
intinti gruhalakshmi 7 may 2022 full episode
Intinti Gruhalakshmi 7 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 మే 2022, శనివారం ఎపిసోడ్ 626 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లక్కీ.. తులసి దగ్గరికి వచ్చి తనను హత్తుకుంటాడు. దీంతో లాస్య, నందుకు తెగ కోపం వస్తుంది. తులసి తనను ముద్దాడటంతో లాస్యకు కోపం వచ్చి తన దగ్గరికి వస్తుంది. హాస్టల్ నుంచి ఇంటికి రాగానే నువ్వు కనిపించలేదు. చాలా బాధగా అనిపించింది అంటాడు. అసలు అందరూ వేర్వేరు ఇళ్లలోకి ఎందుకు మారారు. మామ్ ను అడిగితే నోర్మూసుకో అంది అంటాడు లక్కీ. దీంతో ఇప్పుడు కూడా అదే అంటాను. నిన్ను హాస్టల్ నుంచి తీసుకొచ్చింది నాతో ఉండేందుకు అంటుంది. తులసి ఆంటితో ఉంటే నీకేంటి బాధ. నాకు తులసి ఆంటి అంటే ఇష్టం అంటుంది. ఏంట్రా నీ బాధ అంటూ లక్కీని కొట్టబోతుంది లాస్య. దీంతో తన చేయిని ఆపుతుంది తులసి.
intinti gruhalakshmi 7 may 2022 full episode
ఇంతలో పరందామయ్య, అనసూయ ఇద్దరూ లాస్యపై విరుచుకుపడతారు. మా అమ్మానాన్నను నాకు దూరం చేసిందే తులసి.. అంటాడు నందు. దీంతో నువ్వే కదరా.. పెళ్లాం కొంగు పట్టుకొని పారిపోయావు అంటారు పరందామయ్య, అనసూయ. మీకు తులసి మందు పెట్టింది. నా కొడుకు విషయంలో కూడా అదే చేయాలనుకుంటోంది. చచ్చినా అలా జరగనివ్వను అంటుంది లాస్య. తులసి జరిగిందంతా చూస్తూ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. ఇక నావల్ల కావడం లేదు. వీళ్లకు సమాధానం చెబుతాను అంటుంది ప్రవళిక. దీంతో నువ్వెవరు నా ఫ్యామిలీ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవడానికి అంటుంది లాస్య. ఈవిడ తులసి ఫ్రెండ్ అనుకుంటా అంటాడు నందు.
మీ దగ్గర దొరకని ఆప్యాయత ఏదో వాడికి తులసి దగ్గర దొరుకుతోంది. అందుకే వాడు తులసి వైపు చూస్తున్నాను. ఆ ఆప్యాయత మీరు చూపిస్తే వాడు తులసి వైపు చూడడు. మారాల్సింది మీరు అని వాళ్లకు క్లాస్ పీకుతుంది ప్రవళిక. దీంతో అక్కడి నుంచి నందు, లాస్య.. తమ కొడుకును తీసుకొని వెళ్తారు.
ఇంతలో అక్కడికి ప్రేమ్, అభి కూడా వస్తారు. తులసి, నానమ్మ, తాతయ్య, దివ్యను కలుస్తారు. అందరూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నాక.. ఫౌండేషన్ వేడుకల కోసం లోపలికి వెళ్తారు. ఇంతలో వేడుకలు ప్రారంభం అవుతాయి. అనాధలైన ఎంతో మంది ఆడవాళ్లకు మధర్ థెరిస్సా ఫౌండేషన్ ఆసరాగా చూపించిందని చెబుతారు.
కాసేపట్లో బెస్ట్ మదర్ కోసం కాంపిటిషన్ ఇంకాసేపట్లో మొదలు కాబోతోంది అంటారు. కాంపిటిషన్ కు ఎన్ రోల్ చేసుకున్న తల్లులు రెడీగా ఉన్నారా అని అడుగుతారు. అందులో తులసి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటుంది లాస్య.
దీంతో నందు.. తన పేరు రాయిస్తాడు. ఈ కాంపిటిషన్ లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ మీలో అమ్మతనానికి పరీక్ష అంటారు. మొదటి రౌండ్ స్టార్ట్ అవుతుంది. పిల్లలను పిలిచి వాళ్ల ఇష్టాలను సీక్రెట్ గా తెలుసుకుంటారు.
దీంతో వాటిని తల్లులు చెప్పాలన్నమాట. ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు. లాస్య దగ్గరికి వచ్చి లక్కీని ఫేవరేట్ ఫుడ్ ఏంటో రాయమంటారు. తను రాస్తాడు. లాస్యను అడుగుతారు. దీంతో లాస్య చెప్పలేకపోతుంది. తులసి ఆంటి మీరు చెప్పండి.. నా ఫేవరేట్ ఫుడ్ ఏంటి అని అడుగుతాడు లక్కీ. దీంతో పాస్తా అని చెబుతుంది తులసి. కరెక్ట్ ఆన్సర్ కానీ.. లాస్య ఓడిపోతుంది.
ఇక.. తులసి వంతు వస్తుంది. ప్రేమ్ ను ప్రశ్న అడుగుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తి పేరు రాయండి అని అడుగుతుంది యాంకర్. దీంతో ప్రేమ్ రాస్తాడు. మీ అబ్బాయికి ఎవరంటే బాగా ఇష్టమో చెప్పండి అని తులసిని అడుగుతుంది. దీంతో కాసేపు ఆలోచించి.. అమ్మ అంటుంది తులసి. దీంతో ఫస్ట్ రౌండ్ లో తులసి గెలుస్తుంది.
ఇక.. రెండో రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈరౌండ్ లో పిల్లలు తమ తల్లి ఎందుకు గ్రేటో చెప్పాలి అంటారు. అందరూ సమాధానాలు చెబుతుంటారు. ఇంతలో తులసి వంతు వస్తుంది. అభి మైక్ తీసుకుంటాడు. ఏ తల్లి అయినా బిడ్డకు ఒక్కసారే జన్మను ఇస్తుంది.. కానీ.. మా మామ్ నాకు మూడు సార్లు జన్మనిచ్చింది అంటాడు అభి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.