Intinti Gruhalakshmi
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
Intinti Gruhalakshmi 6 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 6 సెప్టెంబర్ 2021, సోమవారం తాజాగా రిలీజ్ అయింది. ఎపిసోడ్ 417 లేటెస్ట్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చేస్తున్నావు ప్రేమ్ బంగారం.. అంటూ అక్షర.. ప్రేమ్ బొమ్మను గీచి.. ఆ బొమ్మతో మాట్లాడుతుంది. వెంటనే ప్రేమ్ కు ఫోన్ చేస్తుంది. ప్రేమ్ తన ఫోన్ ను చూసి ఎవరు కాల్ చేశారు అని అనుకుంటాడు.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
హలో.. అంటాడు. దీంతో అక్షర చాలా ఖుషీ అవుతుంది. మరో సారి హలో అంటాడు. హలో అన్నా కూడా తను ఏం మాట్లాడదు. ఎవరండి మీరు.. ఫోన్ చేసి ఏం మాట్లాడటం లేదు.. అంటాడు. ప్రేమ్ కు ఫోన్ చేస్తే గొంతులో నుంచి మాట రావడం లేదేంటి అనుకుంటుంది. ప్రేమ్ కు చిరాకు వచ్చి.. ఫోన్ కట్ చేస్తాడు. మళ్లీ ఫోన్ చేస్తుంది. దీంతో.. హలో అని ఎవరండి.. మీరు ఫోన్ చేసి తెగ విసిగిస్తున్నారు.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
ప్రేమ్.. ఆంటీ మనకు ఒక పని చెప్పారు.. బయటికి వెళ్దాం పదా.. అంటుంది శృతి. ఏంటి.. ఆలోచిస్తున్నావు అనగానే.. ఏం లేదు శృతి అంటుంది. 5 మినట్స్ రెడీ అయి వస్తాను అని చెబుతాడు. బయటికి వెళ్లినప్పుడు ఈసారి ఎలాగైనా ప్రపోజ్ చేయాలి.. అని అనుకుంటాడు ప్రేమ్.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
తను లోపలికి వెళ్లగానే.. మళ్లీ ఫోన్ వస్తుంది. ఈసారి శృతి లిఫ్ట్ చేస్తుంది. హలో.. అంటుంది ఆడగొంతు వినేసరికి.. షాక్ అవుతుంది అక్షర. ఇందాక నుంచి పదే పదే ప్రేమ్ కు ఫోన్ చేసి విసిగిస్తోంది మీరేనా.. అని అంటుంది శృతి. విసిగిస్తోంది నేను కాదు. మధ్యలో ఫోన్ తీసిన నువ్వు.. అంటుంది అక్షర.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
అసలు.. మీరెవరు.. ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు.. అనగానే.. అసలు నీకు ఆ ఇంట్లో ఏం పని.. నువ్వెవరు.. అని అంటుంది అక్షర. ఇద్దరూ బాగానే తిట్టుకుంటారు. ఒకరి మీద మరొకరు తిట్టుకుంటారు. నాతోనే ఇంత పొగరుగా మాట్లాడుతావా? అనగానే.. నీలాంటి వాళ్లకు అస్సలు ఈ ఇంట్లో స్థానమే లేదు.. అనగానే నువ్వెవరు అని అంటుంది. ఆ ఇంటికి కాబోయే కోడలును నేను. నేను త్వరలోనే ఆ ఇంటికి కోడలును కాబోతున్నా. ప్రేమ్ కు కాబోయే భార్యను నేను.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అక్షర. అసలు.. ఎవరు ఈమె.. అని అనుకుంటుంది శృతి.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
కట్ చేస్తే.. ప్రేమ్ రెడీ అయి వస్తాడు. వెళ్దాం పదా.. అంటాడు. ఇంతలోనే నందు పిలిచి.. నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. నేను ఇప్పుడు పని మీద బయటికి వెళ్తున్నాను.. తర్వాత మాట్లాడుతా.. అంటాడు ప్రేమ్. దీంతో తులసి కూడా వచ్చి మాట్లాడి వెళ్లు.. అంటాడు. దీంతో కుటుంబ సభ్యులను అందరినీ పిలుస్తాడు నందు.
ఏంటి నాన్న ఇదంతా.. నాతో మాట్లాడాలని ఇంట్లో వాళ్లను అందరినీ పిలిచారు ఎందుకు.. అనగానే.. ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడాలని పిలిచాను అంటాడు. సరే.. చెప్పండి అనగానే ప్రేమ్ కు ఒక సంబంధం చూశాను అని చెబుతాడు. జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీ అధినేత జీకే గారు నన్ను కలిశారు. అంత పెద్ద కంపెనీ అధినేత నిన్నెందుకు కలిశాడు.. అని అడుగుతాడు వాళ్ల నాన్న.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
బిజినెస్ కోసం కాదు.. సంబంధం కలుపుకోవడం కోసం… అంటాడు నందు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు ఉంది. పేరు అక్షర. మన ప్రేమ్ ను ఏదో ఈవెంట్ లో చూసిందట. ప్రేమ్ ను పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుందట.. అని నందు అనగానే.. తను ఆశ పడితే నేను పెళ్లి చేసుకోవాలా? అంటాడు ప్రేమ్. ఆ అమ్మాయి ఎవరో చూసి ఇష్టపడితే నేను పెళ్లి చేసుకోవాలా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటాడు ప్రేమ్.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
జీకే గారిది గొప్పింటి సంబంధం. వాళ్ల అమ్మాయిని చేసుకుంటే ప్రేమ్ జీవితం బాగుంటుంది. అందుకే ఆ సంబంధం తీసుకొచ్చాను.. అని చెప్తాడు నందు. ఇన్ని రోజులు నువ్వు నందు గురించి పట్టించుకోకుండా.. ఇప్పుడే నందు గురించి సంబంధం తీసుకురావడం ఏంటి.. అని అడుగుతాడు నందు నాన్న.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
నందు తెచ్చిన సంబంధాన్ని వాళ్ల అమ్మ సపోర్ట్ చేస్తుంది. వాళ్ల నాన్న.. డైరెక్ట్ గా ప్రేమ్ నే అడుగుతాడు.. సంబంధం తీసుకొచ్చింద ప్రేమ్ నే కాబట్టి.. ప్రేమ్ చేసుకుంటాడో లేదో.. చెప్పు అంటూ ప్రేమ్ ను అడుగుతాడు నందు నాన్న. దీంతో ప్రేమ్ ఆ విషయం చెప్పడానికి చాలా సేపు ఆలోచిస్తాడు. ఏరా చెప్పరా.. అని నందు అనగానే నాకు ఇష్టం లేదు నాన్నా.. అంటాడు.
