Intinti Gruhalakshmi 31 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 543 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి.. మాధవి దగ్గరికి వెళ్లి బిజినెస్ కోసం ఒక లక్ష రూపాయలు కావాలని అడగ్గానే వెంటనే మాధవి డబ్బు ఇచ్చేస్తుంది. నీ దగ్గర డబ్బు తీసుకున్నట్టు దయచేసి మామ్ కు చెప్పకు అత్తయ్య అంటాడు అభి. అలా ఎందుకురా అమ్మ సంతోషపడుతుంది కదా అంటుంది మాధవి. దీంతో లేదు అడ్డుపడుతుంది అత్తయ్య.. అంటాడు అభి. మామ్ కు సెంటిమెంట్స్ ఎక్కువ. డాడ్ బిజినెస్ లో ఫెయిల్ అయ్యారని.. ఆయన వారసుడిగా నాకు కూడా బిజినెస్ అచ్చిరాదని తను అనుకుంటుంది అంటాడు అభి. సరే నీ ఇష్టంరా అంటుంది మాధవి. డబ్బులు తీసుకొని అభి వెళ్లిపోతాడు.
మీ వదినకు చెప్పకపోతే నువ్వే ఇబ్బందుల్లో పడతావు అంటాడు తన భర్త. వాడు ఏ బిజినెస్ చేస్తున్నాడో అడిగావా. పోనీ వాడైనా చెప్పాడా అని అడుగుతాడు. నేను అడగలేదు అంటుంది. ఒకపని చేయి.. తులసి దగ్గరికి వెళ్లి సీక్రెట్ గా ఈ విషయం చెప్పేయ్ అంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు. వాడు చెప్పొద్దన్నాడని ఆలోచిస్తున్నావా.. లేక వాడు ఫీల్ అవుతాడని ఆలోచిస్తున్నావా అంటాడు. డబ్బులు పోతే పోయాయి కానీ.. ఒకవేళ వాడు ఆ డబ్బులతో జీవితాన్ని పాడు చేసుకుంటే అప్పుడు నువ్వే బాధపడాల్సి వస్తుంది అంటాడు. దీంతో మాధవి ఆలోచనల్లో పడుతుంది.
కట్ చేస్తే పరందామయ్యకు రాములమ్మ టీ తెచ్చి ఇస్తుంది. మీరు టీ తాగడం తగ్గించాల్సి ఉంటుంది. రోజు రెండు మూడు టీలు తాగితే గ్యాస్ ఎలా తగ్గుతుంది అని అంటుంది. ఇంతలో కిరాణ సామాన్లు తీసుకొని పనివాళ్లు వస్తారు. వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్తారు డెలివరీ బాయ్స్.
ఏం సామాన్లు తెచ్చావు.. నేను తెచ్చేదాన్ని కదా అంటుంది తులసి. దీంతో ఏం నేను తేవద్దా అంటుంది. సరే.. ఏం సామాన్లు తెచ్చావు అని రాములమ్మ చెక్ చేస్తూ ఉంటుంది. అవసరం ఉన్న సామాన్లు తక్కువ.. అవసరం లేనివి ఎక్కువ తెప్పిస్తుంది. దీంతో అందరూ కాసేపు నవ్వుకుంటారు.
ఇంతలో మాధవి వస్తుంది. లాస్యతో గొడవ పెట్టుకుంటుంది. మాధవి.. వద్దు ఊరుకో అంటుంది తులసి. లాస్య.. గొడవలు వద్దు.. సరుకులు ఎక్కడి నుంచి తెప్పించావో చెబితే అనవసరం అయిన వాటిని తీసుకెళ్లి అవసరం అయిన వాటిని తెప్పిద్దాం అంటుంది తులసి. దీంతో అవసరం లేని దానివి ఈ ఇంట్లో నువ్వే ఉన్నావు అంటూ పిచ్చి కూతలు కూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.
ఆ లాస్య అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడటం లేదు ఏంటి అంటుంది మాధవి. దీంతో తప్పదు మాధవి. అవన్నీ పక్కన పెట్టు.. చాలా రోజుల తర్వాత ఈ వదిన గుర్తొచ్చింది ఏంటి సంగతి అంటుంది తులసి. నీకు ఒక విషయం చెబుతాను కోప్పడొద్దు అంటుంది మాధవి.
నీకు చెప్పకుండా అభికి లక్ష రూపాయలు ఇచ్చాను అంటుంది. అవును వదిన. బిజినెస్ సంపాదించి డబ్బులు సంపాదించి నీకు తోడుగా నిలబడాలి అన్నాడు. దీంతో ఇచ్చాను అంటుంది. ఇచ్చేముందు నాకు ఒక్కమాట చెప్పాల్సింది మాధవి అంటుంది తులసి.
వాడు ఇదివరకు అభి కాదు. మారిపోయాడు. వాడిని కాపాడుకోకపోతే వాడి జీవితం నాశనం అవుతుంది. వాడిని ఏమాత్రం బెదిరించినా వాడు దూరం అయిపోతాడు. నా గుండెలో ఈ బాధను ఇప్పటి వరకు నీకు తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేదు.. అంటుంది.
జరిగిందేదో జరిగిపోయింది. నాకు చెప్పిన విషయం వాడికి తెలియనీయకు. నేను ఎలాగోలా చూసుకుంటాను అంటుంది తులసి. నాకు కూడా తెలియకుండా డబ్బు తీసుకొని వీడు ఏం చేస్తున్నట్టు అనుకుంటుంది తులసి. మరోవైపు అభి డబ్బు తీసుకొని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు.
వెంటనే డబ్బు షేర్ మార్కెట్ లో పెట్టమని తన ఫ్రెండ్ కు చెబుతాడు. తను షేర్ మార్కెట్ లో పెడతాడు. మొదటి రోజు కొంచెం లాభం వస్తుంది. రోజూ నాతో ఫోన్ లో టచ్ లో ఉండు. నేను చూసుకుంటాను అని చెబుతాడు తన ఫ్రెండ్. మరోవైపు ఇంటికి వచ్చిన అంకిత.. నాకు జాబ్ వచ్చింది అంటుంది.
అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. ఇంతలో అంకిత తల్లి వస్తుంది. అమ్మా అంకిత అంటుంది. సమయానికి వచ్చారు వదిన. మీ అమ్మాయికి జాబ్ వచ్చింది అని చెబుతుంది తులసి. తెలుసు.. ఆ ఆసుపత్రిలో రెకమండ్ చేసిందే నేను అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
నువ్వు చెప్పావని జాబ్ లో చేరాలనుకోలేదు అమ్మ. తులసి ఆంటి చెప్పింది కాబట్టి జాబ్ లో చేరాను. ఇంకో విషయం ఏంటంటే.. నువ్వు చెప్పిన కార్పొరేట్ ఆసుపత్రికి నేను ఇంటర్వ్యూకు వెళ్లలేదు అంటుంది అంకిత. ఒక చిన్న ఆసుపత్రిలో చేరాను అంటుంది అంకిత.
దీంతో అంకిత మీద సీరియస్ అవుతుంది తన తల్లి. నీకేమైనా పిచ్చా. చిన్న ఆసుపత్రిలో చేరడం ఏంటి.. అంటుంది. ఇంతలో తులసి వచ్చి వదిన మీరు అంకితకు కన్నతల్లి అయి ఉండొచ్చు. కానీ.. నేను గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటున్న తల్లిని అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.