Intinti Gruhalakshmi 6 June Today Episode : అంకిత పేరు మీద కాకుండా అభి పేరు మీద ఆస్తి.. దీంతో అంకిత షాకింగ్ నిర్ణయం.. తులసి ఏం చేస్తుంది?

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 6 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జూన్, 2022 సోమవారం ఎపిసోడ్ 651 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్ను నమ్మి మీ అత్త గారు నీకు పెద్ద బాధ్యతను అందించారు. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఎదగడానికి నీకు మంచి అవకాశం వచ్చింది. జాగ్రత్తగా ఉండు అంటుంది తులసి. దీంతో ఎవరితో జాగ్రత్తగా ఉండమంటున్నావు మామ్ అంటాడు అభి. దీంతో పార్టీలు ఇచ్చి దగ్గరవ్వాలని చూస్తారు అంటుంది తులసి. నువ్వు మాట్లాడేది డాడ్ గురించే కదా మామ్ అంటాడు అభి. ఇంటి నుంచి తరిమేసిన ప్రేమ్ కు ఇలా ఎప్పుడైనా సలహాలు ఇచ్చావా.. ఇవ్వలేదు ఎందుకంటే నీకు వాడి మీద నమ్మకం అంటాడు అభి. దీంతో నీ చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటుంది తులసి. నన్ను ఇన్ ఫ్లూయెన్స్ చేయడానికి చూడకు మామ్ అంటాడు అభి. నా మైండ్ ను పొల్యూట్ చేయకు మామ్ ప్లీజ్ అంటాడు అభి.

Advertisement

intinti gruhalakshmi 6 june 2022 full episode

నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు నీ డబ్బు అయితే నువ్వు ఏమైనా చేసుకో. కానీ.. నీ అత్త గారు నీ పేరు మీద పెట్టిన ఆస్తిని బాధ్యతగా కాపాడుకోవడం నీ వంతు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తప్పు జరిగినా నిన్ను వాళ్లు అవమానిస్తారు అంటుంది తులసి. నువ్వు ఎవరితో ఎలా ఉన్నా.. ఆస్తి విషయంలో మాత్రం జాగ్రత్త. ఏమాత్రం పొరపాటు జరిగినా అత్తారింట్లో నీకు ముఖం ఉండదు. అమ్మను కాబట్టి ఉండబట్టలేక నీకు చెప్పడానికి వచ్చాను. జాగ్రత్త పడు అని చెప్పి అక్కడి నుంచి తులసి వెళ్లిపోతుంది. దీంతో అభి.. ఆలోచనలో పడతాడు. మరోవైపు నందు, లాస్య చాలా సంతోషంగా ఉంటారు. అభి, అంకిత వాళ్ల వలలలో పడ్డారని చాలా సంతోషంగా ఉంటారు. పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది లాస్య. అదే సమయంలో భాగ్య అక్కడికి వస్తుంది. తనను ఆ పొజిషన్ లో చూసి భాగ్య షాక్ అవుతుంది.

Advertisement

వెళ్లి టీవీ ఆఫ్ చేస్తుంది భాగ్య. దీంతో డ్యాన్స్ చేస్తున్న నందు, లాస్య ఆగిపోతారు. ఎందుకు టీవీ ఆఫ్ చేశావు అంటుంది లాస్య. దీంతో ఏం సాధించారని మీరు డ్యాన్స్ చేస్తున్నారు అంటుంది భాగ్య. దీంతో మా బిజినెస్ కోసం కావాల్సిన పెట్టుబడిని సాధించాం అంటుంది లాస్య.

దీంతో మీరు ఇక్కడ డ్యాన్స్ చేయడం కాదు లాస్య.. అక్కడ అభితో తులసి డ్యాన్స్ చేపిస్తోంది అంటుంది భాగ్య. అర్జెంట్ గా మాట్లాడాలని అభిని పిలిపించుకొని బ్రెయిన్ వాష్ చేసింది అని చెబుతుంది. మీరేంటో.. మీరేం చేయాలనుకుంటున్నారో సినిమా వేసి మరీ అభీకి చూపించింది.

Intinti Gruhalakshmi 6 June Today Episode :  తులసి మీద విరుచుకుపడ్డ లాస్య, నందు

అంతే కాదు లాస్య అంటూ ఇంకా ఏవేవో సీక్రెట్స్ అన్నీ భాగ్య లాస్యకు చెబుతుంది. అదీ సంగతి అంటుంది. ఆలు లేదు చూలు లేదు కానీ.. మీరేమో ఎవరెస్ట్ శిఖరం మీద జెండా పాతినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు అని అంటుంది భాగ్య.

తులసక్క డైరెక్ట్ గా రంగంలోకి దిగిందంటే.. వార్ తప్పదు అంటుంది. మనం కూడా జాగ్రత్త పడితే మంచిది అంటుంది భాగ్య. బావ గారికి విడాకులు ఇచ్చినా ఇంకా తన ప్రాపర్టీనే అని అనుకుంటుందేమో అని అంటుంది భాగ్య. దీంతో తన పీక పిసికేస్తా అంటుంది లాస్య.

దీంతో కోపంతో రగిలిపోయి.. వెంటనే తులసి ఇంటికి వెళ్తారు లాస్య, నందు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ ప్రశ్నిస్తాడు నందు. మమ్మల్ని రోడ్డుకు లాగుదామనుకుంటున్నావా అంటాడు. నాటకాలు ఆడకు అంటాడు నందు.

దీంతో నా పరిస్థితే బాగోలేదు.. మిమ్మల్ని రోడ్డు మీదికి లాగేంత ఓపిక నాకు లేదు అంటుంది తులసి. ఇంతో పరందామయ్య, అనసూయ ఇద్దరూ అక్కడికి వస్తారు. బీపీ పెరిగినప్పుడల్లా వాడికి ఈ ఇల్లు గుర్తొస్తుందా అని అంటుంది అనసూయ.

జీవితంలో తులసి చేసిన తప్పు ఒక్కటే.. నిన్ను నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ఎలాగూ ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తుంది కదా అని అంటుంది అనసూయ. ఇంట్లో ప్రతి వాళ్లను నీ గుప్పిట్లో పెట్టుకొని ఆడిద్దామనుకుంటున్నావా.. నా పిల్లలను నాకు దూరం చేద్దామనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు నందు.

అభి నా మాట వింటే చెడిపోతాడా అంటాడు నందు. దీంతో ఖచ్చితంగా చెడిపోతాడు అంటాడు పరందామయ్య. నేనే అభికి నీ గురించి చెప్పమని చెప్పా అంటాడు పరందామయ్య. మీరు మా విషయంలో నాకు అడ్డు పడకండి అంటుంది తులసి.

నా గురించి అభికి మీరు చెప్పాల్సింది చెప్పుకోండి.. మీ గురించి నేను చెప్పాల్సింది చెబుతాను. నిర్ణయం వాడిది అని చెబుతుంది తులసి. అమ్మ లాస్య.. నువ్వు కూడా వాడిని అనవసరంగా రెచ్చగొట్టకు అంటాడు పరందామయ్య. దీంతో వీళ్లకు మాటలతో చెప్పి లాభం లేదు నందు. చెయ్యాల్సింది చేసి చూపిద్దాం పదా అని అంటుంది లాస్య. దీంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మరోవైపు అంకితకు దివ్య ఫోన్ చేస్తుంది. వదిన.. చదువుకున్న నీకన్నా చదువు లేని మామ్ చాలా నయం అంటుంది దివ్య. డాడ్ అంటే ఎంత ప్రేమ ఉన్నా.. ఆయన తప్పులను ఎత్తి చూపించింది. నువ్వు మాత్రం అన్నయ్యను గాలికి వదిలేశావు. తప్పులు చేస్తున్నాడని తెలిసినా పట్టించుకోవడం లేదు ఎందుకు అలా అంటుంది దివ్య.

మామ్ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోంది అంటుంది దివ్య. దీంతో ఏమైంది దివ్య అంటుంది అంకిత. మీకేదో ప్రాపర్టీ కలిసి వచ్చింది అట కదా. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమని.. డాడ్ కు మనీ ఇవ్వొద్దని చెప్పిందట. దీంతో ఆ విషయం అభి అన్నయ్య డాడ్ కు చెప్పి ఉంటాడు. దీంతో డాడ్, లాస్య ఆంటి వచ్చి గొడవ పెట్టుకున్నారు అంటుంది దివ్య.

