
intinti gruhalakshmi 6 october 2022 full episode
Intinti Gruhalakshmi 6 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఇంటింటి గృహలక్ష్మి 6 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 756 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంగ్రాట్స్ సామ్రాట్ గారు. మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అని సామ్రాట్ తో చెబుతుంది. నేను ముందే చెబుదామనుకున్నా అంటాడు సామ్రాట్. మీరు ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది.. అంటుంది. కంపెనీకి ఏది చెడు, ఏది మంచి అనేది తెలిసింది మీకే అంటుంది తులసి. నేను తప్పు చేయగానే తప్పుకుందామని అనుకున్నా అంటుంది తులసి. మనస్ఫూర్తిగా చెబుతున్నావా తులసి నువ్వు అని అడుగుతుంది లాస్య. దీంతో అవును.. మనస్ఫూర్తిగా నేను చెబుతున్నా.. అంటుంది తులసి.
intinti gruhalakshmi 6 october 2022 full episode
సామ్రాట్ గారు. తులసి చేసిన చిన్న తప్పును వదిలేసి తనకు ఏదైనా అర్హత గల పోస్ట్ ఇప్పించండి అని అడుగుతుంది లాస్య. దీంతో నాకు ఏమీ వద్దు. నేను ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదు. మళ్లీ నన్ను ఆ పంజరంలో బంధించకండి అని చెప్పి మేము వెళ్లొస్తాం అని సామ్రాట్ కు చెప్పి అక్కడి నుంచి తులసితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా అందరూ వెళ్లిపోతారు. ఇంటికి వచ్చాక తులసి కుటుంబ సభ్యులు అందరూ బాధతో ఉంటారు. కానీ.. అభి, అనసూయ మాత్రం మంచిది అయింది. గౌరవం లేని చోట ఉద్యోగం చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు అభి. మామ్ జాబ్ పోయినందుకు నాకు బాదలేదు కానీ.. జాబ్ లో నుంచి తీసేసిన పద్ధతి నాకు నచ్చలేదు అని అంటాడు అభి. ఈ విషయం మామ్ కు అర్థం అయ్యేలా మీరే చెప్పండి అంటాడు అభి. దీంతో తులసిని జాబ్ లో నుంచి తీసేయడం ఆయన సొంత నిర్ణయం కాకపోవచ్చు.. ఎవరో ఆయన్ను బలవంతం చేస్తే ఆయన ఈ పని చేశాడు అంటాడు పరందామయ్య.
కట్ చేస్తే సామ్రాట్.. హనీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాబాయి వస్తాడు. తులసిని మేనేజర్ పోస్ట్ లో నుంచి ఎందుకు తీసేశావు అని అడుగుతాడు. నువ్వే తులసిని నెత్తిన ఎక్కించి నిర్దాక్షిణ్యంగా కిందికి తోశావు అంటాడు బాబాయి.
తులసి చేసిన తప్పేంటి. నిన్ను గుడ్డిగా నమ్మటమా? అంటాడు బాబాయి. హనీ విషయంలో నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా అండగా నిలబడటమా? ఏంట్రా తను చేసిన తప్పు అని అడుగుతాడు బాబాయి.
నీ తొందరపాటు వల్ల అందరి దృష్టిలో తులసి చేతగానిదని ముద్రపడింది అంటాడు బాబాయి. నీతి లేనిది అని ముద్రపడితే చెడుపుకోవడం చాలా కష్టం బాబాయి అంటాడు సామ్రాట్. ఎవర్రా ఆ మాట అన్నది అంటాడు బాబాయి.
తులసి వాళ్ల ఇంట్లో వాళ్లకే సమస్య అని చెబుతాడు. తులసి గారిని ఆఫీసుకు దూరం చేయమని అనసూయమ్మ గారు స్వయంగా వచ్చి నన్ను అడిగారు అని అసలు నిజం చెబుతాడు సామ్రాట్. దీంతో బాబాయి షాక్ అవుతాడు.
ఆ తర్వాత ప్రేమ్ విషయంలో కూడా జరిగినదాన్ని చెబుతాడు సామ్రాట్. నేను మౌనంగా ఉండకపోతే తులసి గారి ఫ్యామిలీ ఇలాంటి సంఘటనలే ఫేస్ చేయాల్సి వస్తుంది అంటాడు సామ్రాట్.
తులసి తప్పు చేయలేదు. పీఏను అడ్డుపెట్టుకొని తులసి తప్పు చేసేలా నేనే ప్లాన్ చేశాను అంటాడు సామ్రాట్. మరోవైపు తులసితో మాట్లాడిన ప్రేమ్.. ఫంక్షన్ లో జరిగిన అవమానానికి నీకు బాధగా అనిపించలేదా అని అడుగుతాడు ప్రేమ్.
నిజం చెప్పు అమ్మ అని అందరూ అడుగుతారు. అవమానం జరిగిందని మీరు అనుకుంటున్నారు కానీ.. నాకు అలా అనిపించడం లేదు. నెత్తి మీద నుంచి పెద్ద బండరాయిని తీసి కింద పెట్టుకున్నట్టు ఉంది అంటుంది తులసి.
ఎందుకు టెన్షన్.. సంగీతం పాఠాలు చెప్పుకుంటే చాలు.. ఇల్లు ఈజీగా గడిచిపోతుంది అని సర్దిచెబుతుంది అనసూయ. నాకేదో అయిందని ఎవ్వరూ టెన్షన్ పడకండి. ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
ఈరోజు నుంచి మ్యూజిక్ స్కూల్ కు సంబంధించిన విషయాలు నువ్వు, నందు చూసుకోవాలి అని అంటాడు సామ్రాట్. తులసిని వద్దనుకున్నప్పుడు మ్యూజిక్ స్కూల్ తో పనేంటి. టైమ్ వేస్ట్ కదా అంటుంది తులసి.
దీంతో నేను మొదలు పెట్టిన ఏ ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడానికి వీలు లేదు. జస్ట్ డు వాట్ ఐసే అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్బాట్లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
This website uses cookies.