Intinti Gruhalakshmi 3 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మీ 3 సెప్టెంబర్ 2021, శుక్రవారం ప్రసారం కాబోయే సీరియల్ తాజాగా విడుదలైంది. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ 415 హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
ఈరోజు ప్రేమ్ శృతిని తీసుకొని గుడికి వెళ్తున్నాడు. ఆ గుడి దగ్గరే ప్రేమ్.. తన మనసులో ఉన్న మాటను శృతికి చెప్పబోతున్నాడు.. అంటూ సంతోషంతో తన పనిమనిషితో చెబుతుంది తులసి. దీంతో పనిమనిషి కూడా ఇంకేంటి.. ప్రేమ్.. తన మనసులో మాట చెప్పగానే.. శృతి అమ్మగారు కూడా ఓకే అంటారు. దీంతో ఇద్దరి పెళ్లి జరగడమే అని అంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల.. శృతి నోటి వెంట ఆ మాట వస్తే.. ఇంక అంతకన్నా ఆనందం నాకు ఇంకేం ఉండదు.. అంటుంది తులసి.
మీరేం కంగారు పడకండి అమ్మ. మీరు అనుకున్నట్టే జరుగుతుంది.. అని పనిమనిషి అనగానే.. ఇంతలోనే శృతి .. సూపర్ గా రెడీ అయి కిందికి వస్తుంది. శృతిని అలాగే తులసి, పనిమనిషి చూస్తూ ఉండిపోతారు. ఏంటాంటి అలా చేస్తున్నారు.. అని శృతి అనగానే.. అబ్బ.. శృతి నిన్ను చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో అంటుంది రాములమ్మ. నువ్వు ఊరుకో రాములమ్మ.. అని అంటుంది శృతి.
రాములమ్మ చెప్పింది నిజమే శృతి. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుంది. థ్యాంక్యూ ఆంటి. మీరు ఫ్యాక్టరీకి వెళ్లలేదా? అని తులసిని అడుగుతుంది శృతి. మీరు వెళ్లండి ఆంటి.. టిఫిన్ సంగతి నేను చూసుకుంటాను అని శృతి అంటే.. నువ్వు ముందు గుడికి వెళ్లు అమ్మా. ఈరోజు నీ జీవితంలో ముఖ్యమైన రోజు కదా.. ఈ పనులేవీ పట్టించుకోకుండా గుడికి వెళ్లిరా? అని తులసి అంటుంది. ముఖ్యమైన రోజా… అదేం లేదు ఆంటి.. అని శృతి అంటుంది.
ముఖ్యమైన రోజు అంటే.. చాలా రోజుల నుంచి నీ మనసు ఏం బాగా లేదు కదా. అందుకే.. నువ్వు చేపట్టిన పనులు అన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాలని ఆ దేవుడిని కోరుకో.. అని శృతికి చెబుతుంది తులసి. దీంతో అలాగే ఆంటి.. అని చెబుతుంది శృతి.
ఇంతకీ ప్రేమ్ ఇంకా రెడీ కాలేదా? అని అడగగానే.. ప్రేమ్ ఎఫ్పుడో రెడీ అయ్యాడు. కానీ.. అమ్మమ్మ గారికి మెడిసిన్ కావాలంటే.. బయటికి వెళ్లాడు.. అని చెబుతుంది శృతి. తులసమ్మ గారు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొడుకు ప్రేమించిన అమ్మాయిని సొంత బిడ్డలా చూసుకుంటున్నారు.. అని రాములమ్మ అనగానే.. తులసి చాలా మంచి అమ్మాయి. తనను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రేమ్ కి కూడా తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి.. ఇద్దరూ ఒక్కటైతే నాకు అంతకుమించిన ఆనందమే లేదు.. అని తులసి అంటుంది.
కట్ చేస్తే.. అక్షర తండ్రి.. జీకే.. ప్రేమ్ ఫ్యామిలీ గురించి ఆరా తీస్తుంటాడు. మురళి ప్రేమ్ ఫ్యామిలీ విషయం కనుక్కొమ్మాన్నాను.. కనుక్కున్నావా? అని అడుగుతాడు. దీంతో ప్రేమ్ ఫ్యామిలీ అప్పర్ మిడిల్ క్లాస్ సర్.. అని చెబుతాడు మురళి. రీసెంట్ గానే ప్రేమ్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దానికి కారణం లాస్య అనే లేడీ. భార్యతో విడాకులు తీసుకున్నా.. లాస్యతో పెళ్లి కాకపోయినా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ప్రేమ్ తండ్రి, లాస్య కలిసి ఓ కంపెనీ పెట్టారు. మొదట్లో బాగానే నడిచింది కానీ.. ఇప్పుడు కంపెనీ దివాళా తీసే పరిస్థితికి దిగజారిపోయింది. వాళ్ల ఆస్తులన్నీ అమ్మినా కూడా అప్పులు తీర్చే పరిస్థితిలో లేరు.. అని మురళి చెప్పగానే.. వెరీగుడ్.. ఇంట్రెస్టింగ్ అంటాడు జీకే.
