intinti gruhalakshmia 5 november 2021 full episode
Intinti Gruhalakshmi 5 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 నవంబర్ 2021, 469 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి.. జీతాల కోసం అని 2.5 లక్షలను తులసికి ఇస్తాడు. ప్రేమ్ ఇచ్చిన డబ్బులను తులసి తీసుకోదు. అయితే.. మీరంతా నాకు సాయం చేయాలనే గొప్ప ఆలోచన ముందు నా అవసరం చాలా చిన్నది. నువ్వు నా కోసం మీ అమ్మ గొలుసునే తాకట్టు పెట్టావంటే.. నీది ఎంత గొప్ప మనసో అర్థం అవుతోంది. నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకోలేదని బాధపడకు అమ్మ అని అంటుంది తులసి.
కట్ చేస్తే.. నందు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పరందామయ్య వస్తాడు. నువ్వు అందరికీ దూరం అయిపోయావు కానీ… మనిషిగా మాత్రం నువ్వు నీ అంతరాత్మకు దూరం కాకు అంటాడు. ఎందుకురా అంత దిగులు అంటాడు. దీంతో నేను ఏదీ తప్పు చేయను నాన్నా అంటాడు నందు. తులసి గమ్యం వేరు.. నా గమ్యం వేరు అంటాడు నందు. తులసి గమ్యం ఒకటేరా.. నిన్ను విజయతీరాలకు చేర్చడమే తన పని.. అంటాడు పరందామయ్య. నేను తులసిని కష్టపెట్టకూడదని ఆలోచించి.. ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తనకోసం కాదు.. ఈ ఇల్లు పోతుంది కాబట్టి అందుకే తులసితో కలిసి పనిచేస్తున్నా. ఇఫ్పుడు సాయం చేసి తర్వాత నన్ను లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అంటూ నందు పరందామయ్యను ప్రశ్నిస్తాడు.
intinti gruhalakshmia 5 november 2021 full episode
మరోవైపు తులసి డబ్బు తీసుకోలేదని శృతి కొంచెం బాధపడుతుంది. బాధగా ఉందా అని అంటాడు ప్రేమ్. అలా ఏం లేదు కానీ.. అంకిత ఎందుకు ప్రతీ విషయంలో అడ్డం పడుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది శృతి. కానీ.. ఈసారి అంకిత అడ్డుపడటం నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే.. మీ అమ్మ నెక్లెస్ ను తాకట్టు పెట్టకుండా ఉంచాం కదా అంటాడు ప్రేమ్. అంకిత వల్ల.. నన్ను ఆంటి అపార్థం చేసుకుంటుందేమోనని శృతి ప్రేమ్ తో అంటుంది. అటువంటి పరిస్థితి ఎప్పుడూ రాదు శృతి. నీకు నేనున్నాను అంటాడు ప్రేమ్.
మరోవైపు తులసి అర్ధరాత్రి అయినా ఫైల్స్ చూస్తూనే ఉంటుంది. రేపు స్టాఫ్స్ కు జీతాలు ఇవ్వాలి.. లెక్కలు తేలడం లేదు.. అవే చూస్తున్నాను అని పరందామయ్యతో తులసి అంటుంది. ఇంతలో నందు వస్తాడు. రేపు స్టాఫ్ కు జీతాలు ఇవ్వాలి. వచ్చి.. ఆ లిస్టును చూడండి అని చెబుతుంది. దీంతో నందు వెళ్లి తన దగ్గర కూర్చొని లిస్టు చెబుతుంటాడు. ఇంతలో రెడీ అయి లాస్య కిందికి దిగుతుంది. వాళ్లను చూసి ఈర్ష్య పడుతుంది. నందు అని గట్టిగా అరుస్తుంది. నందు… ఇది మార్నింగే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్. ఇప్పుడు ఏంటి ఇదంతా అనగానే… లాస్య జస్ట్ 10 నిమిషాలు బయలు దేరుదాం అంటాడు నందు. కానీ.. లాస్యకు ఏం చేయాలో తెలియదు.
intinti gruhalakshmia 5 november 2021 full episode
వాళ్లిద్దరూ అలా కలిసి ఉండటం చూసి తట్టుకోలేదు. పిచ్చి ఎక్కుతుంది తనకు. నందు టైమ్ అవుతుంది బయలు దేరుదామా? అంటుంది లాస్య. హా.. పని అయిపోయింది వెళ్దాం అంటాడు నందు. ఇంతలో ఏమండి ఒక్క నిమిషం అంటుంది తులసి. ఒకసారి మళ్లీ అన్నీ చెక్ చేస్తాడు నందు. ఇంకా ఎంత సేపు నందు అనగానే… ఇప్పటికే లేట్ అయింది. ఇంకా పని కాలేదు. రేపు వెళ్దాంలే అంటాడు నందు. దీంతో లాస్య షాక్ అవుతుంది. వెంటనే కోపంతో పైకి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత భాగ్య వచ్చి.. ఎందుకైనా మంచిది నువ్వు తులసితో జాగ్రత్తగా ఉండు. లేకపోతే నందును నీకు కాకుండా చేస్తుంది అని చెబుతుంది. ఈ ప్రాజెక్టు, ఆఫీసు పేరుతో నందుకు తులసి దగ్గర కావాలని చూస్తుంది అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…
RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…
KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన…
Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…
Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
Farmers : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి…
This website uses cookies.