
intinti gruhalakshmi 4 may 2022 full episode
Intinti Gruhalakshmi 4 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 మే 2022, బుధవారం ఎపిసోడ్ 623 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రవళిక ఉదయమే జాగింగ్ కు వచ్చి.. తులసి కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో తులసి జాగింగ్ డ్రెస్ వేసుకొని దాని మీద కొంగు కప్పుకొని వస్తుంది. తనను చూసి నవ్వుతుంది ప్రవళిక. నీకు జ్వరం కానీ వచ్చిందా అని అడుగుతుంది. దీంతో లేదు అంటుంది. మరి ఈ కొంగు ఎందుకు కప్పుకున్నావు అని అడిగితే… నా జాగింగ్ డ్రెస్ ఎవ్వరికీ కనిపించకుండా కప్పుకున్నాను అంటుంది. దీంతో ప్రవళిక ఇంకాస్త నవ్వుతుంది. నేను వస్తుంటే నా జాగింగ్ డ్రెస్ చూసి అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు అంటుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇంటికి వెళ్లిపోతాను అంటుంది తులసి.
intinti gruhalakshmi 4 may 2022 full episode
ఒక పని చేయి.. ఒక్క నిమిషం ఈ జాగింగ్ డ్రెస్ మీద ఇక్కడ నిలబడు. నిన్ను ఎవ్వరైనా చూస్తే నువ్వు రేపటి నుంచి జాగింగ్ డ్రెస్ వేసుకోకు.. జాగింగ్ కోసం కూడా రాకు అంటుంది. దీంతో తను కప్పుకున్న ఆ సాల్వాను తీసేస్తుంది. ఎవ్వరూ తనను చూడరు. దీంతో ఇద్దరూ జాగింగ్ డ్రెస్ లో జాగింగ్ చేస్తూ ఉంటారు. మరోవైపు నందు, లాస్య ఇద్దరు కూడా అదే పార్క్ కు వచ్చి జాగింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఇక నీ సిగ్గు పోయిందా. రేపటి నుంచి వస్తావా అని అడుగుతుంది. దీంతో వస్తా అని చెబుతుంది తులసి. తులసి, ప్రవళిక ఇద్దరూ మాట్లాడుతుండటం నందు, లాస్య చూస్తారు. చూసి షాక్ అవుతారు.
ప్రవళిక వెళ్లిపోయి.. తులసి ఇటువైపు నుంచి వెళ్లిపోతుండగా తులసిని పిలుస్తాడు నందు. తులసి.. నువ్వేంటి.. నువ్వు చేస్తున్న పనులేంటి అని నిలదీస్తాడు. దీంతో నువ్వెవరో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఈయన ఎవరు మీ ఆయనా. ఇలా రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరి డ్రెస్ పై కామెంట్ చేస్తారా అని అంటుంది తులసి.
టాపిక్ మార్చకు తులసి అంటాడు నందు. ముగ్గురు పిల్లల తల్లివి.. కూతురు పెళ్లి చేయాలి. అన్ని మరిచిపోయి ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరగడం ఏంటి అంటాడు నందు. అసలు మీ బాధ ఏంటో.. ఎందుకు ఇలా గొంతు చించుకొని అరుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది తులసి.
అసలు మీకు నాకు సంబంధం ఏంటి. నేను ఒకప్పుడు మీ భార్యను. ఇప్పుడు కాదు. విడాకులతో ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు మీతో నాకు.. నాతో మీకు ఎలాంటి సంబంధం లేదు. నా మీద మీకు ఎలాంటి అధికారం లేదు. అర్థం అయిందా అంటుంది.
ఎవరైనా మీ ముందు నా గురించి చెడుగా మాట్లాడితే ఉక్రోషపడటం కాదు.. వాడి చెంప చెళ్లు మనిపించు. అది ఎవరో ఏదో డ్రెస్ వేసుకుంటే నీకెందుకురా అను అంటుంది. నా పిల్లలు, మా అమ్మానాన్న నీ దగ్గర ఉన్నంత వరకు మా పరువు నీ మీద ఆధారపడి ఉంటుంది అంటాడు నందు.
నేను ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే మీ ఇంటి పరువు పోతుందా అని అడుగుతుంది. నేను మాజీ కోడలును. కానీ.. నీ పక్కన నిలబడింది కదా తను నిజమైన కోడలు. మీకు ఏమైనా అనాలనిపిస్తే తనను అనండి. బుద్ధి చెప్పాలనుకుంటే తనకు చెప్పండి నాకు కాదు అంటుంది తులసి.
మీ ఆవిడ రోజు వేసుకునే బట్టల కన్నా నేను ఈరోజు వేసుకున్న బట్టలు చాలా సంస్కారంగా ఉన్నాయి.. అంటుంది తులసి. నీ భార్యకు ఒక నీతి.. నాకు ఒక నీతా. ముందు ఆవిడను సంస్కరించుకోండి. నన్ను అడిగే హక్కు మీకు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
వాట్ ఏ చేంజ్ తులసి అని చెప్పి ప్రవళిక కూడా సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ప్రేమ్ నిద్రపోతూ ఉంటాడు. శృతికి జ్వరం తగ్గుతుంది. తను అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడే లేచిన ప్రేమ్.. ఇంత పొద్దున్నే శృతి ఏం చేస్తుంది అని అనుకుంటాడు.
తను వంట చేయడం చూసి షాక్ అవుతాడు. నువ్వు అప్పుడే పనులు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. కాస్త బలం రాగానే వంటింట్లో దూరేయడమేనా అంటాడు ప్రేమ్. కానీ.. తనను చేయనీయడు పని. వద్దు ప్రేమ్.. ఏం కాదు నేను చేస్తాను అంటుంది శృతి.
ఇంతలో శృతికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ను ఎత్తుతాడు ప్రేమ్. పనిలోకి వస్తున్నావా లేదా అని ఆ మహిళ ఫోన్ చేస్తుంది. ఎవరండి మీరు.. ఏం మాట్లాడుతున్నారు అంటాడు. ఇంతలో శృతి ఫోన్ తీసుకొని మేడమ్ నేను వస్తున్నాను అంటుంది శృతి.
ఎవరు మీ మేనేజరా. ఇలా తలబిరుసుగా మాట్లాడుతుందేంటి. నువ్వేమన్నా పనిమనిషివా. రాను అని చెప్పేయ్ అంటాడు ప్రేమ్. ఏం కాదులే.. వాళ్లు అలాగే ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే పార్క్ నుంచి ఇంటికి వస్తుంది తులసి.
తులసి వేసుకున్న డ్రెస్ చూసి దివ్య షాక్ అవుతుంది. పరందామయ్య, అనసూయ కూడా ఆమె డ్రెస్ చూసి షాక్ అవుతారు. నీలో ఇంత మార్పా అంటుంది అనసూయ. నీలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటాడు పరందామయ్య. నా ఈ మార్పుకు కారణం ప్రవళిక అంటుంది తులసి.
ఆ తర్వాత ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ప్రవళికను కలుస్తుంది. దీంతో నీకు తెలిసిన పనే చేయ్ అంటుంది. గొంతు సవరించుకో. పాటలు పాడటం మొదలు పెట్టు అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.