
intinti gruhalakshmi 4 april 2022 full episode
Intinti Gruhalakshmi 4 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 597 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భర్త లేకపోతే బతకడం ఎంత కష్టమో తులసికి అర్థం అవుతుంది. ఈ తండ్రి సపోర్ట్ లేకుండా పిల్లల జీవితాలను ఎలా నిలబెడుతుందో నేను చూస్తాను అంటాడు నందు. అంతెందుకు నందు.. శశికల అప్పు తీర్చలేక తులసి రోడ్డున పడాల్సిందే అంటుంది లాస్య. మరోవైపు జీకే.. తులసికి ఫోన్ చేస్తాడు. ఎలా ఉన్నావమ్మా అంటాడు. నందు మారాడా అని అడుగుతాడు. దీంతో ఇల్లు మారాడు అంటుంది. లాస్యను తీసుకొని వేరే ఇంటికి వెళ్లిపోయాడు అంటుంది తులసి. ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది.. అది సహజం కానీ.. ఈయనలో స్వార్థం మాత్రమే ఉంది అంటుంది తులసి.
intinti gruhalakshmi 4 april 2022 full episode
దీంతో విడాకులు తీసుకొని మంచి పని చేశావమ్మా అంటాడు జీకే. నీకో శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను. అక్షర పెళ్లి అయింది. రేపు రిసెప్షన్ ఏర్పాటు చేశాం. మీరంతా తప్పకుండా రావాలి అంటాడు. దీంతో రేపు కుదరదు అంటుంది. అయితే మీకు కుదిరినప్పుడే రిసెప్షన్ పెట్టుకుంటాం అంటాడు జీకే. దీంతో సరే వస్తాం అంటుంది తులసి. మరోవైపు శృతికి అక్షర ఫోన్ చేస్తుంది. రేపు రాత్రి రిసెప్షన్ ఉంది అంటుంది. నీ పెళ్లి ఎప్పుడు అయింది అని అడుగుతుంది శృతి. పెళ్లి ఎవరికీ చెప్పకుండా చేసుకున్నాను. ప్రేమ్ ను ఖచ్చితంగా తీసుకొనిరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అక్షర.
మ్యారేజ్ రిసెప్షన్ అంటే అక్కడికి అందరూ వస్తారు. ప్రేమ్ ఖచ్చితంగా రాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది శృతి. మరోవైపు మ్యారేజ్ రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. తులసి, పరందామయ్య, అనసూయ, దివ్య వస్తారు. ఇంతలో గందం గజాలా వస్తాడు. కాసేపు వాళ్లను నవ్విస్తాడు.
మరోవైపు లాస్య, నందు కూడా రిసెప్షన్ కు రెడీ అవుతారు. లాస్య వెళ్దామా అంటాడు నందు. జీకే గారి ఇంటటి ఫంక్షన్ కు వెళ్లడం నాకు ఇష్టం లేదు అని నేను ఇప్పటికే చెప్పాను కదా అంటుంది లాస్య. తులసి కూడా అక్కడికి వస్తుంది. నాకు ఆమె మొహం చూడటం ఇష్టం లేదు అంటుంది లాస్య.
నాకు కూడా వెళ్లడం ఇష్టం లేదు కానీ.. రేపు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆయనతో మనకు ఏదైనా అవసరం ఉంటుంది అంటాడు నందు. మరోవైపు తులసిని చూసి వెళ్లి హత్తుకుంటుంది అక్షర. బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది అంటుంది తులసి.
దీంతో ఏ బిడ్డకు తల్లి దిష్టి తగలదు ఆంటి ఆంటుంది అక్షర. ఇంతలో శృతి ఫంక్షన్ కు వస్తుంది. శృతిని చూసి తులసి షాక్ అవుతుంది. శృతి ఎందుకు వచ్చింది అని అనుకుంటుంది తులసి. అమ్మ అక్షర నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
ప్రేమ్ ఏడి అని అడుగుతుంది అక్షర. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు అక్షరను అమ్మలా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనమ్మా అని జీకే.. తులసితో అంటాడు. దీంతో తప్పకుండా అంటుంది తులసి. మరోవైపు దేవత సీరియస్ హీరో, జానకి కలగనలేదు సీరియల్ హీరో ఇద్దరూ ఫంక్షన్ కు వస్తారు.
