Intinti Gruhalakshmi 30 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 751 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి జనరల్ మేనేజర్ గా కుర్చీలో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంటుంది. తన పీఏ ఝాన్సీని పిలిచి ఈ ఫైల్స్ లో ఏముందో ఒక సారి చూసి చెబితే నేను సంతకం పెడతా అని అంటుంది తులసి. దీంతో సరే అని ఇద్దరూ ఫైల్స్ చదువుతారు. మరోవైపు తులసి జనరల్ మేనేజర్ సీటులో కూర్చోవడం చూసి లాస్యకు అస్సలు నచ్చదు. ఎలాగైనా లాస్య ఏదో ఒక ప్లాన్ వేయాలని అనుకుంటుంది. నందుకు చెబితే తప్పో ఒప్పో ఎలాగూ సామ్రాట్ గారు తనను జీఎంగా చేశారు. మనకు నచ్చినా నచ్చకపోయినా భరించాలి తప్పదు అంటాడు నందు. దీంతో నిన్ను మార్చడం నావల్ల కాదు. నా పని నేను చేసుకుపోతా అని అనుకుంటుంది లాస్య. ఇంతలో అక్కడికి తులసి వచ్చి ఏం చేస్తున్నారు. బడ్జెట్ ఫైల్ రెడీ చేయమన్నాను కదా.. చేశారా అంటుంది. దీంతో లేదు.. వేరే పనిలో బిజీగా ఉన్నా అంటుంది లాస్య.
దీంతో నీకు చేతగాదంటే చెప్పు నేను సామ్రాట్ గారికి చెప్పి వేరే వాళ్లతో బడ్జెట్ ఫైల్ చేయిస్తా అంటుంది. నాకు మధ్యాహ్నం వరకు ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి అంటుంది తులసి. మరోవైపు అనసూయ చిరాకు పడుతూ ఉంటుంది. ఎవ్వరూ నా గురించి పట్టించుకోవడం లేదు. నా మాటలు వినడం లేదు అనుకుంటుంది అనసూయ. ఇంతలో అభి వస్తాడు. ఒకప్పటి అనసూయను గుర్తు తెచ్చుకో అంటాడు అభి. మళ్లీ అప్పటిలా మారు. మామ్ విషయంలో ఏం చేస్తే బెటరో నువ్వే ఇంప్లిమెంట్ చేయి.. అంటాడు అభి. సామ్రాట్ గారి ఆఫీసులో మామ్ ఉద్యోగం మానేయడమే ఈ సమస్యకు పరిష్కారం. అందుకు ఏం చేయాలో నువ్వే ఆలోచించు నానమ్మ అని చెప్పి వెళ్లిపోతాడు అభి.
మరోవైపు తులసి.. సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది. దీంతో రెడీ అవుతున్నా వస్తా అంటాడు సామ్రాట్. ఈరోజు మీటింగ్ ఉంది అంటుంది తులసి. దీంతో వస్తా కానీ.. కాస్త లేట్ అవుతుంది మేనేజ్ చేయండి అంటాడు సామ్రాట్. దీంతో సామ్రాట్ కు సెటైర్లు ఇస్తుంది తులసి.
తులసితో మాట్లాడిన తర్వాత చాలా హుషారు అవుతాడు సామ్రాట్. నీ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు బాబాయి. ఏం లేదు బాబాయి అంటాడు. నీకు ఇంతకు ముందు కాల్ చేసింది ఎవరు అని అడుగుతాడు బాబాయి. దీంతో తులసి అంటాడు. అది చాలులే అంటాడు బాబాయి.
ఇంతలో హనీని స్కూల్ కు తీసుకెళ్లమని బాబాయికి చెబుతాడు సామ్రాట్. వాళ్లు వెళ్లగానే అనసూయ సామ్రాట్ ఇంటికి వస్తుంది. ఏమైంది అని అడుగుతాడు. దీంతో తులసి ఇక మీ ఆఫీసులో పని చేయకూడదు అంటుంది అనసూయ. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు.
మీరు తులసిని దూరం చేసుకోవాలి అంటుంది. దీంతో ఈ విషయం తులసి గారికి తెలుసా అని అడుగుతాడు సామ్రాట్. తులసికి తెలిస్తే నేను ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఉండదు. మా పరువు రోడ్డున పడకూడదు అంటే తులసి మీ ఆఫీసులో పనిచేయకూడదు అంటుంది అనసూయ.
నన్ను ఇలా వెన్నుపోటు పొడిస్తే ఎలా అంటాడు సామ్రాట్. తులసి తెగింపు వల్ల తను పోగొట్టుకున్నదేదో తెలుసుకున్నాక.. నా తప్పు ఏంటో తెలుసుకున్నాను అంటుంది అనసూయ. తులసి గారు చేసిన దాంట్లో పరువు తక్కువ పని ఏముంది అంటాడు సామ్రాట్.
దీంతో మీరు గొప్పోళ్లు. కానీ.. మావి మధ్య తరగతి బతుకులు. నలుగురిలో బతకాల్సిందే. మా బతుకులు మావి అంటే ఒప్పుకోరు. మీలా మొండికేయలేం బాబు. అందుకే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం అంటుంది అనసూయ.
మరోవైపు సామ్రాట్ రెఫర్ చేయడంతో ప్రేమ్ మ్యూజిక్ ఆడిషన్ కు వెళ్తాడు. అక్కడ ప్రేమ్ సెలెక్ట్ అవుతాడు. మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని అంటాడు. దీంతో సరే అని వెళ్లబోతుండగా మ్యూజిక్ ఆడిషన్ కు వచ్చిన ఓ వ్యక్తి అడ్డుపడతాడు. దీంతో ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు.
మరోవైపు తులసి ఓ ఫైల్ మీద పెట్టిన సైన్ గురించి ఆఫీసులో డిస్కషన్ నడుస్తుంది. నీవల్ల ఆఫీసుకు 10 కోట్ల నష్టం రాకుండా ఆపాను తెలుసా అంటాడు నందు. ఇంతలో సామ్రాట్ వచ్చి థాంక్స్ నందగోపాల్ అంటాడు. అసలు మీ దగ్గరికి ఆ ఫైల్ ఎలా వచ్చింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని తులసిని బ్లేమ్ చేస్తాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.