Home » Entertainment » Intinti Gruhalakshmi 4 October 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 4 Oct Today Episode : సామ్రాట్ ను మళ్లీ నిలదీసిన అనసూయ.. దీంతో నందును జీఎంను చేసిన సామ్రాట్.. తులసి షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: October 4, 2022 9:09 am
Advertisement

Intinti Gruhalakshmi 4 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 అక్టోబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 754 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకు నాకు ఆ ఫైల్ ఇచ్చావు. నీకు ఎవరు ఇవ్వమని చెప్పారు అని ఝాన్సీని అడుగుతుంది తులసి. అసలు నిజం చెప్పు. లేకపోతే నేను ఈ విషయం సామ్రాట్ గారికి చెబుతాను అంటుంది తులసి. దీంతో వెళ్లి చెప్పండి మేడమ్. ఎందుకంటే నేనే ఆ ఫైల్ ఇచ్చాను. ఎవ్వరూ నన్ను ఇవ్వమనలేదు.. అంటుంది ఝాన్సీ. దీంతో అక్కడి నుంచి తన క్యాబిన్ లోకి వెళ్తుంది తులసి. ఇంతలో బాబాయి అక్కడికి వస్తాడు. సామ్రాట్ కోపం గురించి నీకు తెలిసిందే కదా అమ్మా అంటాడు. వాడు అన్నమాటలకు నేను క్షమాపణ చెబుతున్నా అంటాడు బాబాయి.

Advertisement

intinti gruhalakshmi 4 october 2022 full episode

దీంతో ఆయన అన్నదాంట్లో తప్పేముంది. తప్పు చేశా కాబట్టి నన్ను అన్నారు అంటుంది తులసి. నీ మాజీ భర్త అంతలా నీ మీద అరవాల్సిన అవసరం లేదు కదా.. అంటాడు బాబాయి. నా బతుకు ఏదో నేను బతుకుతున్నా. అయినా నంద గోపాల్ గారు కంపెనీ నష్టపోకుండా చేశారు కదా అంటుంది తులసి. ఇవన్నీ పక్కన పెట్టి సాయంత్రం పార్టీకి మాత్రం రావాలి అంటాడు బాబాయి. పార్టీ టైమ్ వరకు వాడు నార్మల్ అవుతాడు. నీకు సారీ కూడా చెబుతాడు. ఇది గ్యారెంటీ అని చెప్పి బాబాయి వెళ్లిపోతాడు. మరోవైపు సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

ఇంతలో సామ్రాట్ దగ్గరికి ఝాన్సీ వస్తుంది. తన రాజీనామా లెటర్ ను తీసుకొచ్చి సామ్రాట్ కు ఇస్తుంది. దీంతో దాన్ని చింపేస్తాడు. ఆ ఫైల్ ఇచ్చిందే నేను కదా. నేనే ఆ ఫైల్ ను తులసికి ఇచ్చి తులసితో సైన్ పెట్టించమని చెప్పా కదా. అసలు దోషిని నేను. నువ్వెందుకు అవుతావు. ఇక నుంచి ఆ ఫైల్ మ్యాటర్ మరిచిపో అంటాడు సామ్రాట్. దీంతో సరే సార్ అని చెప్పి వెళ్లిపోతుంది ఝాన్సీ.

మరోవైపు సాయంత్రం అవుతుంది. హనీ బర్త్ డే వేడుకలు ప్రారంభం అవుతాయి. సామ్రాట్ తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో బాబాయి వచ్చి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంటాడు బాబాయి.

Advertisement

Intinti Gruhalakshmi 4 Oct Today Episode : హనీ బర్త్ డేకు వచ్చిన తులసి ఫ్యామిలీ

నేను ఎదురు చూస్తోంది గెస్టుల కోసం అంటాడు సామ్రాట్. దీంతో నాకు తెలుసు.. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో. తులసి నీలా కాదు. తను పార్టీకి వస్తుంది కానీ.. నీకోసం కాదు. హనీ కోసం అంటాడు బాబాయి.

ఇంతలో తులసి ఫ్యామిలీ మొత్తం సామ్రాట్ గారి ఇంటికి పార్టీకి వస్తారు. అనసూయ.. సామ్రాట్ పై కోపంగా ఉంటుంది. మరోవైపు తులసి గిఫ్ట్ గా ఇచ్చి డ్రెస్ ను వేసుకుంటుంది హనీ. కానీ.. సామ్రాట్ వచ్చి ఈ డ్రెస్ వద్దు.. ఇది వేయండి అని అంటాడు సామ్రాట్.

కానీ.. హనీ మాత్రం వద్దు అంటుంది. నాకు ఇదే డ్రెస్ బాగుంది అంటుంది. దీంతో నేను తెచ్చిన డ్రెస్ వేసుకోవా.. మీ ఇష్టం. మీరు ఎలా అనుకుంటే అలాగే కానివ్వండి. హనీ త్వరగా రెడీ అయి రాఅమ్మా.. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అంటాడు సామ్రాట్.

తర్వాత అనసూయ.. సామ్రాట్ తో మాట్లాడుతుంది. తన భయం ఏంటో.. తన ఆరాటం ఏంటో చెబుతుంది. ఒక మగాడిలా కాదు. ఒక ఆడదాని మనసుతో ఆలోచించు. నా భయం అర్థం అవుతుంది అంటుంది అనసూయ.

Advertisement

దీంతో మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. దయచేసి నా నిర్ణయాన్ని నేను చేయనీయండి అంటాడు సామ్రాట్. తులసిని దూరం చేయాలనే ఆలోచనే ఉంటే ఇలా పార్టీకి పిలవవు.. హనీని దగ్గర చేయవు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చేస్తున్నావు అని అంటుంది అనసూయ.

దీంతో మీరు నన్ను అనుమానిస్తున్నారా అంటాడు సామ్రాట్. దీంతో నిన్ను నమ్మాలని లేదు. నిన్ను పట్టించుకోకుండా వదిలేస్తే నిర్ణయం తీసుకోవడానికే జీవితాంతం ఆలోచించేలా ఉన్నావు అంటుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి