిపోతారు.
కట్ చేస్తే.. మాకు నందుతో ఇష్టం లేదు. నీకు మాటిచ్చాక ఈ ఇంట్లో ఉండలేం. అందుకే తప్పనిసరై ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం అని లెటర్ రాసి ఇంట్లో నుంచి పరందామయ్య, అనసూయ వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.