intinti gruhalakshmi 3 december 2021 full episode
Intinti Gruhalakshmi 3 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 493 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అద్వైత కృష్ణ.. నందును పిలుస్తాడు. ఏమైంది డాక్టర్ పిలిచారు అంటాడు. రిపోర్ట్ లు వచ్చాయి. తులసికి గర్భాశయ క్యాన్సర్ అంటాడు. దీంతో నందు తట్టుకోలేడు. ఏం చేయాలో అర్థం కాదు. రికవరీ అవుతుంది కదా అంటాడు నందు. చెప్పలేను అంటాడు అద్వైత కృష్ణ. నయం చేయడం చేయకపోవడం అన్నీ నిర్ణయించేది దేవుడు మాత్రమే అంటాడు. నేను కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తాను. నందు.. ఇలా రా కూర్చో.. టెన్షన్ పడకు అంటాడు కృష్ణ. కూర్చో నందు అంటాడు.
intinti gruhalakshmi 3 december 2021 full episode
జీవితం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. మాకు తెలుసు.. ఆ ఆట ఏదో ఒక రోజు ముగిసిపోక తప్పదని. చూడండి నందు. ఈ శరీరం రెంటెడ్ హౌస్ అనుకుంటూ.. దానికి మనం ఓనర్లమని కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చుంటాం. కానీ.. ఏదో ఒక రోజున ఈ రెంటెడ్ హౌస్ ను వదిలి వెళ్లిపోకతప్పదు. ఆ నిజాన్ని ముందే గ్రహిస్తే.. ఈ గోడవలేవీ ఉండవు.. అంటాడు. తులసికి తన రెంటెడ్ హౌస్ వదిలి వెళ్లేందుకు మొదటి హెచ్చరిక జారీ అయింది అంటాడు. దీంతో నందు వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. తులసి విషయంలో నేను ఏ లోటూ లేకుండా నా ప్రయత్నం చేస్తాను. కానీ.. మీరు కూడా మీ ప్రయత్నం చేయాల్సిందే అంటాడు కృష్ణ.
తనకు ఇప్పుడు మీ ప్రేమ, మీ కుటుంబం ప్రేమ కావాలి. ఆవిడకు బతుకు మీద ఆశ కల్పించాలి. తనకు బతకాలన్నా కోరిక పెరగాలి. అది మీరే చేయాలి అంటాడు అద్వైత కృష్ణ. తులసికి క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది అని నందు అనబోతుండగానే ప్రేమ్ ఆ విషయం వింటాడు. దీంతో షాక్ అవుతాడు. వెక్కి వెక్కి ఏడుస్తాడు.
వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకెళ్తాడు. దీంతో ప్రేమ్ అంటూ నందు కూడా తనవైపు పరిగెత్తుతాడు. ఆగరా అంటాడు. ప్రేమ్ ను పట్టుకొని ఏడుస్తాడు నందు. అయినా ప్రేమ్ వినడు. వెక్కి వెక్కి ఏడుస్తాడు. కట్ చేస్తే తులసి హెల్త్ కండిషన్ ఏంటో అని అందరూ తెగ టెన్షన్ పడుతుంటారు.
ప్రేమ్ ను కూర్చోబెట్టి మాట్లాడుతాడు నందు. మీ అమ్మకు దేవుడు తీరని అన్యాయం చేశాడు ప్రేమ్ అంటే.. దేవుడి కంటే ముందు మీరు అన్యాయం చేశారు. ఆ దేవుడు మాత్రం చేయడా అంటాడు ప్రేమ్. అమ్మంటే అందరికీ చిన్నచూపే. ఇప్పుడు అమ్మకే అన్ని సమస్యలు అంటాడు ప్రేమ్.
మీరు ఏనాడైనా అమ్మ సంతోషం గురించి ఆలోచించారా? మీరే కాదు.. ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. మనం ఎప్పుడూ అమ్మ గురించి పట్టించుకోకపోయినా.. అమ్మ మాత్రం మన గురించి ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటుంది అంటాడు ప్రేమ్.
మరోవైపు ఇంట్లో అందరూ వైకుంఠపాళి ఆడుతూ ఉంటారు. తులసికి మాత్రం ఏదో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆంటి.. మీరు కూడా వచ్చి మాతో ఆడొచ్చు కదా అంటుంది శృతి. దీంతో లేదమ్మా మీరు ఆడండి.. నాకు ఆడాలని లేదు అంటుంది తులసి. మెడికల్ రిపోర్ట్స్ తెస్తా అని వెళ్లిన ప్రేమ్ ఇప్పటి వరకు రాలేదు.. అంటుంది తులసి.
ఇంతలో ప్రేమ్ వస్తాడు. అమ్మ రిపోర్ట్స్ ఇప్పుడు నాదగ్గర ఉన్నాయి అంటాడు. ఎవ్వరికీ ఇవ్వకుండా వాళ్లను ఆటపట్టిస్తుంటాడు. ముందు ఆ రిపోర్ట్స్ లో ఏముందో చెప్పు అంటుంది తులసి. అభి అడిగినా కూడా ఆ రిపోర్ట్స్ ఇవ్వడు ప్రేమ్. తులసికి ఇస్తాడు. కానీ.. తనకు ఏం అర్థం కావు.
ఇంతలో తనకు కడుపులో నొప్పి పుడుతుంది. దీంతో వెంటనే తనను ఆసుపత్రిలో చేర్పిస్తారు. మరోవైపు లాస్య వచ్చి.. నువ్వు తులసితో కలిసి ఉండటానికి నీకు మరో కారణం దొరికింది. తులసి అనారోగ్యం సాకు చెప్పి తనతో ఊరేగుదామనుకుంటున్నావా? అంటూ లాస్య.. నందుపై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.