Intinti Gruhalakshmi 3 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 546 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ తల్లి అయినా బిడ్డ ఎదుగుదలే కోరుకుంటుంది అని అంకిత తులసిని వెనకేసుకురావడంతో ఒక్క తులసి తప్ప అని అంటుంది లాస్య. తన పిల్లలను గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది తులసి అంటుంది. అబ్బ.. నాకు మధ్యలో వచ్చి మంచి పని చేసింది లాస్య. తన ఫోటోకు పాలాభిషేకం చేయాలి అని అనుకుంటాడు అభి. వెంటనే అంకితను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి. లాస్య.. ఇక చాలు వెళ్దాం పదా.. లంచ్ బాక్స్ తయారు చేశావా అంటే.. చేయించాను.. రాములమ్మ బాక్స్ అంటుంది లాస్య. రాములమ్మ బాక్స్ తీసుకొస్తుంది. ఆ బాక్స్ పెట్టింది రాములమ్మే కానీ.. అందులో ఉన్న వంటలు వండింది మాత్రం తులసినే అంటుంది అనసూయ.
మనకు అవసరం లేదు రా నందు.. మనం లంచ్ బయట తిందాం అనగానే ఎన్నాళ్లిలా అంటాడు నందు. నువ్వు నాకు వండి పెట్టేంతవరకు నేను తులసి వండిందే తింటా అని చెప్పి ఆ బాక్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. తన బాక్స్ తీసుకొని కిందపడేయబోతుంది. కానీ.. లాస్య అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని కిందపడేస్తే నీకు తిండి కూడా ఉండదు అని అంటుంది తులసి. దీంతో బాక్స్ ను అక్కడే పెట్టి వెళ్లిపోతుంది లాస్య. కట్ చేస్తే అభి, అంకిత బైక్ మీద వెళ్తుంటారు. ఇంతలో అభికి ఫోన్ వస్తుంది. సరే.. వెంటనే వస్తున్నా అని చెప్పి అంకితను ఆటోలో వెళ్లమంటాడు. అదేంటి.. నీ హాస్పిటల్ కు వెళ్లే రూట్ లోనే కదా నా హాస్పిటల్ అంటుంది అంకిత.
నాకు వేరే పని ఉంది.. అని చెబుతాడు. మళ్లీ ఈరోజు హాస్పిటల్ కు వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని నిలదీస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను ఏం చేస్తున్నానో ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. అలాగే నేను ఎవ్వరినీ మోసం చేయడం లేదు.. అని చెప్పి అభి వెళ్లిపోతాడు.
మరోవైపు తులసి ఫ్యాక్టరీకి వెళ్లబోతుండగా అమ్మ తులసి అని పిలుస్తాడు పరందామయ్య. మనకు మంచిరోజులు కావాలమ్మా. మనకు దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడమ్మా. నీ ముఖంలో ఏదో కలవరం కనబడుతుంది. అభి భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా అని అడుగుతాడు.
అలాంటిదేం లేదు మామయ్య అంటుంది. వాడు నీ చేతుల్లో లేడు తులసి. వాడు ఎప్పుడు మన చేతులు జారిపోతాడేమోనని భయంగా ఉంది. వాడి కాళ్లు భూమ్మీద ఉన్నా.. ఆలోచనలు ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి.. అని చెబుతాడు.
దీంతో ఈతరం కుర్రాళ్లు అలాగే ఉన్నారు మామయ్య. ఏం చేస్తాం అంటుంది తులసి. వాడు స్వార్థపరుడు అయ్యాడు అని ముందే తులసిని అలర్ట్ చేస్తాడు పరందామయ్య. నీ పెద్ద మనసుకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప నేనేం చేయలేను అని అనుకొని పరందామయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు శృతికి జ్వరం తగ్గదు. అదేంటి ఇంకా జ్వరం తగ్గలేదా అని అడుగుతాడు ప్రేమ్. ట్యాబ్లెట్ వేసుకోలేదు ఎందుకు అంటాడు. దీంతో జ్వరం తగ్గడానికి నాకు కావాల్సింది ట్యాబ్లెట్లు కాదు.. డబ్బు. నాకు డబ్బు పిచ్చి పట్టింది కదా. వెళ్లి డబ్బు తీసుకొనిరా.. అంటుంది.
నాకు డబ్బు పిచ్చి పట్టింది. నాకు డబ్బు కావాలి. డబ్బు చూస్తే కానీ నాకు జ్వరం తగ్గదు అంటుంది. హాస్పిటల్ కు వెళ్దాం పదా అంటే అస్సలు రాదు. నాకు ఏడవడం తప్ప ఏమీ చేతకాదు.. అదే కదా చెప్పేది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది శృతి.
అంకుల్ నన్ను అనాథ అన్నప్పుడు నేను అనాథను కాదు.. నాకు ప్రేమ్ ఉన్నాడని అరిచిచెప్పాలనిపించింది. కానీ… ఇప్పుడు నేను మళ్లీ అనాథనే అనిపిస్తోంది. నా ప్రేమ్ కూడా అందరి లాంటి మగాడే అని తెలిశాక.. నిజంగానే నేను ఇప్పుడు ఒంటరిదాన్నే అనిపిస్తోంది అంటుంది శృతి.
దీంతో శృతికి ప్రేమ్ సారీ చెబుతాడు. దీంతో శృతి కూల్ అవుతుంది. తను నవ్వేలా చెక్కిలిగింత చేస్తాడు ప్రేమ్. దీంతో శృతి నవ్వేస్తుంది. పదా.. హాస్పిటల్ కు వెళ్దాం అంటాడు. తనను హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. మరోవైపు అభి.. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు.
మళ్లీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. 30 వేల లాభం వస్తుంది. దీంతో సూపర్ అంటాడు అభి. ఇప్పటికైతే లాభం వచ్చింది కానీ.. సాయంత్రం లోపు ఉన్న షేర్స్ అన్నీ అమ్మేయాలి అంటాడు. లేకపోతే.. ఉన్నదంతా పోతుంది అంటాడు అభి ఫ్రెండ్.
కట్ చేస్తే అంకిత హాస్పిటల్ నుంచి అప్పుడే వస్తుంది. ఏమైంది.. జాబ్ ఎలా ఉంది అని అడుగుతుంది లాస్య. జూనియర్ డాక్టర్ కదా.. అక్కడ నర్సు చేసే పనులు కూడా చేయాల్సి వస్తోంది.. అంటుంది. తర్వాత ఇంట్లోకి ఇద్దరూ వస్తారు. రాగానే.. అనసూయ.. తాత గారికి చపాతీలు చేయవా అని అడుగుతుంది. దీంతో సరే అంటుంది అంకిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.