ఏరా.. ఎందుకు ఇష్టం లేదు.. అనగానే.. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను కానీ.. ఎందుకు అనేది నేను చెప్పను.. అనగానే ఎందుకో చెప్పాల్సిందే అని పట్టుబడతాడు నందు. ఈ సంబంధం చేసుకుంటే లక్ష మంచి కారణాలు ఉన్నాయి. ఎందుకు చేసుకోకూడదో ఒక్క కారణం చెప్పు.. అంటే.. నేను వద్దు అనడానికి నా దగ్గర బలమైన కారణం ఉంది.. అని చెబుతాడు ప్రేమ్.
ఈ సంబంధం వద్దనడానికి ఏం కారణం ఉందో చెప్పు ప్రేమ్.. అని లాస్య చెబుతుంది. దీంతో శృతి గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటాడు ప్రేమ్. శృతి విషయం చెప్పబోతుండగా… తులసి అడ్డుకుంటుంది. ఉన్నపళంగా ఇప్పుడే నువ్వు తొందరపడి ఏ కారణం చెప్పకు. ఆలోచించుకొని చెప్పు ప్రేమ్ అని చెబుతుంది తులసి.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
లేదమ్మా.. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఇదే ఉంటుంది. నేను ఈ పెళ్ల చేసుకోను అమ్మా. సరే.. నేను ఆలోచించుకొని చెబుతాను.. అని చెబుతాడు ప్రేమ్. మీరు ఏమనుకున్నా ఇప్పుడు మాత్రం నేను సమాధానం చెప్పలేను.. అని చెబుతాడు ప్రేమ్.
ఈ పెళ్లి చేసుకోవడానికి వాడికి ఏం ప్రాబ్లమో నాకైతే అర్థం కావడం లేదు.. అని అంటాడు నందు. నందుకే తన తల్లి కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవడానికి ప్రేమ్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి.. అని అంటుంది నందు తల్లి.
కట్ చేస్తే.. నందుకు తీవ్రంగా కోపం వస్తుంది. ప్రేమ్ పెళ్లికి ఒప్పుకోలేదని తీవ్రంగా కోపానికి గురవుతాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా?.. అని లాస్య వచ్చి అంటుంది. నేను నీకు ముందే చెప్పాను.. ఇది జరుగుతుంది అని ముందే చెప్పాను కదా. ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది లాస్య.. ఇది నీకు, నాకు సంబంధించిన విషయం కాదు లాస్య.. నా కొడుకు పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి.. ఖచ్చితంగా అందరి ముందు మాట్లాడాలి.. అని నందు చెబితే.. ప్రేమ్ అక్షరను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. లేదంటే మన కంపెనీయే మూత పడుతుంది.. అని లాస్య చెబుతుంది.
ఇంతలోనే జీకే గారు నందుకు ఫోన్ చేస్తారు. చెప్పండి.. అనగానే మన సంబంధం విషయం ఎంత వరకు వచ్చింది.. అనగానే ప్రేమ్ ఆలోచించుకొని చెప్తా అన్నాడు. సడెన్ గా పెళ్లి అనేసరికి వాడు కొంచెం భయపడ్డాడు. త్వరలోనే చెబుతాడండి.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
Intinti gruhalakshmi 6 september 2021 monday full episode 417 highlights
జీకేకు అబద్ధం ఎందుకు చెప్పావు.. అనగానే మరి ఏం చెప్పాలి.. ఇంట్లో జరిగిన రచ్చ అంతా చెప్పమంటావా? అంటాడు. ఇప్పుడు అన్ని విషయాలు చెప్పాలంటే ఎలా? నా కొడుకు నా మాట వినడం లేదు.. నన్ను నమ్మడం లేదు. వాడికి శృతి అంటే ఇష్టం అని చెప్పమంటావా? అని లాస్యతో అంటాడు.
కట్ చేస్తే పెళ్లివాళ్లు ఓ గంటలో వస్తున్నారని తులసికి చెబుతాడు నందు. ఓ గంట సరిపోతుంది కదా.. అనగానే.. ప్రేమ్ మనసులో ఉన్న విషయం చెప్పడానికి కాస్త సమయం కావాలన్నాడు. ఆ మాత్రం సమయం కూడా ఇవ్వలేరా? అని అంటుంది తులసి. తన మాట పట్టించుకోడు నందు. నాన్నా ఏంటి ఇదంతా.. అని అడుగుతాడు ప్రేమ్. నాకు ఇంకా టైమ్ కావాలని చెప్పాను కదా అంటాడు. చూడు ప్రేమ్. ప్రస్తుతానికి నువ్వు నేను చెప్పేది విను. వెళ్లి ముందు రెడీ అవ్వు.. అని అంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది.. అని తులసి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.