Intinti Gruhalakshmi 5 July Today Episode : లాస్యతో నందు విడాకులు.. తులసి దగ్గరికి వెళ్లిపోతా అన్న నందుకు షాకిచ్చిన లాస్య.. ఇంతలో మరో ట్విస్ట్

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 5 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 676 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకో హెల్ప్ చేస్తావా నందు.. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్. నువ్వు ఒక్కడివే వెళ్లి ఎంజాయ్ చేసిరా.. ప్లీజ్ నన్నేమీ అడక్కు అని నందుకు చెబుతుంది తులసి. ఒకవేళ నందుకు నిజం చెబితే నా చెంప పగులుగుతుంది. నా కాపురం కూలుతుంది అని అనుకుంటుంది. ఒక్కసారిగా 20 లక్షలు నీకు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అని అడుగుతుంది భాగ్య. అప్పు చేస్తాను అంటుంది లాస్య. నిన్ను ఏం చూసి నమ్ముతారు అని అంటుంది భాగ్య. దీంతో నువ్వు నన్ను నమ్ముతావు కదా.. ఆ డబ్బులేదో నువ్వే నాకు ఇవ్వు అంటుంది లాస్య. దీంతో వామ్మో.. నన్ను ఎక్కడ ఇరికిస్తుందో అని భాగ్య అక్కడి నుంచి తప్పించుకుంటుంది.

Advertisement

intinti gruhalakshmi 5 july 2022 full episode

కట్ చేస్తే తులసి, అంకిత, దివ్య.. ముగ్గురూ కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. దివ్యకు చెక్ పెడుతుంది తులసి. మామ్.. ఇంత రిలాక్స్ డ్ గా ఆడుతున్నావు ఏంటి. లాస్య ఆంటితో ఆడుకోవడం అయిపోయిందా అని అడుగుతుంది దివ్య. దీంతో మన వంతు పని అయిపోయింది. ఇక.. అసలు పని బాకీ ఉంది అని అంటుంది తులసి. మరోవైపు లాస్య.. తెలిసిన వాళ్లను అందరినీ అప్పు అడుగుతుంది. కానీ.. ఎవ్వరూ ఇవ్వరు. ఇంతలో తులసి ఫోన్ చేసి.. నీకు ఇచ్చిన సమయంలో సగం సమయం పూర్తయింది అంటుంది. దీంతో నువ్వు పదే పదే ఫోన్ చేయాల్సిన పని లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఎవ్వరిని అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో ఇంటికి వచ్చేస్తుంది. తులసి నాకు ఇచ్చిన గడువు పూర్తయింది. నన్ను దెబ్బకొట్టే ఆరాటం కోసం ఇక.. తులసి ఊరుకోదు. ఆ విషయం నందుకు చెప్పేస్తుంది. నందు నన్ను వదిలేస్తాడు. నా కాపురం కూలిపోయినట్టే.. అయ్యో అని అనుకుంటుంది లాస్య.

Advertisement

మరోవైపు తులసి ఫోన్ లో ఏదో మెసేజ్ వస్తుంది. అది ఏంటి చూడమని అడుగుతుంది దివ్యను. దీంతో నీ అకౌంట్ లో 20 లక్షలు క్రెడిట్ అయ్యాయి అని చెబుతుంది. దీంతో తులసి, అంకిత, దివ్య సంతోషిస్తారు. వెంటనే లాస్యకు ఫోన్ చేస్తుంది తులసి. దీంతో నేను డబ్బులు కట్టలేను.. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అంటుంది లాస్య.

దీంతో నువ్వు వేసిన 20 లక్షలు నా అకౌంట్ లో పడ్డాయి అని చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తులసి. దీంతో లాస్య షాక్ అవుతుంది. 20 లక్షలు వేయడం ఏంటి.. పిచ్చెక్కింది తనకా నాకా.. నేను 20 లక్షలు తులసి అకౌంట్ లో వేయడం ఏంటి అని అనుకుంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 5 July Today Episode : తులసి అకౌంట్ లో డబ్బులు వేసిన నందు

ఇంతలో నందు వచ్చి వేసింది నేను.. నువ్వు కాదు అని అంటాడు నందు. దీంతో నువ్వెందుకు వేశావు నందు అని అడుగుతుంది లాస్య. దీంతో తులసి దృష్టిలో నువ్వు నన్ను ఒక మోసగాడిని చేశావు. రోడ్డు మీదికి లాగావు అని లాస్యపై సీరియస్ అవుతాడు నందు.

