Home » Entertainment » Intinti Gruhalakshmi 5 April 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 5 April Today Episode : తులసి పరువు తీయబోయి తన పరువే తీసుకున్న లాస్య.. దీంతో నందు షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: April 5, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 5 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గందం గజాలా చేస్తున్న ఓవర్ చూసి రామా, దేవత సీరియల్ హీరోకు అస్సలు నచ్చదు. వీడి ఎక్స్ ట్రాలు చూడలేకపోతున్నా అని అంటాడు. ఇంతలో దివ్య, వేద వస్తుంది. నిన్ను కూడా ఈవెంట్ కోసం బుక్ చేసుకున్నారా అంటాడు అర్జున్. లేదు పెళ్లి కూతురు నా ఫ్రెండ్ అంటుంది. అవును.. మేము వచ్చే సమయానికి బాగా నవ్వుకుంటున్నారు ఏంటి.. జోక్ ఏంటో చెబితే మేము కూడా నవ్వుకుంటాం కదా అంటుంది వేద. దీంతో జోక్ కాదు.. జోకర్.. అదిగో చూడు.. వాడిని చూసే.. వాడిని ఆడుకోవాలని డిసైడ్ అయ్యాం అంటాడు రామా.

Advertisement

intinti gruhalakshmi 5 april 2022 full episode

మరోవైపు తులసి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని.. లాస్య ప్లాన్ వేస్తుంది. తులసికి వొడ్కా తాగించాలని అనుకుంటుంది. గ్లాస్ లో వొడ్కా పోసి.. దీన్ని నీకు తాగిస్తే ఎలా ఉంటుంది. నిన్ను నలుగురిలో అవమానించాలి. నిన్ను చూసి అందరూ నవ్వేలా చేయాలి. నీ పరువు పోవాలంటే ఇంతకంటే మార్గం లేదు అని అనుకుంటుంది లాస్య. ఈ విషయాన్ని దివ్య వింటుంది. శృతితో ఈ విషయాన్ని చెబుతుంది. ఎలాగైనా తన ప్లాన్ ను ఆపాలని చెబుతుంది.

Advertisement

మరోవైపు రిసెప్షన్ కు వచ్చిన అందరికీ జీకే ధన్యవాదాలు తెలుపుతాడు. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం గురించి ఆయన చెబుతాడు. భార్యాభర్తల మధ్య బంధం ఎప్పుడూ బాగుండాలంటాడు. మీరు అందరూ నా కూతురు, అల్లుడిని దీవించండి.. ఆ తర్వాత ఈ పార్టీని ఎంజాయ్ చేద్దాం అంటాడు జీకే.

కట్ చేస్తే.. డీజే పెట్టి అందరూ డ్యాన్సులు వేస్తుంటారు. మరోవైపు కూల్ డ్రింక్ లో లాస్య వొడ్కా కలపడం దివ్య, శృతి చూస్తారు. వెయిటర్ ను పిలిచి ఆ డ్రింక్ తులసికి ఇవ్వాలని చెబుతుంది లాస్య. డబ్బు కూడా ఇస్తుంది. దీంతో సరే అని ఆ డ్రింక్ ను తీసుకెళ్తాడు. తులసి ఆ డ్రింక్ ను తీసుకొని తాగుతూ ఉంటుంది.

Advertisement

దీంతో తన ప్లాన్ వర్కవుట్ అయింది అని అనుకుంటుంది లాస్య. మరోవైపు వేద డ్యాన్స్ వేస్తుంది. అందరూ చీర్స్ అంటారు. మరోవైపు రామా, అర్జున్.. జ్యూస్ తీసుకొచ్చి ఇస్తారు. మాతో కలిసి డ్యాన్స్ చేయండి అంటారు. మీరు నా డ్యాన్స్ ను అందుకోలేరు అంటాడు. ఏం కాదు సార్.. మేము ట్రై చేస్తాం.. అంటారు.

మరోవైపు కూల్ డ్రింక్ లో మోషన్ ట్యాబ్లెట్ కలుపుతాడు రామా. ఇద్దరూ కలిసి ఇక మనోడిని డ్యాన్స్ చేస్తూ ఆడుకుంటారు. ఇంతలో మనోడికి కడుపులో తిప్పుతుంది. మరోవైపు నాటు నాటు పాటకు దుమ్ములేపేలా డ్యాన్స్ వేస్తారు ఇద్దరూ.

Intinti Gruhalakshmi 5 April Today Episode : లాస్యకు వోడ్కా కలిపిని కూల్ డ్రింక్ ఇచ్చిన దివ్య

జ్యూస్ తాగాక కూడా తులసికి మత్తు ఎందుకు రావడం లేదు. అంత స్ట్రాంగ్ బాడీనా అని అనుకుంటుంది. ఇంతలో దివ్య వచ్చి ఆంటి.. ఒక్కరే కూర్చున్నారు ఏంటి అంటుంది. మీ ఇద్దరి కోసం జ్యూస్ తీసుకొచ్చాను ఆంటి.. జ్యూస్ తాగండి అంటుంది.

తాగండి అని బతిమిలాడుతుంది. దీంతో లాస్య ఆ జ్యూస్ తాగుతూ ఉంటుంది. మీరు వెళ్లిపోయాక ఇల్లు అంతా బొసిపోయినట్టు ఉంది అంటుంది దివ్య. అయితే.. అంతకుముందే తులసి వొడ్కా కలిపిన గ్లాస్ ను దివ్య మార్చేస్తుంది. ఆ విషయాన్ని దివ్య గుర్తు చేసుకుంటుంది.

Advertisement

లాస్య తాగే జ్యూస్ వోడ్కా కలిపిందే.. అని అనుకుంటుంది. మందు తాగగానే.. లాస్యకు పిచ్చెక్కుతుంది. వెంటనే అక్కడికి వచ్చి పిచ్చిపిచ్చిగా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. అది చూసి నందుకు ఏం చేయాలో అర్థం కాదు. అందరూ షాక్ అవుతారు.

ఆ తర్వాత నందు వెళ్లి లాస్యను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ వినదు. చివరకు తులసి వెళ్లి లాస్యను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. తనను అక్కడి నుంచి తీసుకెళ్తుంది. మంచి నీళ్లు తన మొహాన కొడుతుంది.

నీ తింగరి వేషాలు చూడలేక ఏదో ఒక రోజు నీ నందు నిన్ను వదిలేయడం ఖాయం అంటుంది తులసి. నా వరకు నంద గోపాల్ తో నా కాపురం ఒక పీడ కల. ఆ పీడ కలను మళ్లీ కోరుకునే ప్రసక్తే లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు ఇలాగే ఉంటే.. నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయడం ఖాయం అంటుంది తులసి.

దీంతో నీ వాళ్లను మొత్తం నా వైపుకు తిప్పుకొని నిన్ను ఒంటరి దాన్ని చేస్తా అంటుంది లాస్య. చూద్దాం.. నీ మాట నిజం అవుతుందో నా మాట నిజం అవుతుందో అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి