Intinti Gruhalakshmi 6 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 677 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే తులసి బ్యాంక్ కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెబుతుంది తులసి. ఎందుకు బ్యాంక్ కు అని అడుగుతుంది అంకిత. ఆ బ్యాంక్ లో తీసుకున్న లోన్ ను తిరిగి కట్టేద్దామని వెళ్తున్నాను అని అంటుంది. అదేంటి ఆంటి ఎందుకు లోన్ తీర్చడం అని అడుగుతుంది. దీంతో నాకు ఆ లోన్ వద్దు. ఫేక్ సర్టిఫికెట్లతో తీసుకున్న ఆ లోన్ వద్దు. దాన్ని తీర్చేస్తా అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న సమయంలోనే బ్యాంక్ ఆఫీసర్లు అక్కడికి వస్తారు. మా తప్పయింది అని అంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అంటారు. ఏది ఏమైనా.. మీరు నన్ను ఇబ్బంది పెట్టారు.. నాకంటే చదువు రాదు. ఆ ఏజెంట్ నన్ను మోసం చేశాడు. మరి.. మీకు ఏమైంది.. ఆ ఫేక్ డాక్యుమెంట్లను చూడకుండా ఎలా లోన్ అప్రూవ్ చేశారు అని బ్యాంక్ అధికారులను నిలదీస్తుంది తులసి. సారీ తప్పయింది మేడమ్.. అంటారు. దీంతో తన 20 లక్షల చెక్ ఇచ్చేసి లోన్ రద్దు చేయండి అని చెబుతుంది తులసి.
ఆ తర్వాత సంజన ఇంటికి మ్యూజిక్ క్లాస్ కోసం బయలుదేరి వెళ్తుంది తులసి. మరోవైపు లోన్ విషయంలో బ్యాంక్ వాళ్లు మీ మమ్మీకి ఈరోజే టైమ్ ఇచ్చారు అని గాయత్రి.. అభికి చెబుతుంది. దీంతో నీతో చేసిన చాలెంజ్ లో మామ్ ఓడిపోతుంది. ఖచ్చితంగా ఇంటికి తిరిగి రావాల్సిందే అని అంకితకు ఫోన్ చేసి కనుక్కోండి అని అంటాడు అభి. దీంతో అంకితకు ఫోన్ చేస్తుంది గాయత్రి. చెప్పు మామ్ అంటుంది. నేను ఎందుకు కాల్ చేశానో తెలుసు కదా అని అడుగుతుంది. ఎవరు పే చేశారని చెప్పాలి. ఆంటి పే చేసిందని చెప్పాలా? లేక నేను పే చేశానని చెప్పాలా? ఏం చెప్పినా నీకు సంతోషమే కదా. నీతో పాటు నీ పక్కనే కూర్చొని నా మాటలు వింటున్న నీ అల్లుడిని కూడా అడుగు. ఏం జరిగితే బాగుంటుందా అని అంటుంది అంకిత. నాకు తెలిసి నీ ప్రియమైన ఆంటి లోన్ బాధ్యత నీమీదే వేసి ఉంటుంది అని అంటుంది గాయత్రి.
దీంతో కుళ్లు బుద్ధి ఉన్న మనుషులకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి అని అంటుంది అంకిత. మా ఆంటి సింహం. తన డబ్బుతోనే లోన్ రీపే చేసింది అని అంటుంది అంకిత. దీంతో అభికి కోపం వస్తుంది. నేను నా కూతురును ప్రేమిస్తున్నాను అంటుంది గాయత్రి.
దీంతో అది నువ్వు చెప్పడం కాదు. నాకు అనిపించాలి. పక్కనే ఉన్న నీ అల్లుడికి చెప్పు. ఇప్పటికైనా తన తల్లి విలువను తెలుసుకొమ్మను అని అంటుంది. మరోవైపు సంజన ఇంటికి ట్యూషన్ చెప్పేందుకు వెళ్తుంది తులసి. ఇంతలో సంజన పిలిచి ఇదుగోండి ఈ నెల మీ టూషన్ ఫీజు అంటుంది.
