Intinti Gruhalakshmi 31 Jan Tomorrow Episode : లాస్య, తులసి మధ్య మరోసారి గొడవ.. నందు విషయంలో ఇక నుంచి గొడవలు రాకూడదని.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న తులసి

Intinti Gruhalakshmi 31 Jan Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం, 31 జనవరి 2022 న ప్రసారం అవుతుంది. జనవరి 31, 543 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు తాగి వచ్చి పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు. మీ సరదా పిల్లలను నాశనం చేస్తుంది. నా భయాన్ని అర్థం చేసుకోండి. ఇంకోసారి ఇలా పిల్లల ముందు చేయకండి అని నందుకు తులసి వార్నింగ్ ఇస్తుంది. దీంతో నేను చేసింది తప్పే. ఒప్పుకుంటున్నాను అంటాడు నందు. నిన్న నేను ఉన్న ఆనందలో అలా చేశా. ఇంకెప్పుడు అలా జరగదు. నాది బాధ్యత. సారీ అంటాడు నందు. నందు సారీ చెప్పడం లాస్యకు అస్సలు నచ్చదు. తులసి అక్కడి నుంచి వెళ్లిపోగానే.. ఏమైంది నీకు. లొంగిపోతున్నావు. పైగా సారీ కూడా చెబుతున్నావు. దాని వల్ల నీ పరువు మాత్రమే కాదు. నా పరువు కూడా పోతుంది.. అంటుంది.

intinti gruhalakshmi 31 january 2022 episode highlights

లాస్య.. తులసి మన పరువు తీయడానికి కాదు.. మనల్ని కాపాడటానికి అలా చేస్తోంది. థింక్ పాజిటివ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. మరోవైపు అంకితను ఇక నుంచి వంటింటి పనులు చేయొద్దని చెబుతుంది తులసి. నువ్వు ఇక నుంచి ఇంట్లో పనులు పక్కన పెట్టి నీ చదువు, ఉద్యోగం గురించి ఆలోచించు అంటుంది తులసి. మా అమ్మ అన్న మాటల గురించి ఇలా చేస్తున్నారా అంటుంది అంకిత. కాదమ్మా.. నీ భవిష్యత్తు కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను నిన్ను డాక్టర్ గా చూడాలి సరేనా. వెళ్లు ఇక అదే పనిలో ఉండు అంటుంది తులసి. దీంతో తులసిని గట్టిగా హత్తుకుంటుంది అంకిత.

మరోవైపు ప్రేమ్.. శృతితో మాట్లాడడు. రాత్రి గొడవ జరిగినప్పటి నుంచి మాట్లాడడు. కాఫీ కూడా తాగడు. అవన్నీ మరిచిపో ప్రేమ్ అంటుంది శృతి. నువ్వు నన్నే చేతగానివాడివి అన్నావు అంటాడు. లేదు ప్రేమ్. నువ్వు అపార్థం చేసుకున్నావు అంటుంది శృతి.

నేను డబ్బులు సంపాదించాలి.. నీ పరువు నిలబెట్టాలి అంతే కదా. ఇక దాని గురించి వాదనలు వద్దు శృతి. నీ కోసం డబ్బు సంపాదిస్తా. నీ భర్తగా లూజర్ అనిపించుకోకుండా ఉండటం కోసం నేను డబ్బులు సంపాదిస్తా అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్.

వీళ్ల మాటలన్నీ అంకిత వింటుంది. మరోవైపు తులసి ఇంట్లో వాళ్లు అందరినీ పిలిచి.. అందరూ తమ జీతాలను ఈ నెల నుంచి ఇంట్లో ఇవ్వాలి అంటుంది. ప్రేమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు కానీ.. అభి మాత్రం ఎందుకు అంటాడు. శాలరీ నా చేతికి ఇస్తే మీ బాధ్యత నాది. లేదంటే మీ బతుకు మీది అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 31 Jan Tomorrow Episode : నేను ఏమన్నా బానిసనా అని తులసితో అన్న అభి

దీంతో నేను ఈ ఇంటి మనిషినా.. బానిసనా అని ఆవేశంగా మాట్లాడుతాడు అభి. నిన్ను మేము బలవంతం చేయడం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం అంటుంది తులసి. దీంతో ఇంతలో అక్కడికి వచ్చిన లాస్య.. ఇంత ఘోరంగా ఉంటుందా. పిల్లలకు స్వేచ్ఛగా బతికే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తుంది.

నువ్వు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావా? నువ్వ స్వేచ్ఛగా కాదు.. బరితెగించి బతుకుతున్నావు.. అని లాస్యను వేసుకుంటుంది అనసూయ. మీ భార్య వయసుకు వచ్చిన పిల్లలను స్వేచ్ఛగా బతకనీయరా అని అంటుంది. మీరేమో పిల్లలను అలా గాలికి వదిలేస్తారా అని అంటారు. మీ భార్యకు మీరు అర్థం అయ్యేలా చెబుతారా లేక నేను చెప్పనా అంటుంది తులసి.

ఈ సమయంలో అమ్మ మాట కాదని రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో.. సెటిల్ అయ్యేంతవరకు అమ్మ మాట వినాల్సిందే అని అనుకొని.. సరే అమ్మ.. శాలరీ రాగానే ఇచ్చేస్తాను అని చెప్పి అభి బయటికి వెళ్లిపోతాడు. కానీ.. తనలో ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటుంది.

ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. దాని కోసం డబ్బులు అడగడానికి మాధవి ఇంటికి వెళ్తాడు. నా జాబ్ ను నమ్ముకుంటే ఇంట్లో అమ్మకు ఏమాత్రం హెల్ప్ చేయలేను. అందుకే.. బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఒక లక్ష రూపాయలు తక్కువయ్యాయి అని అడుగుతాడు అభి.

ఈ మాత్రం దానికే ఇంత మొహమాటం పడాలా. నీకు హెల్ప్ చేయడం అంటే ఇన్ డైరెక్ట్ గా వదినకు హెల్ప్ చేయడమే అంటుంది మాధవి. ఉండు.. డబ్బు తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్తుంది మాధవి. దీంతో అభి ఖుషీ అవుతాడు. మరో వైపు తులసి దగ్గరికి నందు వెళ్లి నీ పిల్లలు చాలా అదృష్టవంతులు అంటాడు.

ఇంతలో లాస్య వచ్చి అవకాశం దొరికితే చాలు. ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటారా అంటుంది లాస్య. నీతో మాట్లాడుతున్నప్పుడే ఆ పెదాల మీద చిరునవ్వు.. కళ్లల్లో ఆ మెరుపు కనిపిస్తుంది అంటుంది లాస్య. నందుకు ఏం మంత్రం వేశావో నాకు చెప్పొచ్చు కదా అని నిలదీస్తుంది లాస్య. ఏం నందు ఇంకా తనివి తీరలేదా.. మన రూమ్ కు వెళ్దామా అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago