Home » Entertainment » Intinti Gruhalakshmi 6 December 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : ఇంట్లో వాళ్లను బుట్టలో వేసుకునేందుకు లాస్య మరో ప్లాన్.. పరందామయ్య, అనసూయను తనవైపునకు తిప్పుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: December 6, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 808 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజ్ మిల్క్ తాగుదామని అంటుంది తులసి. దీంతో సరే నేను వెళ్లి తీసుకొస్తా అని అక్కడికి వెళ్తాడు సామ్రాట్. జనాల మధ్య ఇరుక్కుంటూ పోయి తులసి గారు అంటూ అందరినీ నెట్టి మరీ రోజ్ మిల్క్ గ్లాసులు రెండు తీసుకొస్తాడు. కానీ.. ఆ గ్లాసులలో రోజ్ మిల్క్ ఉండదు. దీంతో గ్లాసులు ఉన్నాయి కానీ.. రోజ్ మిల్క్ ఏదండి అని అడుగుతుంది తులసి. ఇంతలో ఇక్కడుంది అనే అక్కడ ఉన్న మరో వ్యక్తి తన షర్ట్ మీద రోజ్ మిల్క్ పడిందని అంటాడు. దీంతో సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు ఏదైనా సలహా ఉంటే చెప్పు నాకు అని భాగ్యను అడుగుతుంది లాస్య.

Advertisement

intinti gruhalakshmi 6 december 2022 full episode

దీంతో ఎక్కడ వాటా అడుగుతానో అని ఇన్ని రోజులు దూరం పెట్టావు. ఇప్పుడు నా అవసరం వచ్చి నన్ను అడుగుతున్నావు కదా అంటుంది భాగ్య. ఇంట్లో అందరి దృష్టిలో నువ్వు ఒక మోసగత్తెగా ముద్ర వేయబడ్డావు. ఆ మరక చెడగొట్టుకోవాలి అంటుంది. నీ చెవిని ఒకసారి ఇలా పడేయ్ అంటుంది భాగ్య. భాగ్య ప్లాన్ ను విన్న లాస్య టెన్షన్ పడుతుంది. నీ ప్లాన్ కొంప ముంచేలా ఉంది అంటుంది లాస్య. దీంతో ప్లాన్ రివర్స్ అయితే ఈ జన్మలో నా ముఖం నీకు చూపించను. ప్లాన్ సక్సెస్ అయితే ఓకే అంటుంది భాగ్య. సరే.. వెంటనే ఈ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తా అంటుంది లాస్య.

Advertisement

మరోవైపు ఇంటికి వెళ్లేందుకు తులసి, సామ్రాట్ ఇద్దరూ బస్సు ఎక్కుతారు. వామ్మో బస్సులో సీటు దొరకాలంటే అదృష్టం ఉండాలి అంటాడు సామ్రాట్. ఏది ఏమైనా ఈరోజు నేను నా చాలెంజ్ లో గెలిచి తీరాలి అంటాడు సామ్రాట్. ఇద్దరూ బస్సులో వెళ్తుండగా ముందు ఒ అమ్మాయిని ఓ యువకుడు వేధిస్తుంటాడు. తనను కావాలని తాకుతూ ఉంటాడు.

దీంతో అతడిని చూసి కండక్టర్ ను బస్సు ఆపు అంటుంది తులసి. ఆ తర్వాత ఆ హీరోకు అందరూ ప్రోత్సహించి చప్పట్లు కొట్టండి అంటుంది. అందరూ చప్పట్లు కొట్టాక.. అతడిని తిడుతుంది. దీంతో తులసికి దండం పెడతాడు. దీంతో నాకు దండం పెట్టడం కాదు. ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటుంది తులసి.

Advertisement

దీంతో సారీ అంటాడు ఆ వ్యక్తి. దీంతో ఇట్స్ ఓకే అంటుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత తులసి, సామ్రాట్.. ఇద్దరూ కలిసి బస్సు దిగుతారు. నడుచుకుంటూ వెళ్తుంటారు. మీతో ఒక ప్రాబ్లమ్ ఉంది తులసి గారు. అది మామూలు ప్రాబ్లమ్ కాదు. ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు అంటాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : తులసిని పొగడ్తల్లో ముంచెత్తిన సామ్రాట్

మిమ్మల్ని పొగడొద్దు అని రెస్ట్రిక్షన్ పెట్టారు కానీ.. మీరు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని పొగడకుండా ఉండలేం అంటాడు సామ్రాట్. ఎవ్వరితో గొడవ పెట్టుకోకుండా భలేగా డీల్ చేశారు అంటాడు సామ్రాట్. జీవితంలో మీరు గెలిచారు తులసి గారు అంటాడు సామ్రాట్.

దీంతో నేను ఏం చేసినా ఆహా.. ఓహో అని అనాలంటే నేను ఏం చేయలేను అంటుంది తులసి. ఇంకా మనం చేయాల్సిన షాపింగ్ చాలా ఉంది అంటుంది. దీంతో ఇంకా షాపింగ్ పూర్తికాలేదా అంటాడు సామ్రాట్. కాలేదు.. ప్రేమ్ గిటార్ రిపేర్ కు ఇచ్చాడట అక్కడికి వెళ్లాలి అంటుంది. దీంతో ఎక్కడికి వెళ్లాలి అంటాడు. మియాపూర్ అంటుంది.

మరోవైపు అనసూయ, పరందామయ్య ఇద్దరూ కలిసి చెస్ ఆడుతుంటారు. దీంతో చెస్ వద్దు అనసూయ.. కావాలంటే క్యారమ్ బోర్డ్ ఆడుదాం అంటాడు పరందామయ్య. ఇంతలో అక్కడికి వస్తుంది లాస్య. నన్నెందుకు పరాయిదానిలా చూస్తున్నారు మామయ్య అంటుంది లాస్య.

Advertisement

నన్ను కూడా మీ దానిలా అనుకోవచ్చు కదా అంటే.. దానికి మా మనసు ఒప్పుకోవాలి అంటాడు పరందామయ్య. ఇంతలో అనసూయ వెళ్లబోతుండగా మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అంటుంది లాస్య. ఇంతలో అందరూ వస్తారు. ఇంట్లో అందరికీ నా మీద కోపంగా ఉందని తెలుసు.

అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటుంది లాస్య. ఈ క్షణం నుంచి ఈ ఇంటి డాక్యుమెంట్స్ కు నాకు సంబంధం లేదు అంటూ ఆ డాక్యుమెంట్స్ ను అక్కడ పెడుతుంది. ఈ ఇంటి మీద హక్కును పూర్తిగా వదులుకుంటున్నాను మామయ్య అంటుంది లాస్య.

ఇది మీ కష్టార్జితంతో కొన్న ఇల్లు. మీ ఇల్లు మామయ్య. ఎవరి పేరు మీద ట్రాన్స్ ఫర్ చేయించమంటే వాళ్ల పేరు మీద వెంటనే ట్రాన్స్ ఫర్ చేయిస్తాను. కేవలం ఇన్ సెక్యూరిటీ వల్లనే ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకున్నాను కానీ.. దాని మీద ఆశతో కాదు అంటుంది లాస్య.

ఇంట్లో ఎవరి మీద, దేని మీద నాకు ఎలాంటి హక్కు లేదనిపించింది. అందుకే నన్ను ఎప్పుడు బయటికి తరిమేస్తారో అని టెన్షన్ గా ఉండేది. సీరియస్ గా తీసుకోలేదు అందుకే నాకోసం నేనే ఏదో ఒకటి చేసుకోవాలనిపించింది. అందుకే ఇంటిని నా పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాను అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి