Intinti Gruhalakshmi 30 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 516 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి అర్జెంట్ గా బ్లడ్ అవసరం కావడంతో నందు బ్లడ్ ఇస్తాడు. దీంతో ఆ రక్తాన్ని తులసికి ఎక్కిస్తాడు డాక్టర్ అద్వైత కృష్ణ. అమ్మకు ఇంకా స్పృహ రాలేదు ఎందుకు అని అడుగుతాడు ప్రేమ్. టెన్షన్ పడకు ప్రేమ్. త్వరలోనే తనకు స్పృహ వస్తుంది అని చెబుతాడు డాక్టర్. ఇంతలో నందు వస్తాడు. మీరెందుకు వచ్చారు అంటాడు. రిసార్ట్ లో ఉండలేకపోయాను.. అంటాడు. అమ్మకు స్పృహ వచ్చిందా అని అడుగుతాడు నందు. మీరే వెళ్లి చూడండి అంటాడు ప్రేమ్. దీంతో నందు ఐసీయూలోకి వెళ్తాడు. తులసి నిన్ను చాలా బాధపెట్టాను. విడాకులు తీసుకున్నా కూడా నువ్వు ఏనాడూ సంతోషంగా లేవు. నేను మారిపోయాను తులసి. అయినా నువ్వు నమ్మడం లేదు. విడాకులు తీసుకొని నేను ఏనాడూ సంతోషంగా లేను.. అంటాడు నందు.
తులసికి స్పృహ లేకున్నా తను చెప్పాలనుకున్నది చెప్తాడు. వీళైతే నన్ను క్షమించు.. అని చెప్పి నందు బయటికి వచ్చేస్తాడు. ఇంతలో డాక్టర్ అద్వైత కృష్ణ వస్తాడు. డాక్టర్ అమ్మ స్పృహ లోకి వచ్చిందా అని అడుగుతాడు ప్రేమ్. మీరు రియాల్టీని అర్థం చేసుకోవాలి. పేషెంట్ జబ్బు నుంచి 100 శాతం రికవరీ అవ్వాలంటే డాక్టర్ ట్రీట్ మెంట్ తో పాటు.. మెంటల్ గా తను చాలా ఫిట్ గా ఉండాలి అంటాడు డాక్టర్. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. తను రికవరీ అయ్యాక.. పాత గొడవలకు పాత విషయాలకు దూరంగా ఉంచండి అని అంటాడు డాక్టర్. ఇంతలో పరందామయ్య.. ప్రేమ్ కు కాల్ చేస్తాడు. ఒరేయ్ తులసికి ఎలా ఉందిరా అంటాడు. నేను అర్జెంట్ గా తులసితో మాట్లాడాలి అంటాడు ప్రేమ్. ఇప్పుడు కుదరదు అంటాడు ప్రేమ్. మేమంతా చూడటానికి రావాలా అంటాడు. ఇప్పుడు వద్దు విజిటింగ్ అవర్స్ అయిపోయాయి అంటాడు ప్రేమ్.
మరోవైపు లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. నందు లేడని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో భాగ్య వస్తుంది. ఏంటి లాస్య.. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు కూడా బావ గారు లేరా అని అడుగుతుంది. కొన్నింటిని చూసీ చూడనట్టు వదిలేయాలి భాగ్య.. కొన్ని రోజులు ఆగు.. అందరినీ నా చుట్టు ఎలా తిప్పుకుంటానో అంటుంది లాస్య.
ఇవన్నీ విని సూపర్ గా ఉన్నాయి నీ ప్లాన్స్ అని అంటుంది శృతి. నువ్వు ఎవ్వరినీ ఏం చేయలేవు. పిచ్చి పిచ్చి మాటలు మానుకో అంటుంది శృతి. ఏంటి శృతి నువ్వు చేసేది.. నీ అత్తగారినే బెదిరిస్తున్నావా అంటుంది.. భాగ్య. ఏం తన అత్తగారిని లాస్య బెదిరించడం లేదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు నందు.. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ్ అక్కడికి రాగానే.. ప్రేమ్ తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు నందు. నా బాధ నీకు నాటకంలా అనిపించవచ్చు కానీ.. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్ లో ఉంది తులసి కోసం కాదు. నా బిడ్డ కోసం. వాడు దిగులుతో ఉన్నాడని.. వాడి బాధను పంచుకుందామని అంటాడు నందు.
దీంతో ప్రేమ్ లేచి తన తండ్రి దగ్గరికి వస్తాడు. తన భుజం మీద చేయి వేస్తాడు. తప్పొప్పులు ఎంచుకుంటూ ఫోతే.. ఏ బంధం అయినా కొన్నాళ్లకు బలహీనం అవుతుంది. చేతులు కాలాక ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాను అని చెప్పి ప్రేమ్ ముందు బోరుమంటాడు నందు.
అమాయకంగా నటిస్తూనే తులసి ఆంటి కాపురానికి లాస్య ఎసరు పెట్టిందని లాస్య గురించి అంకితకు శృతి చెబుతుంది. ఇప్పటికైనా ఎలాంటి గొడవలు చేయకుండా ఉండొచ్చు కదా. కానీ.. మన ఫ్యామిలీని ముక్కలు చేయాలని ప్లాన్ చేస్తోందని అంకితతో చెబుతుంది.
మన ఫ్యామిలీ ముక్కలు కాకుండా ఉండాలంటే.. ముందు మనమంతా స్ట్రాంగ్ గా ఉండాలి. మన మధ్య అస్సలు అపార్థాలు రాకూడదు అంటుంది శృతి. దీంతో సరే అంటుంది అంకిత. మరోవైపు తులసికి స్పృహ వస్తుంది. దీంతో ప్రేమ్ సంతోషిస్తాడు.
తర్వాత తనను డిశ్చార్జ్ చేస్తారు. అందరూ ఇంటికి వెళ్లిపోతారు. తర్వాత తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. దీపక్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని ఓ క్యాబ్ డ్రైవర్ వస్తాడు. దీంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే మేము కూడా ఉండం.. అంటారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.