నువ్వు చీటర్ వి అంటాడు. తులసిని మోసం చేసి 20 లక్షలు కాజేసి.. ఆ డబ్బుతో నా బిజినెస్ స్టార్ట్ చేస్తావా? నువ్వు చేసిన ఈ దరిద్రపు పని వల్ల తులసి ముందు తలెత్తుకోలేకపోయాను. ఐహేట్ యూ.. అంటాడు నందు. దీంతో లాస్యకు ఏం మాట్లాడాలో అర్థం కాదు.

చెప్పను అంటూనే తులసి.. నందుకు ఈ విషయం చెప్పేసిందా అని అనుకుంటుంది లాస్య. నీలాంటి దాని కోసమే నా వాళ్లను వదిలేసి వచ్చాను. ఆ తప్పును కూడా ఈరోజు దిద్దుకుంటాను. మన రిలేషన్ ఈరోజుతో తెగిపోయినట్టే. నువ్వెవరో.. నేనెవరో. ఇక మనం కలిసి కాపురం చేసే ప్రసక్తే లేదు. గుడ్ బై అంటాడు నందు.

నందు వద్దు.. అలాంటి నిర్ణయం తీసుకోకు అంటుంది లాస్య. దీంతో ఇక నుంచి నీ బతుకు నీది.. నా బతుకు నాది. నా వెంట పడ్డావనుకో అంటూ నందు సీరియస్ అవుతాడు. డబ్బులు వచ్చాయన్న ఆనందంలో ఉంటుంది తులసి. నువ్వు ఉన్నావు తండ్రి. అందుకే నేను ఇంకా ఇలా నిలబడగలిగి ఉన్నాను అని దేవుడిని మొక్కుతుంది తులసి.

ఇంతలో తులసికి ఫోన్ వస్తుంది. లాస్య ఫోన్ చేస్తుంది. చెప్పు లాస్య.. ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది. నీ దగ్గర టన్నుల కొద్దీ నిజాయితీ ఉంది అంటావు కదా అంటుంది లాస్య. అంత నిజాయితీ నీ దగ్గర ఉంటే ఆ విషయం నందుకు ఎందుకు చెప్పావు అని అడుగుతుంది లాస్య.

దీంతో నేను తులసిని.. లాస్యను కాదు.. నందుకు నేను ఈ విషయం చెప్పలేదు.. మాట తప్పలేదు. ఆ విషయం మీ ఆయన్నే అడుగు. ఇక నీ కాపురాన్ని కూల్చాలని కానీ.. నందుకు దగ్గరవ్వాలని కానీ నాకు అస్సలు లేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

ఇకనైనా నా గురించి ఆలోచించడం మానుకో. నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు గడువులోపు డబ్బు ఇవ్వకపోయినా కూడా నేను నందుకు ఈ విషయం చెప్పేదాన్ని కాదు. నీకు బుద్ధి చెప్పాలనే ఇదంతా చేశాను అని అంటుంది తులసి. నిన్ను నాశనం చేయాలి అనే ఆలోచనే నాలో ఉంటే ఒక్క పోలీస్ కంప్లయిట్ చాలు.. ఈపాటికే ఊచలు లెక్కబెట్టుకుంటూ ఉండేదానివి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తులసి.

తులసి చెప్పకపోతే నందుకు ఈ నిజం ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది అని అనుకుంటుంది. ఇంతలో సంజన లాస్యకు ఫోన్ చేస్తుంది. మీ ఆయన బిజినెస్ కు నేను డబ్బు ఇచ్చానా అని అడుగుతుంది. దీంతో నువ్వెందుకు అలా అబద్ధం చెప్పావు అని అడుగుతుంది సంజన.