వాళ్లను చూసి అమ్మాయిలు అంతా గుమికూడుతారు. దీంతో గందం గజాలా వాళ్లను పంపించేస్తాడు. నేను పిలిచింది మిమ్మల్నే. మీరు నాతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి. నాకు రెస్పెక్ట్ కావాలి అంటాడు గందం గజాలా. నాతో టచ్ లో ఉంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా అంటాడు.
మరోవైపు ఆంటి అని శృతి.. తులసిని పిలుస్తుంది. నా మొహం కూడా చూడాలనిపించడం లేదా. అంత పాపం నేనేం చేశాను అని అడుగుతుంది శృతి. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే ప్రేమ్ ఫంక్షన్ కు రాలేదు అంటుంది శృతి. ఇవన్నీ నాకెందుకు చెప్పావు.. ఇలాంటి తలనొప్పులు ఉంటాయనే నేను ఈ ఫంక్షన్ కు రాకూడదనుకున్నాను అంటుంది తులసి.
ఏ మొహాలను అయితే చూడకూడదు అనుకున్నానో వాళ్లను చూడక తప్పడం లేదు అంటుంది తులసి. మరోవైపు నందు, లాస్య కూడా ఈ ఫంక్షన్ కు వస్తారు. వాళ్లను చూసి తులసి షాక్ అవుతుంది. వాళ్లు వచ్చేలోపు ఇక్కడి నుంచి తప్పుకోవాలి అనుకుంటుంది తులసి.
ఇంతలో లాస్య, నందు ఎదురుపడతారు. ఇంతలో గందం గజాలా మధ్యలో దూరుతాడు. పాప.. ఈయన ఎవరు అంటే.. ఈయన మా డాడీ అంటుంది దివ్య. పక్కనుంది మీ మమ్మీనా అంటే కాదు డమ్మీ అంటుంది. అవునా.. మరి మీ మమ్మీ ఎవరు అంటే.. నా పక్కనుంది అంటుంది దివ్య.
ఆయన నా పిల్లలకు తండ్రి కానీ.. నాకు మొగుడు కాదు అంటుంది తులసి. మరి.. ఈయనకు భార్య ఎవరు అంటే.. ఆయన పక్కన నిలబడ్డ ఆవిడే ఆయన భార్య అంటుంది తులసి. ఓహో.. మీరిద్దరూ పాపకు అమ్మానాన్నే కానీ.. మొగుడు పెళ్లాలు కారు అంటాడు గందం గజాలా.
నాకు ఒకటి అర్థం అయింది. ఈ మోడ్రన్ అమ్మాయి.. ఈయన ఆఫీసులో పీఏ అయి ఉంటుంది. మోడ్రన్ అమ్మాయి మోజులో పడి లక్ష్మీదేవి లాంటి భార్యను వదిలేశాడన్నమాట అని అంటాడు గందం గజాలా. నాకు నువ్వు ఓకే.. మింగిల్ అవుదామా అని లాస్యతో అంటాడు గందం.
దీంతో కోపం వచ్చి అక్కడి నుంచి నందును తీసుకెళ్తుంది లాస్య. ఆ తులసి ముందే నాకు అవమానం జరిగింది. దివ్య వాళ్లు నవ్వుతుంటే తులసి కనీసం ఆపలేదు. చెప్తా. ఫంక్షన్ అయ్యేలోపు నిన్ను చూసి అందరూ నవ్వుకునేలా చేయకపోతే నా పేరు లాస్యే కాదు అని అనుకుంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.