intinti gruhalakshmi 5 january 2022 full episode
Intinti Gruhalakshmi 5 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 521 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శభాష్ నందు.. నువ్వు ఉద్యోగం తెచ్చుకొని తులసికి సరైన బుద్ధి చెప్పండి అంటుంది లాస్య. ఆ తర్వాత ఉదయమే తులసి.. పరందామయ్య, అనసూయకు టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో నందు వస్తాడు. మరోవైపు నైట్ డ్రెస్ లోనే లాస్య బయటికి వచ్చి గుడ్ మార్నింగ్ అత్తయ్య, గుడ్ మార్నింగ్ మామయ్య అంటుంది లాస్య. తన డ్రెస్ చూసి పరందామయ్య షాక్ అవుతాడు. ప్రొటీన్ షేక్ ఎలా తయారు చేయాలో నందును లాస్య అడుగుతుంది. దీంతో తులసి ఎలా చేయాలో చెబుతుంది. ఇదే నాకు నచ్చనిది. నేను అడిగింది నందును.. నిన్ను కాదు అంటూ చెబుతుంది లాస్య.
intinti gruhalakshmi 5 january 2022 full episode
ఇంతలో పరందామయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఒరేయ్ నందు.. నీ పెళ్లాం డ్రెస్ చూడలేక.. మీ నాన్న ఎలా వెళ్లిపోయాడో చూశావు కదా అంటుంది. నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం కూడా తప్పేనా అంటుంది లాస్య. వేసుకోవచ్చు కానీ.. సందర్భాన్ని బట్టి.. ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుసుకొని వేసుకోవాలి అని చెబుతుంది తులసి. దీంతో సారీ అత్తయ్య తెలియక తప్పు చేశాను. ఇక నుంచి అలా జరగదు.. అంటుంది లాస్య. నందు ఇటువంటి డ్రెస్ వేసుకొని నలుగురిలోకి రాకూడదని నువ్వైనా చెప్పాల్సింది కదా. ఇప్పుడు చూడు.. అత్తయ్య గారు, అనసూయతో గొడవలు పడాల్సి వచ్చింది. సరేలే.. నేను మార్చుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.
లేదురా నేను ఫంక్షన్ కు రాలేను.. ఏమీ అనుకోవద్దు అని ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతుంటాడు ప్రేమ్. ఇంతలో శృతి చాయ్ ఇస్తుంది. ఎవరురా.. అని అడుగుతాడు పరందామయ్య. నా ఫ్రెండ్ వాళ్ల అబ్బాయి ఊయల ఫంక్షన్ కు రమ్మంటున్నాడు అంటాడు. సరే వెళ్లి రండి అంటాడు.
మీరు ఈరోజు వెళ్తేనే కదా.. రేపు మీ బాబు ఫంక్షన్ కు వాళ్లు వచ్చేది. ఏంట్రా.. మీరు లైఫ్, సెటిల్ మెంట్ అంటూ పిల్లలను కనడం పక్కన పెట్టారా ఏంటి.. అంటాడు పరందామయ్య. అదేంలేదు తాతయ్య. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు. దీంతో మరి ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు కదా అంటాడు పరందామయ్య.
లాస్యకు నచ్చజెప్పాలన్నా.. కోప్పడాలన్నా నాకు మాత్రమే అధికారం ఉంటుంది. నువ్వు ఎవరు ఆమెకు చెప్పడానికి అని తులసిని ప్రశ్నిస్తాడు నందు. దీంతో ఇది నా ఇల్లు కూడా అని అంటుంది తులసి. అందుకే.. ఎవరి మధ్య ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి అంటుంది తులసి.
మంచి నేర్చుకోవడం కోసం అహంకారం ఎందుకు. లాస్యకు కూడా నేర్చుకోవాలి. లాస్యకు ఏదో నేర్పించాలని ఉత్తమురాలిని చేయాలన్న ఆశ నాకు అస్సలు లేదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నాకు. అత్తయ్య, మామయ్య తన వల్ల చాలా బాధపడటం చూసి నేను తట్టుకోలేకపోయాను అంటుంది తులసి.
మరోవైపు నందు ఇంటర్వ్యూకు వెళ్లేందుకు రెడీ అవుతాడు. టిఫిన్ చేద్దామని చూస్తే.. టిఫిన్ ఉండదు. లాస్య కూడా వస్తుంది. నాకు ఎందుకు వండలేదు అంటే.. నీ పెళ్లామే వండొద్దు అని చెప్పింది అని అంటుంది అనసూయ. నందు నువ్వు కూర్చో.. నేను తీసుకొస్తాను అని చెప్పి శాండ్ విచ్ తీసుకొని వస్తుంది లాస్య.
దీంతో నందుకు కోపం వస్తుంది. కానీ… ఏం చేయలేకపోతాడు. అవే తప్పని పరిస్థితుల్లో తింటాడు. మరోవైపు తులసి స్కూటీ మీద ఇంటర్వ్యూకు వెళ్తాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.