అదేంటి సార్.. ఇన్ని నెగెటివ్ పాయింట్స్ పెట్టుకొని ఇంట్రెస్టింగ్ అంటున్నారు.. అని అంటాడు మురళి. దీంతో జీకే.. చూడు మురళి.. మనం ఎవరినైతే ఓడించాలని అనుకుంటామో.. వాడిలో ఉన్న వీక్ పాయింట్స్ కనుక్కుంటాము. అవతలి వాడికి ఎన్ని వీక్ పాయింట్స్ ఉంటే.. మనం గెలుపుకు అంత దగ్గరలో ఉన్నట్టు లెక్క.. అని అంటాడు జీకే.
చూడు మురళి. వాళ్ల కంపెనీ దివాళా తీసే పరిస్థితిలో ఉందని నువ్వే అంటున్నావు. మోయలేని అప్పు భారం కూడా నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఆ పరిస్థితుల్లో ఉన్నవాడికి సహాయం చేసిన వాడే భగవంతుడు అవుతాడు. వాళ్లకు మనం సాయం చేద్దాం. అప్పుడు వాళ్లు మనం ఏది అడిగినా కాదనలేరు కదా.. అంటాడు జీకే.
దీంతో.. నాకో డౌట్ సార్.. అంటాడు మురళి. ఆ ప్రేమ్ ఆల్ రెడీ వేరే వాళ్లతో ప్రేమలో పడి ఉంటాడు సర్.. అంటాడు. దీంతో మనం వెళ్లే దారిలో ముళ్లకంప ఉందనుకో ఏం చేస్తాం.. తీసి పక్కన పడేస్తాం. అంతే కదా. ప్రేమ్ లైఫ్ లో ఎవ్వరూ లేకపోతే అంతా హ్యాపీ కదా. ఒకవేళ ఉన్నారు అంటే.. వాళ్లు మాత్రం ఆ స్థానం నుంచి ఖచ్చితంగా తొలగిపోవాలి. ఎందుకంటే.. ఇకపై ప్రేమ్ కు ప్రేయసి అయినా భార్య అయినా.. అది కేవలం నా కూతురు అక్షర మాత్రమే అయి ఉండాలి అని అంటాడు జీకే.
మాకు జీతాలు ఎగ్గొట్టి.. మీరు మాత్రం వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తారు.. కార్లు కొనుక్కుంటారా? అంటూ తన కంపెనీ ఉద్యోగులు నందును నిలదీయడంతో ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఇంతలోనే అక్కడికి లాస్య వచ్చి.. ఏంటి నందు ఇంకా ఇలాగే ఉన్నావేంటి.. అని అడుగుతుంది. దీంతో ఏం చేయాలి.. అని అంటాడు నందు. ఆఫీసుకు వెళ్లాలి కదా.. అంటుంది లాస్య. ఎందుకు లాస్య. వెళ్లి ఏం చేయాలి.. అక్కడ ఉన్న కంప్యూటర్లను చూసుకోవడానికా అంటాడు నందు.
అలావేంటి నందు.. మనం ఈ ప్రాజెక్టును ఎలాగోలా ఫినిష్ చేయాలి కదా అంటుంది లాస్య. ఇంకెక్కడి ప్రాజెక్టు.. ఉద్యోగులు అందరూ మానేసి వెళ్లిపోయారు. ఇప్పుడు నువ్వూ నేను కలిసి కూర్చొని చేయాలా? అని అడుగుతాడు నందు. అలాగని వదిలేద్దామా? వదిలేస్తా.. ఉన్న అప్పులను ఎలా తీరుస్తాం. క్లయింట్ విధించిన పెనాల్టీ ఎలా కడతాం.. మనం రోడ్డు మీద పడతాం.. పదా.. అనగానే.. మనం ఇప్పటికే రోడ్డు మీద పడ్డాం అని నందు అనగానే.. ఇంతలోనే ఆయనకు ఓ ఫోన్ వస్తుంది.
