Intinti Gruhalakshmi 29 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 828 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు ప్రేమ్ గుర్తొచ్చాడు. వాడి అల్లరిని మిస్ అవుతున్నాను అంటుంది తులసి. ఇంతలో అక్కడికి వచ్చిన ప్రేమ్, శృతి, అంకిత, అభి, దివ్య.. అందరూ అక్కడికి వస్తారు. అందుకే వచ్చాం అంటాడు ప్రేమ్. వాళ్లను చూసి ఉబ్బితబ్బిబ్బవుతోంది తులసి. మొత్తానికి సెలబ్రేషన్స్ ఇక్కడే ప్రారంభం అన్నమాట అంటాడు సామ్రాట్. మొత్తానికి తులసి ఇంట్లో సంబురాలు స్టార్ట్ అవుతాయి. మీరు అందరూ ఇక్కడికి వస్తున్నట్టు మీ నాన్నకు చెప్పారా? అంటే ఆయన నీకు మర్యాద ఇవ్వనప్పుడు.. మేము ఆయనకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు ప్రేమ్. దీంతో తప్పురా అలా అనకూడదు అంటుంది తులసి.
ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు తులసి గారు.. ఈ హ్యాపీ అకేషన్ ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని అంటాడు సామ్రాట్. అవును.. ఏం చేద్దాం అంటాడు అభి. దీంతో ఏం చేయాలో నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను అంటాడు సామ్రాట్. మీరంతా ఎంజాయ్ చేయండి అంటాడు. మరోవైపు నువ్వు ఇక్కడ కూర్చో నందు. మనం పార్టీ చేసుకుందాం. అందరినీ పిలుస్తా అంటుంది లాస్య. ఇంట్లో వాళ్లను పిలవడానికి వెళ్తుంది లాస్య. మళ్లీ కోపంతో తిరిగి వస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు అంటుంది లాస్య. ఇప్పటి దాకా ఇంట్లోనే కదా ఉన్నారు అంటాడు నందు. ఇంటి బాధ్యతను మోస్తున్నాం కదా. కొద్దిగా అయినా విలువ ఇవ్వాలి కదా. వాళ్లకు సంపాదన లేదని అత్తయ్య, మామయ్యను వదిలేశామా.. అంటుంది లాస్య.
ఇందాక గొడవ జరిగింది కదా.. మనసు బాధపడి ఉంటుంది. ఎటైనా బయటికి వెళ్లి ఉంటారు. మనసు కుదుట పడ్డాక ఇంటికి వస్తారులే అంటాడు నందు. దీంతో అత్తయ్య, మామయ్య ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు.. అంటుంది లాస్య. ఒకవేళ అందరూ కలిసి తులసి ఇంటికి కట్టకట్టుకొని వెళ్లారా? అని అనుకుంటుంది. మరోవైపు శృతి, ప్రేమ్ కు సర్ ప్రైజ్ ఇద్దామని అనుకుంటారు. అందుకని.. వాళ్లిద్దరినీ ఒక గదిలో కొంతసేపు ఉంచి.. ఆ తర్వాత కళ్లు మూసి బయటికి తీసుకొస్తారు.
బయటికి తీసుకొచ్చి కళ్లు తెరుస్తారు. వాళ్ల కోసం డెకరేట్ చేయడం చూసి ఆశ్చర్యపోతారు. ఎలా ఉంది డెకరేషన్ అంటాడు సామ్రాట్. దీంతో ఇదంతా ఇప్పుడు అవసరమా అంటాడు ప్రేమ్. ఏదో సరదాగా సంతోషాన్ని పంచుకోవాలని ఇక్కడికి వచ్చాం కానీ.. ఇది ఊహించి కాదు అంటుంది శృతి.
దీంతో ఇది మా సంతోషం అనుకో అమ్మ అంటుంది తులసి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. కేక్ ముందు ఎవరికి తినిపించాలా అని టెన్షన్ పడుతుంటుంది తులసి. ముందు నాకు తినిపించాలి అని ప్రేమ్ అంటే.. లేదు శృతి నాకే తినిపించాలి అంటుంది. ఇద్దరూ మాకంటే మాకు అంటారు.
దీంతో ఇన్నాళ్లు నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకున్నా శృతికే ముందు తినిపిస్తా అంటుంది తులసి. ముందు శృతికే తినిపిస్తుంది తులసి. ఆ తర్వాత ప్రేమ్ కు తినిపిస్తుంది. మరోవైపు లాస్య.. ఇంట్లో వాళ్లు ఎటు వెళ్లారు అని అనుకుంటుండగా.. అక్కడికి పరందామయ్య వచ్చి కూర్చొంటాడు.
తననే చూస్తుంటుంది లాస్య. మామయ్య.. టీ పెట్టమంటారా? ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేరు అని అంటుంది లాస్య. దీంతో అవునా.. ఎవరూ లేరా అని అంటాడు పరందామయ్య. టీ సంగతి చెప్పలేదు మామయ్య అంటే.. ఒక్క నిమిషం అమ్మ అంటాడు.
జేబులో నుంచి ఒక చిట్టీ తీసి ఈరోజుకు కోటా అయిపోయింది అంటాడు పరందామయ్య. దీంతో పర్వాలేదు మామయ్య అంటుంది లాస్య. దీంతో వద్దమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు పరందామయ్య. ఇంతలో పరందామయ్య అక్కడే ఫోన్ ను వదిలేసి వెళ్లడంతో ఈ పెద్దాయన ఫోన్ నుంచి దివ్యకు ఫోన్ చేస్తుంది లాస్య.
హలో వాట్ యంగ్ మాన్.. మాతో రమ్మంటే రాలేదు. ఇక్కడ మేము మామ్ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం. బై బై అంటుంది. దీంతో లాస్యకు అసలు విషయం తెలుస్తుంది. వెంటనే కోపంతో నందు దగ్గరికి వెళ్తుంది. ఈ ఇల్లును వదిలేసి మనం వెళ్లిపోదాం అంటుంది లాస్య.
దీంతో ఏమైంది అని అడుగుతాడు నందు. వాళ్లు ఏ రెస్టారెంట్ కో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లి ఉండొచ్చు అని అంటాడు నందు. దీంతో వెళ్లింది రెస్టారెంట్ కు కాదు. తులసి ఇంటికి. అందరూ కలిసి అక్కడ పండుగ చేసుకుంటున్నారు. ఇది పక్కా న్యూస్ అంటుంది లాస్య.
దీంతో తులసి ఇంటికి బయలు దేరుతారు లాస్య, నందు. ఇంతలో శృతి కాలు జారి కింద పడటంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్తారు. అభికి నందు ఫోన్ చేయడంతో హాస్పిటల్ లో ఉన్న సంగతి చెబుతాడు. దీంతో నందు కోపంతో ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.