Intinti Gruhalakshmi 30 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 829 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరూ డ్యాన్స్ చూస్తుండగా బెలూన్ మీద కాలు పెట్టి కింద జారి పడిపోతుంది శృతి. దీంతో తన కడుపు బలంగా గుద్దుకుంటుంది. దీంతో తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇంతలో నందు, లాస్య ఇద్దరూ తులసి ఇంటికి వస్తారు. తీరా చూస్తే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. డైరెక్ట్ గా తులసికే కాల్ చేసి అడుగుతాను అంటాడు నందు. వెంటనే తులసికి కాల్ చేస్తాడు. దీంతో ఫోన్ లిఫ్ట్ చేయదు తులసి. మళ్లీ చేస్తాడు నందు. కట్ చేస్తే తులసిని ఆసుపత్రికి తీసుకెళ్తారు అందరూ. తనకు నొప్పి ఉందని తట్టుకోలేకపోతున్నానని అంటుంది శృతి. ఏం కాదు. కంగారు పడకు అంటారు. ఇంతలో డాక్టర్ వస్తుంది. ఏంటి ప్రాబ్లమ్ అంటే తను ప్రెగ్నెంట్. కడుపు నొప్పిని భరించలేకపోతోంది. కింద పడింది అని చెబుతుంది తులసి.
దీంతో మేము టెస్టులు చేసి చెబుతాం అంటుంది డాక్టర్. తనను లోపలికి తీసుకెళ్తారు. తులసి గారు కంట్రోల్ చేసుకోండి అంటాడు సామ్రాట్. మీరే ఇంతలా బాధపడుతుంటే పిల్లలు ఇంకా టెన్షన్ పడతారు అంటాడు సామ్రాట్. ప్రాబ్లమ్ ఏం లేకుండా డాక్టర్స్ చూసుకుంటారని చెప్పారు కదా అంటాడు సామ్రాట్. దీంతో ఎందుకు ఇలా జరుగుతోంది. శుభవార్త తెలిసిన రోజే ఇలా అనర్థం జరగడం ఏంటి అని అంటుంది తులసి. ఎందుకిలా దేవుడు ఏడిపిస్తున్నాడు అని అంటుంది. ధైర్యంగా ఉండమ్మా అంటాడు ప్రేమ్. ఎందుకురా శృతిని నా ఇంటికి తీసుకొచ్చావు. నేను దురదృష్ట జాతకురాలిని అంటుంది తులసి. ఇలా జరుగుతుందని ఎవరు ఊహిస్తారమ్మా అంటాడు ప్రేమ్. నువ్వు దోషివి కాదు. అలా ఆలోచించకు అంటాడు ప్రేమ్.
వెంటనే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కు అరేంజ్ చేయండి అని డాక్టర్ చెబుతుంది. ఎంతకీ తులసి ఫోన్ లిఫ్ట్ చేయదు. వేరే వాళ్లకు చేసినా కూడా ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే కదా. వాళ్లు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటే.. వాళ్లు ఎక్కడున్నారో మనమే తెలుసుకొని వెళ్దాం అంటుంది లాస్య.
ఒక పని చేయ్ నందు.. అభికి ఫోన్ చేయ్ మళ్లీ అంటుంది లాస్య. దీంతో నందు.. అభికి ఫోన్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్లి అభి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో డాడ్ అంటే.. అరేయ్ అభి ఎక్కడున్నారు అని అడుగుతాడు. డాడ్.. నేను మళ్లీ మాట్లాడుతాను అంటే కుదరదు. నేను ఇప్పుడు తులసి ఇంట్లోనే ఉన్నాను అంటాడు.
దీంతో మీరు ఇంటికి వెళ్లండి. మేము ఈవెనింగ్ కల్లా వస్తాం అంటాడు అభి. దీంతో అస్సలు వినడు నందు. అసలు ఏం జరిగిందో మొత్తం చెబుతాడు అభి. దీంతో నందు షాక్ అవుతాడు. ప్రస్తుతం మేము హాస్పిటల్ లో ఉన్నాం అంటాడు అభి. దీంతో లాస్యను తీసుకొని ఆసుపత్రికి బయలుదేరుతాడు నందు.
అభి టెన్షన్ ను గమనించిన తులసి.. ఏమైంది అని అడుగుతుంది. దీంతో అలాంటిదేం లేదు మామ్ అంటాడు అభి. దీంతో మరెందుకు ఇబ్బంది పడుతున్నావు. ఇంతకుముందు నీకు కాల్ చేసింది ఎవరు అని అడుగుతుంది తులసి. నాకు కాల్ చేసింది డాడ్ అంటాడు.
దీంతో మాట్లాడావా? అంటే మాట్లాడా అని చెబుతాడు. ఎక్కడున్నారు అంటే హాస్పిటల్ లో ఉన్నాం అని చెప్పా అంటాడు. తప్పు చేశావు అభి. అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండాల్సింది అంటాడు సామ్రాట్. దీంతో నేను మళ్లీ వస్తా.. ఇప్పుడు ఆయనతో గొడవ పడే ఓపిక లేదు అంటుంది తులసి.
ఇంతలో నందు, లాస్య అక్కడికి వస్తారు. నందు కోపంతో తులసి దగ్గరికి వచ్చి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటాడు నందు. నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అనుకుంటున్నావా? నీ మాజీ మొగుడు ఒక చేతకాని వాడు.. వాడి కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచుకోలేక చేతులు జోడంచి సాయం అడిగాడు. వాడు నాకు కట్టుబానిస అని అనుకుంటున్నావా?
నువ్వు ఎలా ఆడించినా ఆడుతాడు. వాడు ఇప్పుడు ఒక వానపాము లాంటి వాడు అని అనుకుంటున్నావా? నిజమే.. నీ విషయంలో నేను రెండు మెట్లు కిందికి దిగిన మాట నిజమే. నువ్వు కూడా నాలా పాజిటివ్ గా ఆలోచిస్తావనుకున్నా? కానీ.. ఇలా వెన్నుపోటు పొడుస్తావనుకోలేదు అంటాడు నందు.
నువ్వు ఇప్పుడు చేసింది.. చేస్తోంది ఏంటి. వెన్నుపోటు కాదా అంటాడు నందు. నా కోడలు నా ఇంటికి వారసుడిని ఇవ్వబోతుంటే నువ్వెందుకు మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావు. నా ఇంట్లో జరగాల్సిన వేడుకను ఎందుకు చేయకుండా చేశావు. ఇదంతా నువ్వే చేశావు. నువ్వే ఈ అనర్థానికి కారణం. నిన్ను వదిలిపెట్టను అంటూ ముందుకు వెళ్లబోతుండగా మధ్యలోకి సామ్రాట్ వస్తాడు.
పక్కకు తప్పుకో అంటే తప్పుకోను అంటాడు సామ్రాట్. గీత దాటుతున్నావు అంటాడు సామ్రాట్. నువ్వెవడ్రా నా గురించి మాట్లాడటానికి అంటాడు. ఇంట్లో అందరి ముందు అరిచి చాలెంజ్ చేసి వెళ్లింది కదా.. నిలదీసే హక్కు నందుకు ఉంది అంటుంది లాస్య. నీ హీరోఇజం ఇక్కడ చూపించకు. మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు చూయించుకో అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.