జీకే గ్రూప్ కంపెనీస్ ఎండీ జీకే పీఏ మురళి తనకు కాల్ చేస్తాడు. మా జీకే గారు ఒకసారి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు.. అని మురళి చెప్తాడు. జీకే గారు నన్ను కలవాలని అనుకోవడం ఏంటి? ఎందుకు? అని అడుగుతాడు నందు. జీకే గారు మిమ్మల్ని కలవాలని అనుకోవడం మాత్రమే నాకు తెలుసు. అంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు.. అంటాడు మురళి.
కనీసం ఆయన ఎందుకు కలుస్తున్నారో తెలిస్తే.. నేను ప్రిపేర్ అవుతాను కదా.. అంటే.. ఏదో బిజినెస్ విషయం అని చెప్పారు.. అంటాడు. మీరు ఫ్రీగా ఉన్నారంటే చెప్పండి.. అపాయింట్ మెంట్ ఏర్పాటు చేస్తాను.. అంటాడు మురళి. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. జీకే గారే మీ ఆఫీసుకు వస్తున్నారు.. ఉదయం 11 గంటలకు.. అని చెప్తాడు మురళి.
వెంటనే లాస్యకు ఈ విషయం చెబుతాడు నందు. జీకే మన ఆఫీసుకు వస్తున్నాడట అంటాడు. అంత పెద్ద వ్యక్తి ఎందుకు వస్తున్నారో ఏమో.. ముందైతే ఆఫీసుకు వెళ్దాం పదా.. అంటుంది లాస్య.
కట్ చేస్తే.. ఏంటి ఆంటీ.. ఈరోజు కొత్తగా చేస్తున్నారు. నాకు దువ్వుతున్నారు. నన్ను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు ఎందుకు. నేను వెళ్లేది గుడికే కదా.. పెళ్లికో.. పేరంటానికో కాదు కదా.. అంటుంది శృతి. మీరు చాలా సంతోషంగా కూడా కనిపిస్తున్నారు. కనీసం దానికైనా కారణం కనుక్కోవచ్చా.. అని అంటుంది శృతి. ప్రత్యేకంగా కారణం అంటూ ఏం లేదమ్మా.. నా మనసు చాలా తేలిగ్గా ఉంది.. అంటుంది. లేదు మీరు అబద్ధం చెబుతున్నారు.. అంటుంది శృతి. అదేం లేదమ్మా.. నేను ఎప్పటిలాగానే ఉన్నాను.. అంటే.. సరే లేండి ఆంటి.. మీరు కనీసం సంతోషంగా అయినా ఉన్నారు. కారణాలు తెలియకపోయినా పర్వాలేదు.. అని అంటుంది శృతి.
శృతి అందంగా తయారు అవడం చూసిన లాస్య.. నందు ముందు నువ్వు వెళ్లు… కారు తీయ్.. నేను వచ్చేస్తాను.. అంటుంది. ఏంటి.. శృతి మీద తులసికి హటాత్తుగా ఇంత ప్రేమ పొంగిపోతోంది. ఏదో సొంత కోడలుకు చేసినట్టు చేస్తుంది.. అని ఆశ్చర్యపోతుంది లాస్య. అంకిత.. అని పిలుస్తుంది లాస్య. ఆ తులసి, శృతిల కథ ఏంటి.. అని అడుగుతుంది. ఏం చెప్పి ఏం లాభం. ప్రేమ్ విషయమే.. శృతికి తన ప్రేమ విషయం ఎప్పుడు చెప్పాలా? అని తెగ ఎదురు చూస్తున్నాడు ప్రేమ్. ఈరోజు గుడికి ప్రేమ్.. శృతిని తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తాడట. అక్కడ ప్రపోజ్ చేశాక.. తను ఒప్పుకుంటే.. ఇక వాళ్లను ఎవ్వరూ ఆపలేరు. తను ఈ ఇంటి కోడలు అవుతుంది. నాకు తోటికోడలు అవుతుంది. అందరిలాగా సమాన గౌరవం పొందుతుంది.. అని చెబుతుంది అంకిత. అది నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది అంకిత.
నేను ఏ మనిషిని అయితే అసహ్యించుకుంటానో.. ఆ మనిషితోనే నేను రోజూ జీవించాల్సి ఉంటుంది. అయితే.. నేను ఉన్నాను కదా.. నేను చూసుకుంటా.. అని చెబుతుంది లాస్య. నేను ఓ ప్లాన్ వేస్తా.. దాన్ని నువ్వు అమలు చేసుకుంటూ వెళ్లిపో అని చెబుతుంది. ముందు ఈ ఫైల్ తీసుకెళ్లి నా రూమ్ లో పెట్టు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తా.. అంటుంది లాస్య.
