intinti gruhalakshmi 6 april 2022 full episode
Intinti Gruhalakshmi 6 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 599 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తనకు అవకాశాలు రావకపోవడంపై చాలా బాధపడతాడు. ఎవ్వరి దగ్గరికి వెళ్లినా అవమానాలే ప్రేమ్ కు ఎదురయ్యాయి. దీంతో ఏం చేయాలో ప్రేమ్ కు అర్థం కాదు. మరోవైపు లాస్య ఆన్ లైన్ లో షాపింగ్ చేసి డెకరేషన్ ప్రొడక్ట్స్ కొంటుంది. 25 వేలు పెట్టి పనికిమాలిన వస్తువులు ఎందుకు కొన్నావంటూ నందు తనపై సీరియస్ అవుతాడు. దీంతో లాస్యకు కోపం వస్తుంది. తక్కువ ధరకు వచ్చాయని కొన్నాను అంటుంది.
intinti gruhalakshmi 6 april 2022 full episode
మరోవైపు తులసికి మేనేజర్ ఫోన్ చేస్తాడు. బ్యాంక్ లోన్ రాలేదంటాడు. బ్యాంక్ మేనేజర్ ను ఎంత కన్విన్స్ చేసినా అతడు ఒప్పుకోలేదని చెబుతాడు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో శశికళ ఇంటికి వస్తుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. గడువు తేదీ కన్నా ఇంకా రెండు రోజుల ముందే వచ్చావు ఏంటి అని అడుగుతుంది తులసి. ఈ మధ్య ఈ ఇంటి గురించి చాలా విన్నాను. అందుకే తొందరపడి వచ్చాను అంటుంది శశికళ. నీ మొగుడు ఈ ఇంటితో పాటు నిన్ను కూడా వదిలేసి వెళ్లిపోయాడట కదా అంటుంది. నీ చిన్న కొడుకును నువ్వే తరిమేశావట కదా.. అంటుంది.
అవన్నీ నీకెందుకు అని అభి అనేసరికి.. అప్పును అందరూ పంచుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఇంట్లో మిగిలింది.. నువ్వు, మీ అమ్మ. మీ ఇద్దరిలో ఎవరు నా అప్పు తీరుస్తారు చెప్పండి అని అడుగుతుంది శశికళ. ఇవన్నీ కాదు కానీ.. నేను మీకు బంగారం లాంటి ఆఫర్ చెబుతాను.. అంటుంది.
మీ అప్పు తీరుతుంది. మీ చేతికి 20 లక్షలు వస్తాయి. కానీ.. ఈ ఇల్లు మీది అవుతుంది ఏమంటావు అంటుంది శశికళ. ఇంతలో భాగ్య వస్తుంది. ఐడియా అదిరిపోయింది కదా అంటుంది భాగ్య. ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కు ఉందో.. నీ తోటికోడలును నాకు కూడా అంతే హక్కు ఉంది తులసి అక్క. ఈ ఇల్లు నువ్వు అమ్మలేవు అంటుంది భాగ్య.
దీంతో ఇల్లు తులసి పేరు మీద ఉంది. అమ్మే హక్కు తులసికి కూడా ఉంటుంది అంటుంది శశికళ. మా మామయ్య గారిని మోసం చేసి ఈ ఇల్లు రాయించుకుందని కోర్టుకు వెళ్తాను. తీర్పు వచ్చేవరకు నోట్లో వేలు వేసుకొని కూర్చో అంటుంది భాగ్య.
దీంతో ఇదంతా నీ ప్లానా అమ్మి అంటుంది శశికళ. దీంతో లేదు.. తను ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అడ్డు పడుతుందో అర్థం కావడం లేదు అంటుంది తులసి. దీంతో రెండు రోజుల్లో వస్తాను.. అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత అనసూయ భాగ్యను కోప్పడుతుంది.
అయినా భాగ్య వినదు. ఈ ఇంట్లో నాకు వాటా కావాల్సిందే. లేకపోతే నేను కోర్టుకు వెళ్తాను.. అంటుంది భాగ్య. ఈ ఇంటి మీద అప్పు చేశా అని చెప్పినా వినదు భాగ్య. ఇది పరువుకు సంబంధించిన సమస్య అంటుంది తులసి. రేపటి వరకు ఆగుతాను.. నీ నిర్ణయం చెప్పు. లేదంటే కోర్టుకు వెళ్లడం ఖాయం అంటుంది భాగ్య.
మరోవైపు ఎటువంటి అవకాశాలు రాకపోవడంతో నిరాశతో ఇంటికి వస్తాడు ప్రేమ్. శృతి చూసి.. ఏంటి ఏమైంది.. అవకాశాలు వస్తాయి. టెన్షన్ పడకు.. అని అంటుంది. అంతా బాగున్నప్పుడు ఎవ్వరైనా హుషారుగా ఉంటారు.. కానీ.. బాధలు ఉన్నప్పుడు హుషారుగా ఉన్నవాడే గ్రేట్ అంటుంది శృతి.
మరోవైపు పరందామయ్య, అనసూయ ఇద్దరూ భాగ్య గురించి ఆలోచిస్తారు. ఇంతలో తులసి వస్తుంది. భాగ్య అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా అంటుంది తులసి. మీరేం జోక్యం చేసుకోకండి. ఏదోలా నేనే భాగ్యకు నచ్చజెబుతాను అంటుంది తులసి.
లాస్యకు ఫోన్ చేసి నేను అస్సలు ఈ ఇంటిని వదలను అంటుంది భాగ్య. నాకు ఎలాంటి మొహమాటం లేదు. నా వాటా నాకు ఇచ్చే వరకు ఈ ఇల్లు వదిలేది లేదని చెబుతుంది భాగ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Peacock Vastu Tips : వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇంట్లో వాస్తు మూలాలు , వాటి దిశలనుబట్టి…
Kidneys Health : ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. పనితీరు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కంటే మనం…
Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, గ్రహాలకు రాకుమారుడైన…
Kethireddy : లిక్కర్ స్కామ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైఎస్సార్సీపీ మాజీ…
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో లిక్కర్ స్కాం పై Liquor scam సిట్ విచారణను ఎండగడుతూ…
Hari Hara Veera Mallu Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు…
Dancer Janu : తెలుగు టెలివిజన్లో సెన్సేషన్ అయిన ‘బిగ్ బాస్’ షో Big Boss Show Telugu తొమ్మిదో…
Ashu Reddy : బిగ్ బాస్ ఫేం, ఫేమస్ యాంకర్ అషురెడ్డి మరోసారి మోడ్రన్ డ్రెస్లో అందాలు ఆరబోశారు .…
This website uses cookies.