నిజానికి ఆ డబ్బు వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకున్న. ఆ ఫ్రెండ్ అంటే మా ఆయనకు పడదు. అందుకే.. నీ పేరు చెప్పాల్సి వచ్చింది అంటుంది లాస్య. ఇంకోసారి అలా చేయకు అంటుంది. మరోవైపు నందు.. తులసి దగ్గరికి వెళ్లేందుకు బట్టలు సర్దుకుంటూ ఉంటాడు.

ఇంతలో భాగ్య అక్కడికి వస్తుంది. నందును ఎలాగైనా ఆపాలని.. లాస్య విషం తాగుతున్నట్టు యాక్షన్ చేస్తుంది. ఏంటి లాస్య ఎందుకు ఇలా చేస్తున్నావు. విషం తాగి చచ్చిపోయి ఎవరిని సాధిస్తావు అని అడుగుతుంది భాగ్య. దీంతో నా నందు మీద ప్రేమతో నేను ఆ పని చేశాను భాగ్య అంటుంది.

నందుకు తెలియకుండా నందుకు చెప్పకుండా నందుకు ఇష్టం లేని పని చేయడం తప్పేకదా భాగ్య. కష్టపడి తులసి బ్యాంక్ లోన్ తెచ్చుకుంటే.. మోసం చేసి నందు కోసం ఆ డబ్బును కాజేశాను అంటుంది. నందు జాబ్ లేక.. ఖాళీగా ఉండటం చూసి తట్టుకోలేక నేను అలా చేశాను అంటుంది లాస్య.

నందు చూస్తున్నాడని తెలిసి రెచ్చిపోయి మాట్లాడుతుంది. నందు కోసం నేను ఏదైనా చేస్తాను అంటూ మాట్లాడుతుంది. తులసి ముందు నందు ఓడిపోకూడదు. కిందా మీదా పడి అభిని బతిమిలాడి నందుతో బిజినెస్ పెట్టిద్దామనుకున్నా. కానీ.. అభికి ఆస్తి రాకుండా చేసింది తులసి.

నందు అసలే డిప్రెషన్ లో ఉన్నాడు. ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ పెట్టి నందును ఇంకా అవమానించాలని తులసి అనుకుంది. ఇదంతా ముందు నందుకు చెబితే ఒప్పుకోడని తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు అంటుంది లాస్య. చాలా పెద్ద రిస్క్ చేశావు లాస్య అంటుంది భాగ్య.

ఇప్పుడు నా నందే నన్ను వద్దుంటున్నాను. నేను ఎందుకు బతకాలి అని విషం తాకబోతుంది లాస్య. దీంతో నందు వచ్చి తనను ఆపుతాడు. ఐయామ్ సారీ లాస్య అంటాడు నందు. నువ్వు నాతోనే ఉంటావు కదా అంటే.. నీతోనే ఉంటా.. ఎక్కడికీ వెళ్లను అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Tomahawk : తోమహాక్ పేరు వింటేనే అమెరికా వణికిపోతోంది.. అంటే ఏంటి.. ఎందుకంత భయం..!

Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…

4 minutes ago

Pawan Kalyan : వైసీపీకి మళ్ళీ అధికారం… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…

1 hour ago

Raghava Mining : రాఘవ మైనింగ్స్ తో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ… Full Details..!

Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…

2 hours ago

Amaravati : అమరావతి చట్టబద్ధత వెనక అతిపెద్ద డ్రామా..?

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…

5 hours ago

New COVID Variant : వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, లాక్ డౌన్ తప్పదా..?

New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…

6 hours ago

Chicken Price Drop : చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన ధరలు.. కానీ ఏప్రిల్ 1 నుంచి షాక్!

Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…

9 hours ago

Gold Silver Rate 29th March 2026 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.2500 జంప్!

Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…

10 hours ago

pachhi chintapandu rasam recipe : నోరూరించే చింతపండు రసం .. ఇలా ఇలా చేస్తే ప్రతిరోజు అదే కావాలంటారు ..!

pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…

12 hours ago

Coffee On Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా? .. అయితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…

13 hours ago

Health : ఇది పిచ్చి మొక్క కాదు .. సంజీవనితో సమానం .. వంద అనారోగ్య సమస్యలకు చెక్..!

Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…

14 hours ago

Gold : ఇప్పటికిప్పుడు బంగారం కొంటే ఎంత లాభం వస్తుందో తెలుసా?

Gold  : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…

1 day ago