కట్ చేస్తే.. లాస్య, నందు.. ఇద్దరూ కలిసి ఆఫీసుకు కారులో బయలుదేరుతారు. తులసి సంతోషాన్ని చెడగొట్టడానికి, శృతిని అణగదొక్కడానికి.. ప్లాన్స్ జరుగుతున్నాయి. అంకితతో కలిసి గూడుపుటాణి జరుపుతున్నా.. అని కారులో తనకు తానే అనుకుంటుంది లాస్య. సరిగ్గా శృతి గుడికి వెళ్లే సమయానికి.. నేను అంకితకు ఫోన్ చేసి ఫైల్ కావాలి.. అర్జెంట్ గా పంపించండి.. అని చెబుతాను. దీంతో శృతి ఆ ఫైల్ తీసుకొని ఆఫీసుకు వస్తుంది. శృతి గుడికి వెళ్లదు. ప్రేమ్ ప్రపోజ్ చేయలేడు. అప్పుడు తులసి ముఖంలో ఆ బాధను నేను చూడాలి.. అని కారులో తనకు తానే అనుకుంటుంది లాస్య.
కట్ చేస్తే.. నందు, లాస్య.. ఇద్దరూ ఆఫీసుకు వస్తారు. అంత పెద్ద వ్యాపారవేత్తకు మనతో ఏం పని అని నందు తెగ టెన్షన్ పడుతుంటాడు. అసలు.. ఆయన ఎందుకు ఈ బిజినెస్ డీల్ ను మనతో చేయాలని అనుకుంటున్నాడు.. అని అనుకుంటాడు నందు.
కట్ చేస్తే.. శృతి గుడికి వెళ్లకుండా.. ఇంకా ఇంట్లోనే ఉంటుంది. ఏమైంది శృతి.. గుడికి వెళ్లకుండా ఇంకా ఇంట్లోనే ఉన్నావు.. అని అడుగుతుంది తులసి. ప్రేమ్ లేడు కదా.. అందుకే వెళ్లలేదు అంటుంది శృతి. ప్రేమ్ హఠాత్తుగా అంకుల్ వాళ్ల ఆఫీసుకు వెళ్లాడు. ప్రేమ్ ఆ ఫైల్ ను తీసుకెళ్లాడు. నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు.. అని అడుగుతుంది తులసి. మీరు గుడికి వెళ్దామని అనుకున్నారు కదా.. అని అంటుంది తులసి. అది చిన్నవిషయమే కదా.. ఆంటి. గుడికి ఈరోజు కాకపోతే.. రేపు అయినా వెళ్లొచ్చు ఆంటి.. అని చెబుతుంది. వచ్చే వారం గుడికి ప్లాన్ చేసుకుంటాం.. అని అంటుంది శృతి.
అయితే.. ప్రేమ్ కు ఫోన్ చేయకుండా.. అంకితకు చేసి చెప్పడం ఏంటి? అసలు.. ఏం జరుగుతోంది అని అనుకుంటుంది తులసి. శృతిని తోటికోడలుగా నేను ఎలా అంగీకరిస్తాను.. అస్సలు అంగీకరించను.. అని అంకిత అనుకుంటుంది.
కట్ చేస్తే.. జీకే గారు ఆఫీసుకు వస్తారు. వెల్ కమ్ జీకే గారు.. అని అంటాడు నందు. వచ్చి ఆఫీసును చూస్తాడు జీకే. ఆఫీసు ఖాళీగా కనిపించేసరికి.. మీరు కంపెనీని క్లోజ్ చేసే స్థాయిలో ఉన్నారా? అని అడుగుతాడు జీకే. నా కంపెనీ నా ఇష్టం అండి.. అంటాడు నందు. కూల్ నందు గారు.. కూల్.. నేను వచ్చింది మీకో బిజినెస్ ప్రపోజల్ ఇద్దామని.. అని అంటాడు జీకే.
తులసి నువ్వు ఆలోచించేది కరెక్టే. నందు నీ రెండో కొడుక్కి.. ఓ పెళ్లి సంబంధం చూశాడు… అని చెబుతుంది లాస్య. మీరు తెచ్చే కోటీశ్వరుల సంబంధం మాకు అవసరం లేదు. ప్రేమ్ దీనికి లొంగడు.. వాడికి నచ్చిన అమ్మాయినే చేసుకుంటాడు అని చెబుతుంది తులసి. మరోవైపు అక్షర పెళ్లి ప్రేమ్ తో జరగాలని నందుతో చెబుతాడు జీకే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.