నీ బర్త్ డే పార్టీలో అసలు ఏం జరిగిందో నీకు తెలుసా. నీకు ప్రాపర్టీ కలిసి వస్తే మామ్ కు తెలియకూడదని అందరూ అనుకున్నారట. అది విని.. మామ్ అందుకే నిన్ను దూరంగా ఉంచింది అని అసలు విషయం చెబుతుంది దివ్య. దీంతో అంకిత షాక్ అవుతుంది.

కేవలం ఆంటీ చెప్పిందనే ఒకే ఒక్క మాటతో నేను, అభితో కలిసి మా ఇంటికి వచ్చాను కానీ.. మా మామ్ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అని కోపంతో తన తల్లి దగ్గరికి వెళ్లి తనపై సీరియస్ అవుతుంది అంకిత. నీ కూతురును అందలం ఎక్కిస్తున్నావని అనుకుంటున్నావా.. చేజేతులా నీ కూతురు కాపురాన్ని ముక్కలు చేస్తున్నావు. ముందు అది తెలుసుకో అంటుంది అంకిత.

నువ్వు మీ మమ్మీ మనసుతో ఆలోచించు అంటుంది గాయత్రి. అల్లుడిని కన్న తల్లి నుంచి దూరం చేసి ఇల్లరికం ఉంచుకోవడం మంచి అనిపిస్తోందా నీకు. ఎదురు దెబ్బలు తట్టుకొని కష్టాలకు ఎదురీదుతున్న తులసి ఆంటిని కష్టపెట్టడం నీకు మంచిగా అనిపిస్తోందా అంటుంది అంకిత.

ఆస్తి నా పేరు మీదికి రాగానే.. అదంతా నేను తులసి ఆంటి పేరు మీద రాస్తా అని గాయత్రిని బెదిరిస్తుంది అంకిత. దీంతో లాస్యకు ఈ విషయం తెలిసి.. ఆస్తిని అభి పేరు మీదికి రాయించండి అని గాయత్రికి సలహా ఇస్తుంది లాస్య. దీంతో గాయత్రి కూడా ఓకే చెబుతుంది. అభి కూడా చాలా సంతోషిస్తాడు. లాస్యకు థాంక్స్ చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Instagram Love : ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ తో మొదలైన ప్రేమ.. చివరకు హత్య చేసేవరకు వెళ్ళింది !!

Instagram Love : సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ఎంతటి ప్రమాదకరంగా మారుతాయో చెప్పడానికి మహారాష్ట్రకు చెందిన యువతి సియా…

40 minutes ago

Teerdham in a Temple : వామ్మో…తీర్థం ఇస్తున్న మిషన్..ఇదేం టెక్నాలజీ రా బాబు.. వైరల్ వీడియో

Teerdham in a Temple : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా ఈ టెక్నాలజీ…

2 hours ago

World Largest Tree: 2200 ఏళ్ల చరిత్ర.. 275 అడుగుల ఎత్తు.. ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షేర్మన్’ గురించి మీకు తెలుసా?

World Largest Tree: ప్రకృతిలో మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో ఒకటి కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్…

3 hours ago

iPhone 17e Review: అదిరిపోయే ఫీచర్లు, తక్కువ ధర? ఫిబ్రవరి 19న ఐఫోన్ 17ఈ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

iPhone 17e Review: యాపిల్ నుంచి రాబోతున్న కొత్త ఫోన్ గురించి టెక్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే…

4 hours ago

PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం తీపికబురు..!

PM-Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్…

4 hours ago

Farmer : రైతులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ వడ్డీతో రూ.3 లక్షలు అందిస్తున్న కేంద్రం..!

Farmer : రైతులకు గుడ్ న్యూస్ .. అతి తక్కువ వడ్డీతో రూ.3 లక్షలు అందిస్తున్న కేంద్రం : దేశంలోని…

5 hours ago

Gold Rates Today 16 February 2026: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..!

Gold Rates Today 16 February 2026: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత…

6 hours ago

Brahmamudi 2026 February 16th Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 16 ఎపిసోడ్: “వాళ్లను చంపేయండి” – రుద్రాణి ఆర్డర్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన రాజ్, కావ్య!

Brahmamudi 2026 February 16th Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 16 ఎపిసోడ్: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్…

7 hours ago