ఆ తర్వాత సింగింగ్ పోటీల్లో నా కొడుకు ప్రేమ్ కు చాన్స్ ఇవ్వండి అని చెబుతుంది తులసి. దీంతో సరే అండి ఇదిగోండి.. పార్టిసిపేషన్ లెటర్ అని అంటుంది సంజన. దాన్ని తీసుకొని వెంటనే సంతోషంతో ప్రేమ్ ఇంటికి వస్తుంది తులసి. ప్రేమ్ ఇంట్లో లేడు ఆంటి అంటుంది శృతి.
వాడు వచ్చేలోపు వెళ్లిపోవాలి అంటుంది. ఇంకొద్ది రోజులు ఈ సంఘర్షణ తప్పదు అంటుంది తులసి. ఇది నేను చెప్పిన పాటల పోటీలకు సంబంధించిన ఎంట్రీ ఫామ్ అని శృతికి ఇస్తుంది. వాడిని పాటలు ప్రాక్టీస్ చేయమను అని చెబుతుంది. గెలుపు మీదే దృష్టి పెట్టమను అంటుంది తులసి.
ప్రేమ్ కాంపిటిషన్ కు వెళ్లనంటున్నాడు అని అసలు నిజం చెబుతుంది శృతి. దీంతో తులసి షాక్ అవుతుంది. వాడు వెళ్లను అంటే నువ్వు వదిలేశావా.. ఒప్పించవా. అయినా వెళ్లకపోవడానికి కారణం ఏంటి. జీవితంలో ఎదగడానికి ఇంతకంటే మంచి అవకాశం వస్తుందా అని అంటుంది తులసి.
దీంతో చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు అని అంటుంది శృతి. ఇంతలో ప్రేమ్ ఇంట్లోకి వస్తాడు. దీంతో తలుపు చాటున దాక్కుంటుంది తులసి. తన చేతుల్లో ఉన్న ఎంట్రీ ఫామ్ ను ప్రేమ్ కు ఇస్తుంది. దీంతో నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పాను కదా అంటాడు ప్రేమ్.
నేను పాడే మూడ్ లో లేను అంటాడు. ఈ కాంపిటిషన్ గురించి నాతో మాట్లాడకు శృతి అంటాడు ప్రేమ్. ఆ ఎంట్రీ ఫామ్ ను చించి అవతల పారేయ్. నీ కొడుకు చేతకాని వాడని మా అమ్మకు చెప్పేయ్. నీ కొడుకు ఓడిపోయాడని మా అమ్మకు చెప్పేయ్ శృతి అని చెప్పి కోపంగా ఇంట్లో నుంచి బయటికి వస్తాడు ప్రేమ్.
దీంతో తులసి చాలా బాధపడుతుంది. ఇంతలో గాలి చిరుగాలి అనే పాట పాడుతుంది తులసి. ఈ పాట పాడింది ఎవరు అమ్మే కదా అంటాడు ప్రేమ్. దీంతో అంకిత బర్త్ డే పార్టీలో మీ అమ్మ పాడిన పాటే ఇది అంటుంది శృతి. ఆంటి కలను చింపేయాలంటే మీ మధ్య ఉన్న బంధాన్ని చంపేయడమే అంటుంది శృతి.
నువ్వు పిరికివాడిలా ఉండిపోవడం నాకు గానీ.. ఆంటికి గానీ నచ్చని విషయం. నిన్ను నువ్వు నిరూపించుకో. నువ్వు సాధించగలవు. కాంపిటిషన్ కు వెళ్తున్నావు అంతే అంటుంది శృతి. దీంతో అమ్మ పాట నన్ను ఇన్ స్పైర్ చేసింది అంటాడు ప్రేమ్.
ఎంత వరకు సాధించగలనో నాకు తెలియదు కానీ.. సిన్సియర్ గా ప్రయత్నిస్తా.. మా అమ్మ కోసం అంటాడు ప్రేమ్. ఆ తర్వా తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పాటలు రాయడం మొదలు పెడతాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.