Home » Entertainment » Intinti Gruhalakshmi 6 December 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : తనకు క్యాన్సర్ అని తెలుసుకున్న తులసి.. ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలు ఎక్కి.. ఈ విషయం తెలిసి అందరూ షాక్

Authored By
Varun G
The Telugu News | Updated on: December 6, 2021 10:34 am
Advertisement

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 495 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి అందరూ సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. ప్రేమ్ తనకు కాటేజ్ గిఫ్ట్ గా ఇవ్వగా.. నందు తనను తీసుకెళ్లి గులాబీ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. తనకు ఇష్టమైన ఎల్లో కలర్ గులాబీ చెట్టు దగ్గరికి తీసుకొస్తాడు. తులసికి గులాబీ చెట్టు అంటే చాలా ఇష్టం అని తెలిసి తనను అక్కడికి తీసుకెళ్తాడు. తులసికి చిన్నప్పటి నుంచి తన బాధలు గులాబీ చెట్టుకు చెప్పుకునే అలవాటు అని చెబుతుంది తులసి. పెళ్లయ్యాక దాన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను. పెళ్లయ్యాక ఒక తోడు దొరికింది కదా.. అని అనుకున్నాను కానీ.. నాకు నిజంగా మళ్లీ ఆ మొక్క అవసరం ఉంది అనిపించింది అని అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 6 december 2021 full episode

ఇంతలో అమ్మా తులసి హారతి తీసుకుందువు కానీ రా అమ్మా అంటుంది అనసూయ. హారతి ఇస్తుంది అనసూయ. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అత్తయ్య అంటుంది తులసి. నువ్వు పాతికేళ్ల క్రితం మా ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పుడు నేను కనీసం హారతి కూడా ఇవ్వలేదు. అందుకే.. ఇప్పుడు హారతి ఇచ్చి నేను లోనికి ఆహ్వానిస్తున్నాను అంటుంది అనసూయ. దీంతో ఇప్పుడు నేను మీ కోడలును కాదు కదా అని అంటుంది తులసి. దీంతో.. ఇప్పుడు నువ్వు నాకు అంతకంటే ఎక్కువ అమ్మ. నా కూతురువి అంటుంది అనసూయ. దీంతో తులసి భావోద్వేగానికి గురవుతుంది. అందరూ ఇంట్లోకి వెళ్తారు. తను చిన్నప్పుడు కుట్టిన మిషిన్ ను కూడా తీసుకొస్తారు. అన్నింటిని చూసి షాక్ అవుతుంది తులసి.

Advertisement

ఇల్లు చాలా బాగుంది అంటుంది తులసి. నాకు పెద్దగా ఆశలు లేవు.. ఆశయాలు లేవు కానీ.. మీరంతా నాకు అండగా నిలిచారు అంటుంది తులసి. ఇంతలో నందు వచ్చి తులసికి శుభాకాంక్షలు చెబుతాడు. తులసి షాక్ అవుతుంది. అమ్మవారికి హారతి ఇచ్చిన తులసి ఆ హారతిని అందరికీ ఇస్తుంది. తులసి ఇచ్చిన హారతిని నందు తీసుకుంటుండగా లాస్య చూసి షాక్ అవుతుంది.

అంతా బాగానే ఉంది కానీ.. ఎవ్వరూ మనస్పూర్తిగా ఉన్నట్టు అనిపించడం లేదు. అందరిలోనూ ఏదో దిగులు. నాముందు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది తులసి. వీళ్లకేమన్నా పిచ్చి ఎక్కిందా.. ఇదేమన్నా వాళ్ల పర్మినెంట్ ఇల్లా. వారం రోజుల కోసం ఇదంతా ఏంటి.. అని బాధపడుతుంది లాస్య.

Advertisement

ఇల్లు మారినా కూడా అదే బాధ.. అదే టెన్షన్.. అందరూ కలిసిపోయారు. నన్ను ఒక్కదాన్నే వదిలేశారు. ఇలా జరగడానికి వీలు లేదు అని అనుకుంటుంది లాస్య. ఇంతలో ఫ్యామిలీ అంతా సరదాగా బయట గడుపుతుంటారు. పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తుంటారు.

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? అని నందును నిలదీసిన లాస్య

వాళ్లంతా కలిసి డ్యాన్సులు చేయడం చూసి లాస్యకు అస్సలు నచ్చదు. లాస్యను చూసిన నందు షాక్ అవుతాడు. లోపలికి రా అని నందును పిలుస్తుంది లాస్య. దీంతో నందు లోపలికి వెళ్తాడు. కంగ్రాచ్యులేషన్స్ నందు. తులసితో కలిసి ఉండటానికి నీకు మరో కారణం దొరికింది. నాకు కావాల్సింది నీ రియాక్షన్ కాదు. నీ సమాధానం. తులసి అనారోగ్యాన్ని సాకుగా చూపించి తనతో ఉందామనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది.

ఇది సాకు కాదు లాస్య. నిజం. తులసి మెడికల్ రిపోర్ట్స్ గురించి నీకు ఇదివరకే చెప్పాను కదా.. అంటే అవును.. కానీ.. దానికి, మన పెళ్లికి సంబంధం ఏంటి అంటుంది లాస్య. ఇప్పుడు ఏం చేయమంటావు. తులసి అనారోగ్యంతో ఉన్నా.. నేను, లాస్య పెళ్లి చేసుకుంటున్నాం అని అందరికీ చెప్పమంటావా? అంటాడు నందు.

మన పెళ్లి జరగకుండా ఉండటానికి నీకు అడ్డొస్తున్న కారణం ఏంటి. తులసికి అందరు ఉన్నారు కానీ.. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అంటుంది లాస్య. నువ్వు ఎప్పుడు తులసి గురించే ఆలోచిస్తున్నావు అంటే.. ఆలోచిస్తున్నాను.. ఆలోచిస్తాను కూడా ఎందుకంటే తులసి నేను తాళి కట్టిన భార్య.. అని చెబుతాడు నందు. మొత్తానికి లాస్య చిరాకుతో ఇంట్లోకి వెళ్లిపోతుంది.

Advertisement

ఎవరెన్ని చెప్పినా.. ఇప్పుడు తులసితో నేను ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా.. నేను ఇప్పుడు తులసితోనే ఉంటాను.. అని తన మనసులో అనుకుంటాడు నందు. మరోవైపు తులసిని కలిసిన డాక్టర్ అద్వైత కృష్ణ.. తులసికి క్యాన్సర్ ఉందని చెబుతాడు. దీంతో షాక్ అవుతుంది. క్యాన్సర్ వచ్చిన తను బతకడం వేస్ట్ అనుకొని ట్రెయిన్ కింద పడి సూసైడ్ చేసుకోబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి